Skip to main content

పిలిచిన పలకదు ప్రేమా

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా
అందని వరమే ప్రేమా
మనసుకు తొలి కలవరమా
ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఏమికాదు క్షణికం
అన్ని తానే ప్రణయం
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా (2)
పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా

వలపును చినుకుగ భావించా అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా
ఎన్నేళ్ళో ఎదురీత ఎన్నాళ్ళీ యద కోత
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటే అది ప్రేమది కాదే
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమా…. ప్రేమా… ప్రేమా…
పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా

మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ భాదే కొలిమై పోయేనా
ఆపాలి ఏదోలా చెబుతావా ప్రియురాలా
నీడై నీతో పాటూ సాగాలనుకున్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియా
నింగి నేల కలవవని
నీడే మనిషిని తాకదని
ప్రేమా…. ప్రేమా… ప్రేమా…
ఆపిన ఆగదు ప్రేమా
దాచిన దాగదు ప్రేమా
మనసును కలుపును ప్రేమా
మహిమలు చూపును ప్రేమా
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం
ప్రేమించాలి హృదయం
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా (4)

pilichina palakadu prEmaa
valachina dorakadu prEmaa
andani varamE prEmaa
manasuku toli kalavaramaa
prEmE madhuram prEmE padilam
Emikaadu kshaNikam
anni taanE praNayam
ai lav yu lav yu raa ai lav yu lav yu raa (2)
pilichina palakadu prEmaa
valachina dorakadu prEmaa

valapunu chinukuga bhaavinchaa adi naa tappu kadaa
varadani telisina ee taruNam yaatana tappadugaa
ennELLO edureeta ennaaLLI yada kOta
prEmE aaTa kaadu gelupu OTami lEdu
laabham nashTam chooDaku prEmavadu
tappunTE adi prEmadi kaadE
tappantaa prEminchina naadE
prEmaa…. prEmaa… prEmaa…
pilichina palakadu prEmaa
valachina dorakadu prEmaa

manasunu tarimina cheekaTulE chelimiga maarEnaa
idivarakerugani ee bhaadE kolimai pOyEnaa
aapaali EdOlaa chebutaavaa priyuraalaa
neeDai neetO paaTU saagaalanukunnaanE
nEDE telisenu naaku O cheliyaa
ningi nEla kalavavani
neeDE manishini taakadani
prEmaa…. prEmaa… prEmaa…
aapina aagadu prEmaa
daachina daagadu prEmaa
manasunu kalupunu prEmaa
mahimalu choopunu prEmaa
prEmE gaganam prEmE sahanam
prEmE kaadaa udayam
prEminchaali hRdayam
ai lav yu lav yu raa ai lav yu lav yu raa (4)

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...