నువ్వంటే ఇష్టమనీ నీక్కూడా తెలుసుకదా
ఆ ఇష్టం పేరిదనీ స్పష్టంగా లేదుకదా
పోన్లే అని ఊరుకొని వదిలేస్తే తప్పుకదా
ప్రేమ ఇట ఉంటుందంటే ఇదీ అదే కదా
నువ్వంటే ఇష్టమనీ నీక్కూడా తెలుసుకదా
ఆ ఇష్టం పేరిదనీ స్పష్టంగా లేదుకదా
రెప్పలు వాలే చూపుల్లో వెతుక్కోనా
చెప్పక దాచే ఊసేదో కనుక్కోనా
అసలెప్పటినుంచో మనసులో మెదులుతూ ఉన్నా గమనించనేలేదే
నాకెప్పటినుంచో అంతో ఇంతో తెలుస్తూ ఉన్నా పట్టించుకోలేదే
ఇపుడో అపుడొ అంటూ వేచి చూస్తున్నా
మిణుగురులాగా మారనా యదలో తిరిగి చూడనా
నీ రూపమే కదా ఎదురవుతుంది అక్కడ
నువ్వంటే ఇష్టమనీ నీక్కూడా తెలుసుకదా
ఆ ఇష్టం పేరిదనీ స్పష్టంగా లేదుకదా
ఇద్దరి మధ్య ఏముందో తెలుస్తున్నా
బయటికి రాదే మాటల్లో వినాలన్నా
ఇది ప్రేమికులంతా ఎదుర్కొనే సమస్యేనేమో అతి సహజమేనేమో
అది నిజమే అయితే మరింక ఏమనాలో ఏమో మన కథ ప్రేమేనేమో
ప్రేమే అయితే పేచీ లేదుగా మనకి
అవునని మనసు నమ్మినా పలకవు ఎంత అడిగినా
నా గుండె లయలలో సందడి నిన్ను తాకదా
నువ్వంటే ఇష్టమనీ నీక్కూడా తెలుసుకదా
ఆ ఇష్టం పేరిదనీ స్పష్టంగా లేదుకదా
పోన్లే అని ఊరుకొని వదిలేస్తే తప్పుకదా
ప్రేమ ఇట ఉంటుందంటే ఇదీ అదే కదా
nuvvanTE ishTamanI neekkooDaa telusukadaa
aa ishTam pEridanI spashTamgaa lEdukadaa
pOnlE ani Urukoni vadilEstE tappukadaa
prEma iTa unTundanTE idI adE kadaa
nuvvanTE ishTamanI neekkooDaa telusukadaa
aa ishTam pEridanI spashTamgaa lEdukadaa
reppalu vaalE choopullO vetukkOnaa
cheppaka daachE UsEdO kanukkOnaa
asaleppaTinunchO manasulO medulutU unnaa gamaninchanElEdE
naakeppaTinunchO antO intO telustU unnaa paTTinchukOlEdE
ipuDO apuDo anTU vEchi choostunnaa
miNugurulaagaa maaranaa yadalO tirigi chooDanaa
nee roopamE kadaa eduravutundi akkaDa
nuvvanTE ishTamanI neekkooDaa telusukadaa
aa ishTam pEridanI spashTamgaa lEdukadaa
iddari madhya EmundO telustunnaa
bayaTiki raadE maaTallO vinaalannaa
idi prEmikulantaa edurkonE samasyEnEmO ati sahajamEnEmO
adi nijamE ayitE marinka EmanaalO EmO mana katha prEmEnEmO
prEmE ayitE pEchI ledukaa manaki
avunani manasu namminaa palakavu enta aDiginaa
naa gunDe layalalO sandaDi ninnu taakadaa
nuvvanTE ishTamanI neekkooDaa telusukadaa
aa ishTam pEridanI spashTamgaa lEdukadaa
pOnlE ani Urukoni vadilEstE tappukadaa
prEma iTa unTundanTE idI adE kadaa
Comments
Post a Comment