Skip to main content

హే.. జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా

హే.. జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమే లేదంటా
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంటా
అల్లదిగో ఆశల ద్వీపం కళ్ళెదుటే ఉందంటా
ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంటా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బ్రతుకాట
ఆట ఆట అనుకుంటే బతకటమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట

హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా
సరదాగా సాగదు వేట నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంతా
పులి మీద స్వారీ కూడా అలవాటు ఐపోదా
సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట
తలవంచుకు రావలసిందే ప్రతి విజయం నీవెంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమే లేదంటా
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంటా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బ్రతుకాట

హే.. చెలిమితో గెలుచుకో చెలితో వలపాట
అతిలోకసుందరి రాదా జత కోరి నీ వెంట
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట
జగదేకవీరుడు కూడా మనలాంటి మనిషంటా
ఇటునుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా
దివి నుంచేం దిగి రాలేదు మన తారాగణమంతా
మనలోను ఉండుంటారు కాబోయే ఘనులంటా
పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బ్రతుకాట
ఆట ఆట అనుకుంటే బతకటమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట

hE.. jenDaapai kapiraajunTE radhamaapEdevaranTaa
gunDellO nammakamunTE bedurenduku padamanTaa
allaaddeen adbhuta deepam avasaramE lEdanTaa
challaarani nee sankalpam tODunTE chaalanTaa
alladigO aaSala dveepam kaLLeduTE undanTaa
ellalanE tenchE vEgam mEghaalu taakaalanTaa
aaTa aaTa nuvu nilabaDi chooDaku E chOTa
aaTa aaTa idi gelavaka tappani bratukaaTa
aaTa aaTa anukunTE batakaTamoka aaTa
aaTa aaTa kaadanTE baruvE pratipooTa

hE mundugaa telusukO munigE lOtentaa
saradaagaa saagadu vETa naTTETa edureeta
telivigaa maluchukO naDichE daarantaa
puli meeda swaarI kooDaa alavaaTu aipOdaa
saadhinchE sattaa unTE samaram oka sayyaaTa
talavanchuku raavalasindE prati vijayam neevenTaa
allaaddeen adbhuta deepam avasaramE lEdanTaa
challaarani nee sankalpam tODunTE chaalanTaa
aaTa aaTa nuvu nilabaDi chooDaku E chOTa
aaTa aaTa idi gelavaka tappani bratukaaTa

hE.. chelimitO geluchukO chelitO valapaaTa
atilOkasundari raadaa jata kOri nee venTa
teguvatO tElchukO cheDutO chelagaaTa
jagadEkaveeruDu kooDaa manalaanTi manishanTaa
iTununchE aTu veLLaaru sinimaa heerOlantaa
divi nunchEm digi raalEdu mana taaraagaNamantaa
manalOnu unDunTaaru kaabOyE ghanulanTaa
paikostE jai koDataaru abhimaanulai janamantaa
aaTa aaTa nuvu nilabaDi chooDaku E chOTa
aaTa aaTa idi gelavaka tappani bratukaaTa
aaTa aaTa anukunTE batakaTamoka aaTa
aaTa aaTa kaadanTE baruvE pratipooTa

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...