రంగులలో కలవో యద పొంగులలో కళవో (2)
నవశిల్పానివో రతిరూపానివో తొలి ఊహల ఉయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
కాశ్మీర నందన సుందరివో (2)
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో (2)
మధుని బాణమో మదుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా
రంగులలో కలనై
ముంతాజు అందాల దానివో (2)
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో (2)
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై
Comments
Post a Comment