ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమిచెయ్యనయ్యో రామా
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో… భయం దేనికో

వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువు గనకా
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథను తొందరగా
ప్రతీచోట నీ నవ్వే పిలుస్తుందిగా
నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమిచెయ్యనయ్యో రామా
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కలా
అయోమయంగా వెయ్యకలా హాయి వలా
నీమీదకొచ్చి ఉరితాడేం వాలదుగా వాలు జడ
దానొంక చూసి ఎందుకట గుండె దడ
మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే
నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమిచెయ్యనయ్యో రామా
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో… భయం దేనికో
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమిచెయ్యనయ్యో రామా
unnamaaTa cheppaneevu UrukunTE oppukOvu inkelaagE satyabhaamaa
nannudaaTi veLLalEvu ninnu nuvvu daachalEvu EmicheyyanayyO raamaa
anukunnaa tappu kadaa mOmaaTam muppu kadaa
manasaitE undi kadaa manamaaTEm vinadu kadaa
pantam maanukO… bhayam dEnikO

vaddannakoddi tunTarigaa tiragakalaa naa venakaa
niddarlO kooDa onTarigaa vadalavugaa
nannaaSa peTTi ee saradaa nErpinadE nuvu ganakaa
naa kongu paTTi naDavanidE kudaradugaa
aDugaDuguna eduraitE E daari tOchadugaa
aTu iTu eTu tElchavugaa mana kathanu tondaragaa
pratIchOTa nee navvE pilustundigaa
nannudaaTi veLLalEvu ninnu nuvvu daachalEvu EmicheyyanayyO raamaa
unnamaaTa cheppaneevu UrukunTE oppukOvu inkelaagE satyabhaamaa
amaayakangaa chooDakalaa vEDukalaa chilipi kalaa
ayOmayamgaa veyyakalaa haayi valaa
neemeedakocchi uritaaDEm vaaladugaa vaalu jaDa
daanonka choosi endukaTa gunDe daDa
mari mari SRti minchi ilaa nanu maimarapinchakalaa
taDabaDi tala vanchi ilaa talapunu aNichEstE elaa
marEm cheyyanE neetO elaa vEganE
nannudaaTi veLLalEvu ninnu nuvvu daachalEvu EmicheyyanayyO raamaa
unnamaaTa cheppaneevu UrukunTE oppukOvu inkelaagE satyabhaamaa
anukunnaa tappu kadaa mOmaaTam muppu kadaa
manasaitE undi kadaa manamaaTEm vinadu kadaa
pantam maanukO… bhayam dEnikO
unnamaaTa cheppaneevu UrukunTE oppukOvu inkelaagE satyabhaamaa
nannudaaTi veLLalEvu ninnu nuvvu daachalEvu EmicheyyanayyO raamaa
Comments
Post a Comment