ప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు గుప్పెట్లో దాగున్నావు
చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు
పండుగ నీవు నా పచ్చిక నీవు
పండుగ నీవు నా పచ్చిక నీవు
మోహమే మంటగా రగులుతున్నా
లోకమే నీవుగా మునిగిఉన్నా
గాలిలో ఈకలా తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరిఉన్నా
నీ శ్వాస కోసం మానై ఉంటా
నీ మాట కోసం మునినైపోతా
నీ చూపు కోసం శిలనై ఉంటా
నీ నవ్వు కోసం అలుసైపోతా
జాబిలికే వెన్నెల నీవు సూర్యునికే వేకువ నీవు
ఊపిరిలో ఉష్ణం నీవు ఊరించే తృష్ణం నీవు
శూన్యం నీవు నా శోకం నీవు
శూన్యం నీవు నా శోకం నీవు
వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పీ నన్నాదుకోవా
నీ తోడు కోసం ఆవిరైపోనా
నీ స్పర్శ కోసం చినుకైరానా
నీ అడుగు తాకి గుడినైపోనా
నీ గుండెలోకి సడినై రానా
నీలానికి నింగివి నీవు కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు భావానికి మూలం నీవు
ఎవ్వరికోసం జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం
ఎవ్వరికోసం జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం
prEyasi kaavu nEstam kaavu
gunDellO ninDunnaavu guppeTlO daagunnaavu
cheekaTlO velugistaavu jagamantaa kanipistaavu
panDuga neevu naa pacchika neevu
panDuga neevu naa pacchika neevu
mOhamE manTagaa ragulutunnaa
lOkamE neevugaa munigiunnaa
gaalilO eekalaa tElutunnaa
neeTilO raatalaa chediriunnaa
nee Swaasa kOsam maanai unTaa
nee maaTa kOsam muninaipOtaa
nee choopu kOsam Silanai unTaa
nee navvu kOsam alusaipOtaa
jaabilikE vennela neevu sooryunikE vEkuva neevu
oopirilO ushNam neevu oorinchE tRshNam neevu
Soonyam neevu naa SOkam neevu
Soonyam neevu naa SOkam neevu
vEsavi varshamai kurisipOvaa
vecchani vEkuvai veligiraavaa
maaTatO roopamai taraliraavaa
nirNayam cheppI nannaadukOvaa
nee tODu kOsam aaviraipOnaa
nee sparSa kOsam chinukairaanaa
nee aDugu taaki guDinaipOnaa
nee gunDelOki saDinai raanaa
neelaaniki ningivi neevu kaalaaniki gamyam neevu
chalanaaniki Saktivi neevu bhaavaaniki moolam neevu
evvarikOsam jaabili vEsham
kammani kaavyam ee vennela deepam
evvarikOsam jaabili vEsham
kammani kaavyam ee vennela deepam
Comments
Post a Comment