కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే (2)
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే (2)
కడలై పొంగిన మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే
మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే
దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగ నేస్తం
దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే
యదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే
మిన్నేటి మెరుపల్లే విహరిస్తా అణుక్షణమే
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే
పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే
ఆశే చిన్న తామరముల్లై వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచెం బలపడి మళ్ళీ ఉసిగొలిపే
అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెతికే
అయినా దాగే యదలో ఏదో ఒక మైకం
ఇదే ప్రేమ తొలిమలుపా xxxxx(?) చెలి తలపా
ఒక మోహం ఒక పాశం కుదిపేసే కథ మధురం
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
Requested by Lavanya
Comments
Post a Comment