Rajubhai – “Evvare Nuvvu” Peradi:
ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు
టైమయ్యింది షాపింగంటు షాపులన్ని తిప్పావు
మరి నాకు ఓ పరుసుందంటు తెలిసేలా చేసావు
అప్పులెన్నో చేసాను గిఫ్టులెన్నో ఇచ్చాను నీతోనే అన్నాను
ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా వెన్నులో నొప్పే పెంచావు
ఎటు చూసినా ఏం చేసినా ఏ బారులో అడుగేసినా,
నలువైపులా అమ్మాయిల్ని చూసా నిన్నా మొన్నా
ఏ పబ్బులో డాన్సాడినా ఏ మత్తులో తేలాడినా
నాకెక్కడ అడ్డులేదులే నిన్నా మొన్నా
ఎప్పటికైనా ఏ అబ్బాయికైనా గల్ ఫ్రెండ్ ఉంటే ఇంతేనా
అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా దూల బాగా తీరుతోందిగా
ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు
నలకా నలక నలక నలక నువు నా కంట్లో నలకా నలక నలక నలకా
చెలి చూపులో గుండుసూదులే ప్రతిమాటలో పదిబూతులే
తొలిప్రేమ నే వద్దనుకున్నా వదలదే ఐనా
నా దారిలో తను లీనమై నా నిన్నలన్ని శూన్యమై
నా జీవితం విస్తరాకే అన్నా ఏమిచేస్తున్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దారుణం అయ్యాను
వీడని దిగులై వదలనన్నావు
చెలి ఉండగా బతికేదెలా ఈ లవ్వులన్ని అంతా ట్రాషులే
ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వే తీసావు
తెలవారింది భయపడమంటు ప్రతిరోజూ చెప్పావు
మరి నీకు నే బానిసనంటు తెలిసేలా చేసావు
పిడుగల్లే పడ్డావు మతిమరపే ఇచ్చావు నన్నే హింసించావు
Comments
Post a Comment