కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే (2)
సొగసులకొక రంగు నవ్వించే కులుకులకొక రంగు
వలపులకొక రంగు వెంటాడే వయసుకు ఒక రంగు
కన్నెపిల్ల గుండెలోని రంగులన్ని చూడకుండ
మొండికేసుకుంటు గుండె దాచుకోకొయ్..
కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే (2)
లేత ఎరుపు రంగుటుంది బుగ్గలకి
నువ్వు కొరికి కుంకుమలాగా అవ్వాలి
గులాబిల రంగుంటుంది పెదవులకి
నువ్వు చిదిపి సింధూరంలా మారాలి
పిచ్చిదైన నాలో కోరిక వెచ్చనైన ఊపిరి తాకగ
పుచ్చపండు రంగులు చిమ్మి అల్లుకుంటుంది
కన్నెపిల్ల గుండెలోని రంగులన్ని చూడకుండ
మొండికేసుకుంటు గుండె దాచుకోకొయ్..
కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే
తెల్ల మబ్బు రంగులు పులిమిన నవ్వుల్లో
నిన్ను ఇంక నమిలెయ్యాలని ఆశుంది
సముద్రాల నీలం కలిగిన కళ్ళల్లో
నిన్ను నేడు ముంచేయాలని మోజుంది
అంతలేసి రంగులు చూపిన సందెలోని నింగిని పోలిన
యవ్వనాన్ని నీకే నేను కానుకిస్తున్నా
కన్నెపిల్ల గుండెలోని రంగులన్ని చూడకుండ
మొండికేసుకుంటు గుండె దాచుకోకొయ్..
కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే (2)
Comments
Post a Comment