Skip to main content

ఈ అమృతవర్షం యదలో చిలికే అనురాగం

ఈ అమృతవర్షం యదలో చిలికే అనురాగం
ఈ అమృతవర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం
నా యదను పంచుకొనీ కలతే పండనీ
నా ప్రాణసఖుడా కొసరి చిలిపి చెలికాడా
నా ప్రాణసఖుడా ఓ నా ప్రేమ జతగాడా
నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ.. నా ప్రాణసఖుడా

ఆ మొదటి వెచ్చని ఆశ, ఆ మొదటి మన ఆ స్పర్శ
చెలి మరిచిపోదే మనసు ఆ మొదటి చుంబనం
ఆ మొదటి మోజులు కలలు, ఆ మొదటి మన కోపాలు
యదలోని పువ్వుల పొదలు జ్ఞాపకాల సంగమం
నీ కలల పల్లకిని జతగా మోయనీ
ఈ అమృతవర్షం యదలో చిలికే అనురాగం
ఈ అమృతవర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం.. ఈ అమృతవర్షం

ఆ మొదటి మన ఆ సరసం, ఆ మొదటి మన ఆ విరసం
గుర్తుందిలే ఆ మొదటి నీ ప్రేమ కానుక
ఆ మొదటి మోమాటాలు, ఆ మొదటి చిలిపితనాలు
తొలిరేయి కౌగిలి కథలు మరువగలనా చెలీ
నా యదను పంచుకొనీ కలతే పండనీ
నా ప్రాణసఖుడా కొసరి చిలిపి చెలికాడా
ఈ అమృతవర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం
నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ.. ఈ అమృతవర్షం

ee amRtavarsham yadalO chilikE anuraagam
ee amRtavarsham saakshigaa nuvvu naa praaNam
naa yadanu panchukonI kalatE panDanI
naa praaNasakhuDaa kosari chilipi chelikaaDaa
naa praaNasakhuDaa O naa prEma jatagaaDaa
nee praNaya laalanalO jatagaa saaganI.. naa praaNasakhuDaa

aa modaTi vecchani aaSa, aa modaTi mana aa sparSa
cheli marichipOdE manasu aa modaTi chumbanam
aa modaTi mOjulu kalalu, aa modaTi mana kOpaalu
yadalOni puvvula podalu jnaapakaala sangamam
nee kalala pallakini jatagaa mOyanI
ee amRtavarsham yadalO chilikE anuraagam
ee amRtavarsham saakshigaa nuvvu naa praaNam.. ee amRtavarsham

aa modaTi mana aa sarasam, aa modaTi mana aa virasam
gurtundilE aa modaTi nee prEma kaanuka
aa modaTi mOmaaTaalu, aa modaTi chilipitanaalu
tolirEyi kougili kathalu maruvagalanaa chelI
naa yadanu panchukonI kalatE panDanI
naa praaNasakhuDaa kosari chilipi chelikaaDaa
ee amRtavarsham saakshigaa nuvvu naa praaNam
nee praNaya laalanalO jatagaa saaganI.. ee amRtavarsham

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...