Skip to main content

Posts

Showing posts from November, 2009

Kallu Moosi YochistE from "Veedokkade"

Requested by Lavanya........ Missed a word :( కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే (2) ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే (2) కడలై పొంగిన మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగ నేస్తం దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే యదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే మిన్నేటి మెరుపల్లే విహరిస్తా అణుక్షణమే కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నే నీవనుకున్నానే పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే ఆశే చిన్న తామరముల్లై వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళీ ఉసిగొలిపే అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెతికే అయినా దాగే యదలో ఏదో ఒక మైకం ఇదే ప్రేమ తొలిమలుపా xxxxx(?) చెలి తలపా ఒక మోహం ఒక పాశం కుదిపేసే కథ మధురం కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముం...

ప్రేమ అనే పరిక్ష రాసి : ప్రేమికులరోజు

Requested by Ramcharan ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (4) నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకే సొంతం డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే (2) ఆ..... నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా (2) ఆ గాజులు తొడుగుట సుఖమున్నదిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా నీ చెక్కిలిపై నేనానవాళ్ళా అహ నిన్నటిదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను మొఖం మొఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమయిపోయినా అలుపెరుగదులే నీ ప్రేమ గాధ అలలాగవులే నీలి సంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (2) డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (2) prEma anE pareeksha raasi vEchi unnaa vidyaardini (4) nee manasu palakapainaa naa s...

O vennelaa telipedelaa from "PremaDesam"

ఓ వెన్నెలా తెలిపేదెలా... ఓ నేస్తమా పిలిచేదెలా.. కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2) ఓ వెన్నెలా తెలిపేదెలా... జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా ఓ వెన్నెలా తెలిపేదెలా... వలపించు హృదయం ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే ఓ వెన్నెలా తెలిపేదెలా... ఓ నేస్తమా పిలిచేదెలా.. కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2) O vennelaa telipEdelaa... O nEstamaa pilichEdelaa.. kaLLu kaLLu kalisaayanTa valapE puvvE poosindanTa namminavaarE puvvuni kOstE nee yadalO baadha teerEdeTTaa (2) O vennelaa telipEdelaa... jaDivaana ningini taDichEyunaa gandhaalu puvvuni viDipOvunaa nannaDigi prEma yada chErenaa valadanna yadanu viDipOvunaa marichaanu annaa marichEdelaa marichaaka nEnu bratikEdelaa O v...

Nanu nene marachina nee todu from "PremaDesam"

ప్రేమా.... ప్రేమా.... ప్రేమా ప్రేమా..... నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా... నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా... ఆకాశదీపాన్నై నే వేచిఉన్నా నీ పిలుపుకోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా.... నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా... నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా... నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలీ..... నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా... నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వ...

Pannendu Daati Padamodu vaste from "Nenu"

పన్నెండు దాటి పదమూడు వస్తే టీనేజి టీనేజి పదమూడు దాటి పద్నాలుగొస్తే ఖోలో జీ లవ్ పేజి పదిహేనులోన మొదలెట్టుకో పదహారులోన పదునెట్టుకో పదిహేడులోన గురిపెట్టుకో పద్దెందిలోన యమ రెచ్చిపో... 13 టు 19 వరకే టీనేజి జవాని లోతుల్లోకి వోయేజి (2) నూనుగు మీసాలొస్తయ్ ఎన్నెన్నో కలలొస్తయ్ ఊహలకే రెక్కలు వస్తయ్ కవితల్నే కురిపిస్తయ్ కోరికల గుర్రాలేమో కళ్ళను తెంచుకు పరుగులుపెడుతుంటాయ్ it's your life you can take it any way if you wanted to it's your life you can make it any way if you wanted to it's your life you can think it any way if you wanted to it's your life you can sink it any way if you wanted to it's your life హంసల్లె నడిచే పిల్ల జడలో పువ్వు పడిపోతే ఆ పువ్వు వాసన చూస్తు కలలు కనేదే టీనేజి పొరపాట్నో బ్యూటీ క్వీను హాండ్ కర్చీఫుని వదిలేస్తే దాన్నే ఓ తియ్యని గుర్తుగ దాచుకొనేదే టీనేజి వీకయిన బాంగిల్స్ అయినా విసిరేసిన బాల్ పెన్ అయినా తను తాగిన టీ కప్పైనా తల్లోని హాండ్ క్లిప్ ఐనా కాదేది ప్రేమకనర్హం ప్రేమించే మనసే ముఖ్యం it's your life you can take it any way if you wanted to it's y...

