సమీరా… సమీరా… సమీరా… సమీరా…
ఒక్కసారి ఐ లవ్ యు అనవే సచ్చిపోతా
ఈ లైఫుతో నాకేం పనిలేదని రెచ్చిపోతా
నువ్వొక్కసారి 143 అనవే రాలిపోతా
నీ లవ్వుకన్న లక్కేదీ లేదని రేగిపోతా
యహె సైట్లు వద్దు ఏ కోట్లు వద్దు
నా కోహినూరు నువ్వంటా
ఏ పాట్లు రాని అగచాట్లు రాని
నీ ప్రేమతో బతికేస్తా
నిను దేవతల్లే పూజిస్తా
ఓ దెయ్యమల్లే సాధిస్తా
నువు లొంగనంటే ఏం చేస్తా
నే బ్రహ్మచారిగా పుచ్చిపోతా
సమీరా… సమీరా…
నీ ఇంటి ముందు టెంటు వేసుకుంటా
మైకు పెట్టి రచ్చ రచ్చ చేస్తా
అప్పుడైన తిట్టుకుంటు చెప్పవే ఐ లవ్ యు
వీధి వీధి పాదయాత్ర చేస్తా
సంతకాలు లక్ష సేకరిస్తా
అందుకైన మెచ్చుకుంటు అనవే 143
అసలెందుకంట నేనంటె మంట తెగ చిటపటమంటావే
కొవ్వున్న చోట లవ్వుంటదంట అది నిజమని అనుకోవే
బతిమాలి గతిమాలి అడిగా నిన్నే
సమీరా… సమీరా…
దండమెట్టి నిన్ను కాక పడతా
దండలేసి కోకనట్సు కొడతా
వెయ్యి పేర్లు దండకాలు చదువుతు ప్రేమిస్తా
తిండి మాని బక్క చిక్కిపోతా
మందు దమ్ము అన్ని మానుకుంటా
ఏడుకొండలెక్కి గుండు కొడతా ఏటేటా
నీకోసమింత చేస్తున్నదంత నువు చూసీ చూడవుగా
ఏం మాయ సంత అని తిట్టుకుంటు వెళ్ళిపోతే వదలనుగా
వెనకొస్తా విసిగిస్తా నువు మారేదాకా
sameeraa… sameeraa… sameeraa… sameeraa…
okkasaari ai lav yu anavE sacchipOtaa
ee laifutO naakEm panilEdani recchipOtaa
nuvvokkasaari 143 anavE raalipOtaa
nee lavvukanna lakkEdI lEdani rEgipOtaa
yahe saiTlu vaddu E kOTlu vaddu
naa kOhinooru nuvvanTaa
E paaTlu raani agachaaTlu raani
nee prEmatO batikEstaa
ninu dEvatallE poojistaa
O deyyamallE saadhistaa
nuvu longananTE Em chEstaa
nE brahmachaarigaa pucchipOtaa
sameeraa… sameeraa…
nee inTi mundu TenTu vEsukunTaa
maiku peTTi raccha raccha chEstaa
appuDaina tiTTukunTu cheppavE ai lav yu
veedhi veedhi paadayaatra chEstaa
santakaalu laksha sEkaristaa
andukaina mecchukunTu anavE 143
asalendukanTa nEnanTe manTa tega chiTapaTamanTaavE
kovvunna chOTa lavvunTadanTa adi nijamani anukOvE
batimaali gatimaali aDigaa ninnE
sameeraa… sameeraa…
danDameTTi ninnu kaaka paDataa
danDalEsi kOkanaTsu koDataa
veyyi pErlu danDakaalu chaduvutu prEmistaa
tinDi maani bakka chikkipOtaa
mandu dammu anni maanukunTaa
EDukonDalekki gunDu koDataa ETETaa
neekOsaminta chEstunnadanta nuvu choosI chooDavugaa
Em maaya santa ani tiTTukunTu veLLipOtE vadalanugaa
venakostaa visigistaa nuvu maarEdaakaa
Comments
Post a Comment