గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై
ప్రతిజన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో వెలిగే లయనే బదులు పలకని
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేదా నేనే మేలుకొలుపై
గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పరదాల మంచు పొరలో ఉండిపోని
గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నా ఊహల్లో కదిలే కళలే ఎదుటపడినవి
నా ఊపిర్లో ఎగసే సెగలే కుదుటపడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోని
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ
గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై
ప్రతిజన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
gaganaaniki udayam okaTE keraTaalaki sandram okaTE
jagamantaTa praNayam okaTE okaTE
praNayaaniki nilayam manamai yugayugamula payanam manamai
pratijanmalO kalisaam manamE manamE
janminchalEdaa neevu naa kOsamE
gurtinchalEdaa nannu naa praaNamE
prEmaa prEmaa prEmaa prEmaa
gaganaaniki udayam okaTE keraTaalaki sandram okaTE
jagamantaTa praNayam okaTE okaTE
nee kannullO kalanu aDugu itaDu evaranI
nee gunDellO veligE layanE badulu palakani
nidurinchu yavvanamlO poddupoDupai
kadilinchalEdaa nEnE mElukolupai
gata janma jnaapakaannai ninnu piluvaa
paradaala manchu poralO unDipOni
gaganaaniki udayam okaTE keraTaalaki sandram okaTE
jagamantaTa praNayam okaTE okaTE
naa UhallO kadilE kaLalE eduTapaDinavi
naa UpirlO egasE segalE kuduTapaDinavi
samayaanni SaaSvatamgaa nilichipOnI
mamatanna amRtamlO munigipOni
manavaina ee kshaNaalE aksharaalai
mRti lEni prEmakathagaa migilipOnI
gaganaaniki udayam okaTE keraTaalaki sandram okaTE
jagamantaTa praNayam okaTE okaTE
praNayaaniki nilayam manamai yugayugamula payanam manamai
pratijanmalO kalisaam manamE manamE
janminchalEdaa neevu naa kOsamE
gurtinchalEdaa nannu naa praaNamE
prEmaa prEmaa prEmaa prEmaa
Comments
Post a Comment