Priyatamaa Priyatamaa from "Priyatamaa"

ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువునా తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా... ప్రేమే నీవే భామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువునా తగిలిన హృదయమా చదివేద పాఠం ఒకసారి వల్లెవేయవా గిలిగింత రాగం తొలిసారి నేర్పి చూడవా అది ప్రేమ లాంచనం మధుమాసమీదినం మరుమల్లె శోభనం స్వరదాన సాధనం తారలన్ని ధారపోసే సోయగాలు నీవిలే వాంఛలన్ని ఆరిపోయే వాయిదాలు వేయకే భ్రమరికా కమలమా.... రారా మేఘశ్యామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువునా తగిలిన హృదయమా వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా.. ప్రేమే నీవే భామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువునా తగిలిన హృదయమా గంగా విహారం ప్రియ సామవేద గానమై వోల్గా కుటీరం మన సామ్యవాద రూపమై ఒకసారి ఇద్దరం అవుదాము ఒక్కరం నదికోరు పుష్కరం మనసైన కాపురం ఆకాశాలు దాటిపోయే ఆశయాలు నావిలే పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే మగువనీ మధుపమా... ఏలా ఈ హంగమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా.. ప్రేమే నీవే భామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువునా తగిలిన హృదయమా priyatamaa priyatamaa priyatamaa tanuvunaa tagil...

Prema enta madhuram from "Abinandana"

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం prEma enta madhuram priyuraalu anta kaThinam prEma enta madhuram priyuraalu anta kaThinam chEsinaanu prEmaksheera saagara madanam minginaanu halaahalam prEma enta madhuram priyuraalu anta kaThinam prEminchuTEnaa naa dOshamu poojinchuTEnaa naa paapamu ennaaLLani ee yadalO mullu kanneeruga ee karigE kaLLu naalOni nee roopamu naa jeevanaadhaaramu adi aaraali pOvaali praaNam prEma enta madhuram priyura...

Prema Ledani Premincharaadani from "Abinandana"

ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు (2) మనసు మాసిపోతే మనిషే కాదది కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదది గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటిని ప్రేమ లేదని లలలాలలాల గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించని ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు prEma lEdani prEmincharaadani prEma lEdani prEmincharaadani saakshyamE neevanI nannu nEDu chaaTani O priyaa jOhaarulu (2) manasu maasipOtE manishE kaadadi kaThikaraayikainaa kanneerundani valapu chicchu ragulukunTE aaripOdadi gaDiya paDina manasu talupu taTTi cheppani usuru tappi moogabOyi nee Upiri usuru tappi moogabOyi nee Upiri mODuvaari neeDa tODu lEkunTini ...

Epudu leni alochanalu from "NeeKosam"

నీకోసం నీకోసం నీకోసం నీకోసం ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది నీకోసం నీకోసం నీకోసం నీకోసం నాలో ఈ ఇది ఏరోజు లేనిది ఎదో అలజడి నీతోనే మొదలిది నువ్వే నాకని పుట్టుంటావని ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా నీకోసం నీకోసం నీకోసం నీకోసం నాలో ప్రేమకి ఒక వింతే ప్రతి ఇది వీణే పలుకని స్వరమే నీ గొంతుది మెరిసే నవ్వది మోనాలిసది ఈ నిజం ఇక కాదనే ఏ మాటలు నే నమ్మను ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది నీకోసం నీకోసం నీకోసం నీకోసం neekOsam neekOsam neekOsam neekOsam epuDulEni aalOchanalu ipuDE kaligenu enduku naalO neekOsam neekOsam ee lOkamilaa EdO kalalaa naakantaa kottaga vintaga kanipistU undi neekOsam neekOsam neekOsam neekOsam naalO ee idi ErOju lEnidi edO alajaDi neetOnE modalidi nuvvE naakani puTTunTaavani onTigaa nee janTakE unnaanu nEninnaaLLugaa neekOsam neekOsam neekOsam neekOsam naalO prEmaki oka vintE prati idi veeNE palukani swaramE nee g...

