లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరి వేణు గానం
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా
ఆ.. పగటి బాధలన్ని మరిచిపోవుటకు ఉంది కాద ఎ ఏకాంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
ఎటో పోయెటి నీలి మేఘం వర్షం చిలికి వెల్లసాగే
ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలకించసాగే
అన్ని వైపులా మధువనం పులుపూయదా అనుక్షణం
అణువణువునా జీవితం అందచేయదా అమృతం
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరి వేణు గానం
Comments
Post a Comment