Skip to main content

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

నెలే పొడిచనని చంద్రుడొచ్చెనని తుళ్ళే పడెనులే నా హృదయం
నీడ చూసిన నువ్వేనంటు ఈ హృదయం పొంగీ పొరలును (2)
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
కళ్ళలో కలిసెనో అమ్మమ్మా వేకువే చెరిపెనో
కవితనెతికివ్వండి లేక నా కలను తిరిగివ్వండి
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

సంధ్య వేళలో మనసు మూల మరుగైన మోము మది వెతికెలే
మండుటెండలో నగర వీధిలో మసలి మసలి మది వాడెలే
మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు మధ్య నిన్ను మది వెతికెలే
అలల నురుగులో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెతికెలే
సుందర వదనం ఒకపరి చూచినా మనసే శాంతించూ
ముని వేళ్ళతో నువు ఒకపరి తాకిన మళ్ళి మళ్ళి పుట్టెదనే
నెలే పొడిచనని చంద్రుడొచ్చెనని తుళ్ళే పడెనులే నా హృదయం
నీడ చూసిన నువ్వేనంటు ఈ హృదయం పొంగీ పొరలును (2)
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శ మది కోరెలే
ముద్దులిచ్చు మురిపాల సెగలను ఎల్లవేళలా కోరెలే
చెమట నీటినే మంచి గంధముగ ఎంచమనె మది కోరెలే
మోము పైన కేశములు గుచ్చిన తీపి హాయి చెంప కోరెలే కోరెలే..
ఏ.. రాయితో చేసిన మనసే నాదని చెలియకు తెలిపితినే
ఏ.. రాయి మధ్యలో పెరిగిన లతలా నువ్వు నాలో తొలచితినే
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

nelE poDichanani chadruDocchenani tuLLE paDenulE naa hRdayam
neeDa choosina nuvvEnanTu ee hRdayam pongI poralunu (2)
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa
kaLLalO kalisenO ammammaa vEkuvE cheripenO
kavitanetikivvanDi lEka naa kalanu tirigivvanDi
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa

sandhya vELalO manasu moola marugaina mOmu madi vetikelE
manDuTenDalO nagara veedhilO masali masali madi vaaDelE
mabbu chindu chiru chinuku chinukuku madhya ninnu madi vetikelE
alala nurugulO kalala prEmikuni gucchi gucchi madi vetikelE
sundara vadanam okapari choochinaa manasE SaantinchU
muni vELLatO nuvu okapari taakina maLLi maLLi puTTedanE
nelE poDichanani chadruDocchenani tuLLE paDenulE naa hRdayam
neeDa choosina nuvvEnanTu ee hRdayam pongI poralunu (2)
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa

okE choopunu okE maaTanu okE sparSa madi kOrelE
muddulicchu muripaala segalanu ellavELalaa kOrelE
chemaTa neeTinE manchi gandhamuga enchamane madi kOrelE
mOmu paina kESamulu gucchina teepi haayi chempa kOrelE kOrelE..
E.. raayitO chEsina manasE naadani cheliyaku telipitinE
E.. raayi madhyalO perigina latalaa nuvvu naalO tolachitinE
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa
Emaaye naa kavita kalalalO raasukunna kavitaa

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...