Manoharaa naa hrudayamune from "Cheli"

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట (2) నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట (2) ఓ ప్రేమా ప్రేమా..... సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమరా ఒడిచేర్చుకోవా నీ చెలిని మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల manOhara naa hRdayamunE O madhuvanigaa malichinaananTa rateevara aa tEnelanE O tummedavai taagipommanTa (2) naa yavvanamE nee paramai pula...

Nijamgaa Nenenaa ilaa nee from "Kotta Bangaru Lokam"

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా యదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరేరామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా హరే హరే హరే హరే హరేరామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనములోనా తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా యదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరేరామా మ...

Ee roje telisindi neelo daagina from "Idiot"

Requested by Satya.... ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే తొలిసారిట సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమా కనువిందు పండించెరా ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువ...

Kaadannaa preme ounannaa preme from "Manmadha"

Requested by Vamshi...... కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే ప్రణయాలా శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా తండ్రి నీవేఅయి పాలించు తల్లి నీవేఅయి లాలించు తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరే...

Saahasam naa padham raajasam from "Maharshi"

I'm dedicating this song to myself ............. సాహసం నా పథం రాజసం నా రధం సాగితే ఆపటం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటటం శఖ్యమా నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా సాహసం నా పథం రాజసం నా రధం సాగితే ఆపటం సాధ్యమా నిశ్చయం నిశ్చలం హహ నిర్బయం న హయం కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా తప్పని ఒప్పని తర్కమే చెయ్యను కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహవెంట నే మనసు పడితే ఏ కళలనైనా ఈ చిటికే కొడుతూ నే పిలువనా సాహసం నా పథం రాజసం నా రధం సాగితే ఆపటం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా అధరని బెదరని ప్రవృత్తి ఒదగని మదగజమీ మహర్షి వేడితే లేడి ఒడి చేరుతుందా వేట సాగాలి కాదా హహ ఓడితే జాలి చూపేనా కాలం కాళ రాసేసిపోదా అంతము సొంతము పంతమే వీడను మందలో పందలా ఉండనే ఉండను భీరువల్లే పారిపోను రేయి ఒళ్ళో దూరిపోను నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురు పడునా ఏ అపజయం సాహసం నా పథం రాజసం నా రధం సాగితే ఆపటం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా లోకమే బానిసై చ...

Ye nomu nochidndo Ye pooja from "Yogi"

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి (2) నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశా తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండే తడిసిపోలేదా జగదీశా ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి గుండే గొంతుగా అమ్మా అనే మాటే తనకు చాలయ్యా మహదేవా తానే నేస్తమై తోడై పెంచిన తల్లికొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువే ఈ పేగు బాష చెప్పమ్మా నువు పార్వతి అమ్మంటే ఓ హారతీ ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి E nOmu nOchindO E pooja chEsindO paramESa nee varamupondi murisindi ee kannatalli tana SwaasatO bandhamalli (2) nuvvE icchinaa biDDE dooramai mODai migilE ee talli paramESaa talli kaLLalO pongE gangatO gunDE taDisipOlEdaa jagadeeSaa iTuvanTi talli neekunTE eeSaa telisEdi neeku ee talli ghOsha nee kannu adi chooDadaa ee kanTi taDi aaradaa E nOmu ...

Vacchindaa Megham Raani from "Yuva"

The toughest song up to the date........There might be few mistakes. sorry! Requested by Roopa.... ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా (2) మనమేం చేస్తాం మనమేం చేస్తాం మనమేం చేస్తాం మనమేం చేస్తాం రాళ్ళను కూడా పూజిస్తారు అవి దార్లో ఉంటే ఏరేస్తారు దారంపోగునా చుట్టినా పడక తప్పదు పీటముడి ఆలోచిస్తే అంతుచిక్కే అర్దం చేసుకో విషయమేదో నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం కడలింటా కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు పువ్వుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్ని ఏ కొందరి అడుగుజాడలో నేల మీదా సావుతాయి ఈ నీడలా చీకటి పడిన ఆ జాడలో చెరిగిపోవోయి ఏయ్ ఏయ్ ఏయ్ అలో...

