ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపని
నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని
ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా
నేను అని లేను అని చెబితే ఏంచేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లే పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటానని
తల వాల్చి నీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని
ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా
నీ అడుగై నడవటమే పయనమన్నది పాదం
నిను విడిచీ బతకటమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదని
నిను కలుసుకున్నా ఆ క్షణం నను వదిలిపోదని
ప్రతి గడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని
ఈ మహిమ నీదేనని నీకైన తెలుసా అని నీకు చెప్పాలని
ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపని
నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని
ఒకేఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకేఒక మాట పెదవోపలేనంత తీయంగా
Comments
Post a Comment