Skip to main content

ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా

ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమా.. ఆ.. (2)
ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

అవుననక కాదనక మనసే వినకా
మురిపిస్తావేలా ప్రాయమా..
రేయనక పగలనక తపనల వెనకా
తరిమేస్తావేలా న్యాయమా..
నిన్నలేని చోద్యమా నిన్ను ఆప సాధ్యమా
నిన్నలేని చోద్యమా నిన్ను ఆప సాధ్యమా
ఆ.. ఆ.. ఆ.. ఆ.
గుండె చాటు గానమా గొంతు దాటు మౌనమా
యదలోని ఇంధ్రజాలమా..
ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

పూలనక ముళ్ళనక వలచిన క్షణమే
విహరిస్తావేలా హృదయమా..
రేపనక మాపనక ఆ మరుక్షణమే
విసిగిస్తావేలా విరహమా..
ఇంత వింత సత్యమా ఎంతకైన సిద్ధమా
అంతులేని ఆత్రమా అందులోనే అందమా
ఆ.. ఆ.. ఆ.. ఆ.
కోటి కలల నేత్రమా కొంటె వలపు గోత్రమా
శృంగార సుప్రభాతమా..

ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమా..
ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

praNayamaa marumalle poola tOTalO ghumaghumaa
paruvamaa sarasaala veeNa paaTalO sarigamaa
mOyalEni bhaavamaa raayalEni kaavyamaa
nanDUri vaari gEyamaa.. aa.. (2)
praNayamaa marumalle poola tOTalO ghumaghumaa
paruvamaa sarasaala veeNa paaTalO sarigamaa

avunanaka kaadanaka manasE vinakaa
muripistaavElaa praayamaa..
rEyanaka pagalanaka tapanala venakaa
tarimEstaavElaa nyaayamaa..
ninnalEni chOdyamaa ninnu aapa saadhyamaa
ninnalEni chOdyamaa ninnu aapa saadhyamaa
aa.. aa.. aa.. aa.
gunDe chaaTu gaanamaa gontu daaTu mounamaa
yadalOni indhrajaalamaa..
praNayamaa marumalle poola tOTalO ghumaghumaa
paruvamaa sarasaala veeNa paaTalO sarigamaa

poolanaka muLLanaka valachina kshaNamE
viharistaavElaa hRdayamaa..
rEpanaka maapanaka aa marukshaNamE
visigistaavElaa virahamaa..
inta vinta satyamaa entakaina siddhamaa
antulEni aatramaa andulOnE andamaa
aa.. aa.. aa.. aa.
kOTi kalala nEtramaa konTe valapu gOtramaa
SRngaara suprabhaatamaa..

praNayamaa marumalle poola tOTalO ghumaghumaa
paruvamaa sarasaala veeNa paaTalO sarigamaa
mOyalEni bhaavamaa raayalEni kaavyamaa
nanDUri vaari gEyamaa..
praNayamaa marumalle poola tOTalO ghumaghumaa
paruvamaa sarasaala veeNa paaTalO sarigamaa

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...