మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతి చెడి దాహమై అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించనా
చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుకనిస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరునినికే రుణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతి చెడి దాహమై అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించనా
చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుకనిస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరునినికే రుణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
Comments
Post a Comment