botani patamundi myatani ata from Shiva

బొటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో వొటు చెప్పరా హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టు రా బొటనీ క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్టు కంటే రెస్టు మేలు ఫాటలు ఫైటులున్న ఫిల్మ్ చుడూ బ్రేకులు డిస్కొలు చూపుతారు జగడ జగడ జగడ జగడ జాం (4) దువ్వెనే కొడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలనట్టు ఎవ్వరీ వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ బాండూ వీరగా వేస్తడే వీల సౌండు నీడలా వెంటాడే జీడి బ్రాండు పోజులే చూస్తుంటే వొళ్ళు మండు జగడ జగడ జగడ జగడ జాం (6) ఆయ్యో మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా హే చీ తాళమే రాదు మార్చ్ అట మార్చి తళంలో పాడరా వెదవా మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఎందిరో వింతగొడవా ఎంధుకీ హైరానా వెర్రి నానా వెల్లరా సులువైన దారిలున్నై,, ఉందిగా సెప్టెంబర్ మార్చిపైన హొయ్ వాయిదా పద్దతి ఉంది దేనికైనా.. మాగ్జిమం మార్కులొచ్చు మ్యాథ్సులొ ధ్యాస ఉంచు కొద్దిగా వొళ్ళు వంచరా ఓరెయ్... క్రాఫుపై ఉన్న శ్రద్ద గ్రాఫుపై పెట్టు కాస్తా ఫస్టు ర్యాంకు పొందవొచ్చురోయ్ అరెయ్ ఎంది...

Praanam lo Pranaamgaa from "Andhrudu"

ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా ఇలా ఇలా నిరాశగా దరిదాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు యదా (2) ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా స్నేహం నాదే ప్రేమా నాదే ఆపైనా ద్రోహం నాదే కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే తప్పంతా నాదే శిక్షంతా నాకే తప్పించుకోలేనే ఎడారిలో తుఫానులై తడి ఆరుతున్నా తుది చూడకుండా ఎదురీదుతున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా ఆట నాదే గెలుపు నాదే అనుకోని ఓటమి నాదే మాట నాదే బదులు నాదే ప్రశ్నల్లే మిగిలానే నా జాతకాన్ని నా చేతితోనే ఏమార్చి రాసానే గతానిపై సమాధినై గతిమారుతున్నా స్థితి మారుతున్న బ్రతికేస్తు ఉన్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా గతానిపై సమాధినై గతిమారుతున్నా స్థితి మారుతున్న బ్రతికేస్తు ఉన్నా praaNamlO praaNamgaa maaTallO mounamgaa chebutunnaa baadhainaa Edainaa bhaaramgaa dooramgaa veLutunnaa monna kanna kala ninna vinna katha rEpu raadu kadaa jataa ilaa ilaa niraaSagaa daridaaTutunnaa Uru maarutunnaa...

Osaari Preminchaaka Osaari from "Andhrudu"

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా అనుకోకుండా నీ యద నిండా పొంగింది ఈ ప్రేమా అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా అనుకోని అతిధిని పొమ్మంటూ తరిమే అధికారం లేదమ్మా స్వార్ధం లేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా Osaari prEminchaaka Osaari manasicchaaka marupanTU raanEraadammaa Osaari kalagannaaka UhallO kalisunnaaka viDipOyE veelE lEdammaa nee kaLLallOnaa kanneeTi jallullOnaa aaraaTaalE egasi aNuvu aNuvu taDisi inkaa inkaa bigisindI prEmaa Osaari prEminchaaka Osaari manasicchaaka marupanTU raanEraadammaa ...

Varaveenaa Mrudupaani from "Vinaayakudu"

వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి God do you know this cutie pie is an angel all you got to know is there is someone waiting you just have to find them you just have to meet them నిరుపమ శుభ గుణలోల నిరతజయాప్రద శీల వరదాప్రియ రంగనాయకి వాంచిత ఫల దాయకి When you find that lovely person Your heart sings and swings every moment That's when you feel yes this is love That's when you feel yes this is love సరసీజా సను జననీ జయ జయ జయ వాణి Baby.. Do you know what love is all about ? Do you know what care is all about ? Do you know when cupid strikes your heart ? Do you know when you really feel alone ? Do you really know ? When you find that lovely person Your heart sings and swings every moment That's when you feel yes this is love That's when you feel yes this is love సరసీజా సను జననీ జయ జయ జయ వాణి

O manasaa O manasaa Chebite vinavaa from "Bhadra"

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే తరిమే మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు O manasaa O manasaa chebitE vinavaa nuvvu nee mamatE maaya kadaa nijamE kanavaa nuvvu cheliyaa gunDe taakalEka palakanandE naa mounam chelimi venTa saagalEka Sila ayindE naa praaNam gatamE marichi bratakaalE manasaa O manasaa O manasaa chebitE vinavaa nuvvu nee mamatE m...

