Skip to main content

గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో

గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో
నిత్యం సాంగత్యం ప్రియ తనువుల మధురిమలో
శతమానం అంటూ ప్రియహారం వెయ్యనా
సహకారం ఉంటూ మమకారం పంచనా
ప్రణమామి అంటు ప్రాణమివ్వనా
గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో
నిత్యం సాంగత్యం ప్రియ తనువుల మధురిమలో

ఓ చెలియా ఇది నిజమా నీ పలుకే పరవశమా
నిజమెరుగను ఏ సాంతం నిను నిరంతం
మది లయలకు వసంతం కలిగే
ఎంత ఎంత దూరం అందాల ప్రేమ తీరం అంటు
చెప్పవోయి ప్రాయం నీ ప్రేమ స్థావరం
ఉంది కొంత దూరం దాయాలి అంత వరకు మీరు
గుండెలోని భారం అంటుంది పావురం
నిను చూసే మది ఆశే కొత్త కావ్యము
నిను చేరే యద హాయే ఎంత భాగ్యము
గగనాలే నీవై భువనాలే మరువనా
జవరాలే నేనై పరువాలే పంచనా
నీ చెంత ఎంత హాయిలే ప్రియా
గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో
నిత్యం సాంగత్యం ప్రియ తనువుల మధురిమలో

ఈ హృదయం అతి సృజనం నీ శృతిలో ప్రతి నిముషం
శశి పరువపు అజంతం పిలిచెనులే అచంతం
కసి పెదవులే నా సొంతం చేసే
XXలేని భావం నిన్ను చూసే నాకే నాలో
గుండెలోన చేరి గోల చేసెనే
నింగినున్న స్వర్గం అంచులేమో నేల మీద
ఎన్ని జన్మలైన నిన్ను వీడనే
నీ సాయం నీ ప్రాయం నాకు అవసరం
ఓ నేస్తం నీకోసం నేను అంకితం
నా వలపే నీదై బహుమానం ఇవ్వగా
నా తలపే నీదై పరిహారం కట్టగా
ఈ జన్మ కింత చాలులే ప్రియా

గీతం సంగీతం ప్రియ తనువుల మధురిమలో
నిత్యం సాంగత్యం చెలి పెదవుల సరిగమలో
శతమానం అంటూ ప్రియహారం వెయ్యనా
సహకారం ఉంటూ మమకారం పంచనా
ప్రణమామి అంటు ప్రాణమివ్వనా

geetam sangeetam cheli pedavula sarigamalO
nityam saangatyam priya tanuvula madhurimalO
Satamaanam anTU priyahaaram veyyanaa
sahakaaram unTU mamakaaram panchanaa
praNamaami anTu praaNamivvanaa
geetam sangeetam cheli pedavula sarigamalO
nityam saangatyam priya tanuvula madhurimalO

O cheliyaa idi nijamaa nee palukE paravaSamaa
nijameruganu E saantam ninu nirantam
madi layalaku vasantam kaligE
enta enta dooram andaala prEma teeram anTu
cheppavOyi praayam nee prEma sthaavaram
undi konta dooram daayaali anta varaku meeru
gunDelOni bhaaram anTundi paavuram
ninu choosE madi aaSE kotta kaavyamu
ninu chErE yada haayE enta bhaagyamu
gaganaalE neevai bhuvanaalE maruvanaa
javaraalE nEnai paruvaalE panchanaa
nee chenta enta haayilE priyaa
geetam sangeetam cheli pedavula sarigamalO
nityam saangatyam priya tanuvula madhurimalO

ee hRdayam ati sRjanam nee SRtilO prati nimusham
SaSi paruvapu ajantam pilichenulE achantam
kasi pedavulE naa sontam chEsE
XXXXlEni bhaavam ninnu choosE naakE naalO
gunDelOna chEri gOla chEsenE
ninginunna swargam anchulEmO nEla meeda
enni janmalaina ninnu veeDanE
nee saayam nee praayam naaku avasaram
O nEstam neekOsam nEnu ankitam
naa valapE needai bahumaanam ivvagaa
naa talapE needai parihaaram kaTTagaa
ee janma kinta chaalulE priyaa

geetam sangeetam priya tanuvula madhurimalO
nityam saangatyam cheli pedavula sarigamalO
Satamaanam anTU priyahaaram veyyanaa
sahakaaram unTU mamakaaram panchanaa
praNamaami anTu praaNamivvanaa

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...