ఈ పేరడీ పాట అద్బుత లిరిక్స్ ని కించపరచటనికి కాదు.......కేవలం కాసింత హాస్యానికి మాత్రమే. ఈ పాట ట్యూన్ "ఆకలి రాజ్యం" సినిమా లో "సాపాటు ఎటూలేదు" కి సరిపోయేట్టు రాయబడినది..... ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ (2) గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ (2) మన వర్కు తలనొప్పి మన క్లైంటు వెన్నునొప్పి మన జాబు సుద్దవేస్టురా తమ్ముడూ మన పోస్టు మంచు కొండరా (2) శాలరీలు పుచ్చుకొని బైకుచేత పట్టుకొని గల్లీలు తిరిగినాము వీకెండ్ వీకెండ్ అంటున్నాము కంపెనీని శాసించే భావి లీడర్లం బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సాఫ్టువేరు రంగంలో సెర్చ్ కూడా కింగులాంటిదే బ్రదర్ డిప్లాయ్ మెంటు మనది డిజైను మంట మనది కాపీలు కొట్టేద్దామురా కోడులో బగ్గుల్ని దాచుదామురా ఈ కోడువల్డులో చేరటం మన తప్పా (2) రిక్రుట్టు చేసుకున్న టీఎల్ పీయమ్లదే తప్పా (2) బీరులో మునకేసి అందర్ని తిట్టేయ్ బ్రదర్ ప్రోగ్రాము ఎటూరాదు సెర్చైనా చెయ్యి బ్రదర్ గూగుల్లు లిస్టింగ్లో ప్రతీ లింకూ నీది నాదే బ్రదర్ సా...