Naa Naa parugu teesinaa from "Anukokunda Oka Roju"

నా నా పరుగు తీసినా నా నా వదిలిపెడుదునా వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన (2) మొహము కన్న పరిచయము అసలు లేదు అవసరము తనువుకి తెలుసు తనువు అవసరం పెదవి నుంచి పెదవికి తరుగుతుంటే దూరం ఇంతకు మించి ఏల పయనము సో కాల్డ్ సోల్ మేట్ కోసమేలా నీ వేట బ్రాండ్ న్యూ తోడు నీకు దొరుకుతుంటే ప్రతిపూట షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన (2) నా నా పరుగు తీసినా నా నా వదిలిపెడుదునా వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన (2) మసక మసక ఎండలో మంచులాగ కరగక శాశ్వత బంధం మనకెందుకు అనుభవాల కొలనులో చేపలాగ ఈదక పసిఫిక్ సంద్రం గొడవెందుకు హృదయం లోతులన్ని తడిచి చూస్తే టైం వేస్టు పరువం ఎత్తులెక్కు అందుతుంది ఎవరెస్టు షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన నా నా పరుగు తీసినా నా నా వదిలిపెడుదునా వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా షైనననన షైనననన షైనననన షైనననన షైనననన షైనననన naa naa parugu teesinaa naa naa vadilipeDudunaa venukaku tirigi nuvvu chooDakunnaa eduTaku vac...

PrEmanTE suluvu kAdurA adi nIvu gelava lEvuraa from Kushi

ఫ్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురా ఫ్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ఫ్రేమెంతో విలువ ఐనది అందరికి దొరకలేనిదీ చూసేందుకు చక్కనైనదీ తకవా భగ్గుమంటదీ నో నో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీ సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా (2) జాబిలినే బోమ్మగ చేసిస్తావా భూలోకం చుట్టేసి సిగలో తురిమేస్తావా మబ్బులతో మల్లెల పరుపేస్తావా ఆకాశం దిండుగ మార్చేస్తావా ఇస్తావా తెస్తావా తెస్తావా సూర్యుడ్నే పట్టి తెచ్చేదా నీ నుదిటిన బొట్టు పెట్టెదా చుక్కలతో చీరచుట్టెదా మెరుపులతో కాటుకెట్టెదా తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా నాకోసం నయాగరా జలపాతం తెస్తావా ఎవరెస్టూ శిఖరమెక్కిస్తావా పసిఫిక్ సాగరమీదేస్తావా వస్తావా తెస్తావా తెస్తావా స్వర్గాన్నే సృష్టిచేసేదా నీ ప్రేమకూ కానుకిచ్చేదా కైలాసం భువికి దించేదా నా ప్రేమను రుజువు చేసేదా ఫ్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురా ఫ్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ఫ్రేమెంతో విలువ ఐనది అందరికి దొరకలేనిదీ చూసేందుకు చక్కనైనదీ తకవా భగ్గుమంటదీ నో నో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీ సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా PrEmanTE suluvu kAdurA adi nIvu gelava lEvuraa ...

kalisunte kaladu sukham from Kalisundam Raa

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే ఖుషితోటలో గులాబీలు పుయిస్తుంటే హలో ఆమని చెలొ ప్రేమని వసంతాలు ఇలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలీకేకలా చెలే కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతొషం ప్రేమల్లన్ని ఒకసరే పెనేసాయీ మా యింటా గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పెరంటం ఒకే ఈడుగా యదే జోడుకడుతూ ఉంటె అదే ముచ్చట కధే ముద్దటా తరం మారినా స్వరం మారనీ ఈప్రేమ సరాగానికే వరం ఐనదీ పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలొ మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల...

Ekaantangaa unna endari madyana from "Ashok"

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా నీకై నేను అలోచిస్తున్నా ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా నా తనువంతా మనసై ఉన్నా....ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా.... రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో ఇంకా కమ్మని సంగతులెన్నో నా యద గుండెల్లో కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా నా వయస్సంతా వలపై ఉన్నా.....ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా.... స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా అర్చన నేనై ఉంటా నీ ఒడిగుడిలోనా వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా నీ జీవననదిలో పొంగే నీరవుతున్నా సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా శతజన్మాల ప్రేమవుతున్నా....ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా.... Ekaantangaa unnaa endari madyana unnaa neekai nEnu alOchistunnaa E pani chEstU unnaa eTu payanistU unnaa ninnE nEnu aaraadhistunnaa ...

