Skip to main content

నా కంటి పాప కన్నీటి పాలు కాక

నా కంటి పాప కన్నీటి పాలు కాక
నీ లాలి పాటై నేనుండగా
నీ చూపులోనే వెలగాలి కాంతి రేఖ
నిన్నల్లో నీవు నిదురించక
రాసేది ఎవరూ మన జాతకాలు
చెరపాలి మనమే ఆ జ్ఞాపకాలు
నా కంటి పాప కన్నీటి పాలు కాక
నిన్నల్లో నీవు నిదురించక

నా కాలి గురుతే నడిపించు నిన్నూ
ఈ గోరుముద్దే తినిపించ నివ్వూ
మనిషల్లే నీకు వచ్చింది ప్రాయం
మనసుంది గనకే తగిలింది గాయం
గిల్లింది నిన్నూ ముళ్ళంటి లోకం
పువ్వంటి నీలో చిందింది రక్తం
ఆ రక్త వర్ణం మందార పువ్వు
ఆ బాధ మరిచి మనసార నవ్వు
నా కంటి పాప కన్నీటి పాలు కాక
నిన్నల్లో నీవు నిదురించక

గతమాయే కాలం కథ మారిపోయే
తడి కన్ను కూడా పొడి ఆరిపోయే
అమ్మల్లే నువ్వు చూసావు నన్ను
ఈ జన్మ నీకే అమ్మాను నేను
మనకున్న బంధం బంధాలకందం
నీవేలే నాకు నిలువెత్తువర్ధం
దీపాలకన్నా నీ చూపు వెలుగు
వేదాలకన్నా నీ మాట తెలుగు

నా కంటి పాప కన్నీటి పాలు కాక
నీ లాలి పాటై నేనుండగా
రాసేది ఎవరూ మన జాతకాలు
చెరపాలి మనమే ఆ జ్ఞాపకాలు
నా కంటి పాప కన్నీటి పాలు కాక
నిన్నల్లో నీవు నిదురించక

naa kanTi paapa kanneeTi paalu kaaka
nee laali paaTai nEnunDagaa
nee choopulOnE velagaali kaanti rEkha
ninnallO neevu nidurinchaka
raasEdi evarU mana jaatakaalu
cherapaali manamE aa jnaapakaalu
naa kanTi paapa kanneeTi paalu kaaka
ninnallO neevu nidurinchaka

naa kaali gurutE naDipinchu ninnU
ee gOrumuddE tinipincha nivvU
manishallE neeku vacchindi praayam
manasundi ganakE tagilindi gaayam
gillindi ninnU muLLanTi lOkam
puvvanTi neelO chindindi raktam
aa rakta varNam mandaara puvvu
aa baadha marichi manasaara navvu
naa kanTi paapa kanneeTi paalu kaaka
ninnallO neevu nidurinchaka

gatamaayE kaalam katha maaripOyE
taDi kannu kooDaa poDi aaripOyE
ammallE nuvvu choosaavu nannu
ee janma neekE ammaanu nEnu
manakunna bandham bandhaalakandam
neevElE naaku niluvettuvardham
deepaalakannaa nee choopu velugu
vEdaalakannaa nee maaTa telugu

naa kanTi paapa kanneeTi paalu kaaka
nee laali paaTai nEnunDagaa
raasEdi evarU mana jaatakaalu
cherapaali manamE aa jnaapakaalu
naa kanTi paapa kanneeTi paalu kaaka
ninnallO neevu nidurinchaka

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...