ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి
నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ
ఓ పాప లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి
ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి
Comments
Post a Comment