నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా (2)
నీ కనుల ఒడిలో నే కలనా కాటుకనా
నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా
నీ సొగసు పొగడ నే కవినా కల్పననా
నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా
నే బిడియ పడితే నువు గిలివా చెక్కిలివా
నే విరహమైతే నువు రతివా కోరికవా
నే పాపనైతే నువు ఒడివా ఊయలవా
నే నిదురనైతే నువు కలవా కౌగిలివా
నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా
నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా
నే గగనమైతే వేసవివా వెన్నెలవా
నే నదిని ఐతే నువు అలవా అలజడివా
నే విందునైతే నువు రుచివా ఆకలివా
నే భాషనైతే నువు స్వరమా అక్షరమా
నే పాటనైతే నువు శృతివా పల్లవివా
నే.. నే.. నే తోటనైతే ఆమనివా కోయిలవా
నే జంటకొస్తే నువు రుషివా మదనుడివా
నీ ఎదుట పడితే పిలిచేవా వలచేవా
నిను నేను పిలవకుంటే నువు అలగవా అడగవా
నన్ను ప్రేమించమంటే తప్పా ఒప్పా
నీలోన ఉందీ నేనేకదా నేనేకదా
నాలోన ఉందీ నీవే కదా నీవే కదా
యదలోని వలపే ఎదురెదురు చూసి వాన లాగా ఒడిచేరెనే
Comments
Post a Comment