నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో (2) నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని (2) నాలో సాగిన నీ అడుగుతో చూసాను మన నేర్పుని పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2) వెన్నెల వెలుగే వినిపించని నడిరేయి కరిగించనీ నా పెదవిలో దూరి నాకే చిరునవ్వు పుడుతుందనీ నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందని ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో (2) తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనదే మరోకొత్త జన్మం పొందేటి బంధాలతో నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో