Skip to main content

కోపమా నాపైనా ఆపవా ఇకనైనా

హొయ్.. కోపమా నాపైనా ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగదే ఇటుపైనా
ఎంతలా నసపెడుతున్నా లొంగిపోనె లలనా
దరిచేరిన నెచ్చెలిపైన దయచూపవా కాస్తైనా
మనదారులు ఎప్పటికైనా కలిసేనా ఓ.. ఓ..

హొ... కస్సుమని కారంగా కసిరినది చాలింకా
ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడదాక కలిసి అడుగెయ్యవుగా
కనుల వెనకే కరిగిపోయే కలవు గనుకా
నను గొడుగై కాసే నువ్వు పిడుగును కురిపిస్తావా
నువు గొడుగుని ఎగరేస్తావే జడివానా హొ..
ఓ.. కోపమా నాపైనా ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా

హొ... తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియ బొమ్మా చెరిపినా చెరగదు గనుక
సులువుగా నీలాగా మరిచిపోలేదింకా
మనసు విలువ నాకు బాగా తెలుసు గనుకా
ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హొ..

హా.. కోపమా నాపైనా ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా

hoy.. kOpamaa naapainaa aapavaa ikanainaa
antagaa busa koDutunTE nEnu taaLagalanaa
chaalulE nee naTana saagadE iTupainaa
entalaa nasapeDutunnaa longipOne lalanaa
darichErina necchelipaina dayachoopavaa kaastainaa
manadaarulu eppaTikainaa kalisEnaa O.. O..

ho... kassumani kaaramgaa kasirinadi chaalinkaa
urumu venaka chinuku taDigaa karagavaa kanikaaramgaa
kudurugaa kaDadaaka kalisi aDugeyyavugaa
kanula venakE karigipOyE kalavu ganukaa
nanu goDugai kaasE nuvvu piDugunu kuripistaavaa
nuvu goDuguni egarEstaavE jaDivaanaa ho..
O.. kOpamaa naapainaa aapavaa ikanainaa
antagaa busa koDutunTE nEnu taaLagalanaa

ho... tirigi ninu naadaakaa chErchinadi chelimEgaa
manasulOni cheliya bommaa cheripinaa cheragadu ganuka
suluvugaa neelaagaa marichipOlEdinkaa
manasu viluva naaku baagaa telusu ganukaa
egasE ala EnaaDainaa tana kaDalini viDichEnaa
vadilEstE tirigocchEnaa kshaNamainaa ho..

haa.. kOpamaa naapainaa aapavaa ikanainaa
antagaa busa koDutunTE nEnu taaLagalanaa

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...