వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే వెచ్చని అల్లరే నాదైతే
ఊహలకేవో రెక్కలు రాగా ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో…
వెన్నెల్లో ఆడపిల్ల నేనయితే వెచ్చని అల్లరే నీదైతే
ఊహలకేవో రెక్కలు రాగా ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో…
మేఘాలే ముగ్గులు పెట్టే వేళల్లో దేహాలే ఉగ్గులు కోరే దాహంలో
చందమామే మంచం ఓహో హో… సర్దుకుందాం కొంచెం
అహోరాత్రులు ఒకే యాత్రలో రహస్యాల రహదారిలో ఆకాశవీధిలో…
వెన్నెల్లో ఆడపిల్ల నేనయితే వెచ్చని అల్లరే నాదైతే
భూదేవే బిత్తరపోయే వేగంలో నా దేవే నిద్దురలేచే విరహంలో
తోకచుక్కై చూస్తా ఓహో హో… సోకు లెక్కే రాస్తా
ముల్లోకాలకే ముచ్చేమటేయగా ముస్తాబంత ముద్దాడుకో ఆకాశవీధిలో…
వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే వెచ్చని అల్లరే నాదైతే
ఊహలకేవో రెక్కలు రాగా ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో…
వెన్నెల్లో ఆడపిల్ల నేనయితే…
Comments
Post a Comment