ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
వచ్చీరాని వయ్యారాలే వయసాయే
మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే
నిజమా… అమ్మమ్మా…
చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో సుడులు రేగింది
పెదవి తొనల మెరుపు కంటే ఉరుములా నాలో ఉడుకు రేగింది
గుబులో దిగులో వగలైపోయే వేళలో
తనువు తనువు తపనై తాకే వేడిలో
మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా
నిజమా… అమ్మమ్మా…
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
చిగురు తొడిగే సొగసుకంటే పొగరుగా ప్రాయం రగిలిపోయింది
ఉలికి నడుము కదుపుతుంటే తొలకరింతల్లో తొడిమ రాలింది
కుడివైపదిరే శకునాలన్ని హాయిలే
ప్రియమో ఏమో నయగారాలే నీదిలే
గోరింటాకు పూపొద చలి ఆపదా ఇక ఆపదా
నిజమా… అమ్మమ్మా…
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
enta ghaaTu prEmayO paarijaatamaa
ETavaalu choopulO mounageetamaa
vacchIraani vayyaaraalE vayasaayE
maLLI maLLI saayantraalE manasaayE
nijamaa… ammammaa…
chilipi kanula kaburu vinTE biDiyamO EmO suDulu rEgindi
pedavi tonala merupu kanTE urumulaa naalO uDuku rEgindi
gubulO digulO vagalaipOyE vELalO
tanuvu tanuvu tapanai taakE vEDilO
malli jaaji junnulaa chali vennela musirEnilaa
nijamaa… ammammaa…
enta ghaaTu prEmayO paarijaatamaa
ETavaalu choopulO mounageetamaa
chiguru toDigE sogasukanTE pogarugaa praayam ragilipOyindi
uliki naDumu kaduputunTE tolakarintallO toDima raalindi
kuDivaipadirE Sakunaalanni haayilE
priyamO EmO nayagaaraalE needilE
gOrinTaaku poopoda chali aapadaa ika aapadaa
nijamaa… ammammaa…
enta ghaaTu prEmayO paarijaatamaa
ETavaalu choopulO mounageetamaa
Comments
Post a Comment