కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా
కలిపి చూడాలి నింగి నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యేలా
హే.. చలి పుట్టే ఎండల్లొన చెమటొచ్చె వానేదైనా
కనిపెడదాం కాసేపైనా
నైనో క్లాక్ కూసే కొడి రౌండ్ ద క్లాక్ ఆడి పాడి
సరదాగా గడిపేద్దామా

ప్రియురాలై ఈ నేల ఆకాశం చూసే వేళా
కదిలొచ్చే ప్రతి చినుకు ఒ ముత్యం అయిపోలేదా
ప్రతి పువ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లో
ఈ గాలి జో లాలి పాడాలి ఇలలో
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెద్దం ఇప్పటికైనా హో…
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్హేద్దం ఇప్పటికైనా హో…
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా
చెయ్యెత్తి పిలిచానా చుక్కల్లో చంద్రుడు కూడా
పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళో పూవైపోడా
కొమ్మలనే కుర్చీలా వాడే కోయిలా
వాసంతం విరిసింది కూ అనవే ఎలా
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హో..
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హో..
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా
కలిపి చూడాలి నింగి నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యేలా
హే.. చలి పుట్టే ఎండల్లొన చెమటొచ్చె వానేదైనా
కనిపెడదాం కాసేపైనా
నైనో క్లాక్ కూసే కొడి రౌండ్ ద క్లాక్ ఆడి పాడి
సరదాగా గడిపేద్దామా
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేలా
Comments
Post a Comment