Skip to main content

ప్రేమ అనే పరిక్ష రాసి : ప్రేమికులరోజు

Requested by Ramcharan

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (4)
నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకే సొంతం
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే (2)

ఆ..... నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా (2)
ఆ గాజులు తొడుగుట సుఖమున్నదిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా నీ చెక్కిలిపై నేనానవాళ్ళా
అహ నిన్నటిదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే

నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను మొఖం మొఖం
మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమయిపోయినా
అలుపెరుగదులే నీ ప్రేమ గాధ అలలాగవులే నీలి సంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (2)
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (2)

prEma anE pareeksha raasi vEchi unnaa vidyaardini (4)
nee manasu palakapainaa naa sankhya choosinapuDu
nEnE nannu nammalEdu naa kanula nammalEdu
nammu nammu nannu nammu priyuDaa naalO prEma epuDO neekE sontam
DOlE DOlE DOlE DOlE DOlE DOlE DOlE DOlE (2)

aa..... nee chEtiki gaajulu nEnE kadaa nEDu gaajulu toDigE rOjE kadaa (2)
aa gaajulu toDuguTa sukhamunnadilE aa sukhamE maLLI maLLI ee madikOrindilE
ivi chekkiLLaa poola paravaLLaa nee chekkilipai nEnaanavaaLLaa
aha ninnaTidaaka nEnoka halluni nuvvocchaaka aksharamayitini
prEma anE pareeksha raasi vEchi unnaa vidyaardini
DOlE DOlE DOlE DOlE DOlE DOlE DOlE DOlE

nee oDilO dorikenu sukham sukham aa sukhamuna kandenu mokham mokham
manasinduku chEsenu tapam tapam aanandamE ika nEnEmayipOyinaa
aluperugadulE nee prEma gaadha alalaagavulE neeli sandraanaa
idi janma janmalaku veeDani bandham virahaanikainaa dorakani bandham
prEma anE pareeksha raasi vEchi unnaa vidyaardini (2)
DOlE DOlE DOlE DOlE DOlE DOlE DOlE DOlE
prEma anE pareeksha raasi vEchi unnaa vidyaardini (2)

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...