ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు
కనపడేవెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు…
మనకిలా ఎదురైన ప్రతి వారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరు…
సరిగా చూస్తున్నదా నీ మది
గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు
నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి
వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరూ అన్నీ కలిపితే
నువ్వే కాదా కాదా…
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీ పైన భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
రుతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుక చావు రెండే రెండు
నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం
రంగులు ఏం వేస్తావో కానీ…
entavaraku endukoraku inta parugu ani aDakku
gamanamE nee gamyamaitE baaTalOnE bratuku doruku
praSnalOnE badulu undE gurtupaTTE gunDenaDugu
prapancham neelO unnadani cheppEdaaka aa nijam telusukOvaa
telistE pratIchOTa ninu nuvE kalusukoni palakarinchukOvaa
entavaraku endukoraku inta parugu ani aDakku
gamanamE nee gamyamaitE baaTalOnE bratuku doruku
praSnalOnE badulu undE gurtupaTTE gunDenaDugu
kanapaDEvennenni keraTaalu
kalagalipi samudramanTaaru
aDagarE okkokka ala pEru…
manakilaa eduraina prati vaaru
manishanE sandraana keraTaalu
palakarE manishi anTE evaru…
sarigaa chUstunnadaa nee madi
gadilO nuvvE kadaa unnadi
chuTTU addaalalO viDiviDi roopaalu
nuvvu kaadanTunnadi
nee UpirilO lEdaa gaali
veluturu nee choopullO lEdaa
mannu minnu neerU annI kalipitE
nuvvE kaadaa kaadaa…
prapancham neelO unnadani cheppEdaaka aa nijam telusukOvaa
telistE pratIchOTa ninu nuvE kalusukoni palakarinchukOvaa
manasulO nee paina bhaavaalE
bayaTa kanipistaayi dRSyaalai
neeDalu nijaala saakshyaalE
Satruvulu neelOni lOpaalE
snEhitulu neekunna ishTaalE
rutuvulu nee bhaava chitraalE
eduraina mandahaasam neelOni chelimi kOsam
mOsam rOsham dvEsham nee makili madiki bhaashyam
puTTuka chaavu renDE renDu
neekavi sontam kaavu pOnI
jeevitakaalam needE nEstam
rangulu Em vEstaavO kaanI…
Comments
Post a Comment