Ee velalo neevu emchestu untaavo from "Gulabi"

Requested by Lavanya... ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను నడిరేయిలో నీవు నిదరైనా రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పనిచేసుకోనీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో తియనైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో నను నిలవనీకుంది మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషమూ నేను (2) ee vELalO neevu Em chEstu unTaavO anukunTu unTaanu prati nimishamu nEnu naa gunDe EnaaDO chEjaaripOyindi nee neeDagaa maari naa vaipu raanandi dooraana unToonE Em maaya chEsaavO ee vELalO neevu Em chEstu unTaavO anukunTu unTaanu prati nimishamu nEnu naDirEyilO neevu nidarainaa raaniivu gaDipEdelaa kaalamu gaDipEdelaa kaalamu pagalaina kaasEpu panichEs...

Yamaho Yamma Em Figaru from "Chiruta"

యమహో యమ్మ ఏం ఫిగరు తిమ్మురెంతుందిరో చూడు గురు దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ములేపమందిరో ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే వగలన్ని పోగేసి చెలరేగే నిను చూసి గల్లంతై మతి చెడిపోతుందే మజునునై జుట్టంతా పీక్కుందునా గజినినై గుట్టంతా లాక్కొందునా చంపేశావే నన్నియాలే ఒయ్ ఒయ్ ఒయ్ ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి కాలేజి ఈడంటూ ఎల్కెజి డ్రస్సేసి ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి తోబా తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి కైపే ఎక్కిపోరా పాపం తల తూగి తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి ఉప్పెన్లా ముంచుకురాకే చెలరేగి ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి రంగంలో దించాలా రంగేళి సింగారి బేబీ బేబీ లావాని లాలిస్తావా లావణ్యమా చాల్లే కిల్లాడిని హంగామా సంద్రాన్ని ముంచెత్తావా సెలయేరమ్మా ఏమంతా ఎల్లలు దాటే హోరమ్మా ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి yamahO y...

Mulla kireetame neevaa : Peradi Lyrics

ఈ పాట సూర్పణక ని గుర్తు చేసుకొనిరాస్తూ తనకే Dedicate చేయబడినది.... preminchukundam raa movie loo "Surya kireetame neeva" ki peradi! ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో పిశాచ సహవాసిని నువ్వేలే (2) పెదవి తాకి పెంపుడు కుక్క పారిపోయిందా తనువు తాకి శ్వేతపుష్పం వాడిపోయిందా నీ ఒడి రాక్షస రోగ సీమ నీ దరి ఎవ్వరు రారే భామ నీ తోనే చచ్చింది ప్రేమా లంక సూర్పణకే నీవా చెత్త మొహానివే నీవా ఎర్రని మంటల నొప్పిని వివరించేదెలా వీడని ఊహల కలలని చూపించేదెలా పిశాచ సహవాసిని నువ్వేలే ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా తనువు భారమోపలేక స్కూటీ కుంగిందా నిన్నుచూసి బతకటమే గగనమయ్యిందా కాకర కాయల చేదు నువ్వా దుర్గంధానికి తావి నువ్వా దయచేసి మము వీడిపోవా ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో పిశాచ సహవాసిని నువ్వేలే

Poosindi Poosindi Punnaaga from "Seethaaraamayya Gaari Manuvaraalu"

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ..... జతులాడ........ పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై వలపన్న గానమే ఒక వాయులీనమై పాడే...... మదిపాడే...... పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా అరవిచ్చేటి ఆ భేరిరాగాలకే స్వరమిచ్చావులే ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే అల ఎంకి పాటలే ఇల పూలతోటలై పసిమొగ్గ రేకులే పరువాల చూపులై పూసే.... విరబూసే...... పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై (2) ఆడ.. జతులాడ... పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళలాగేసె సల్లంగా దాని ...

E manase se se from "Tholiprema"

I'm back with a beauty! ఈ మనసే సే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే సే ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలివెలుగని తెలిసే (2) కోరుకున్న తీరాన్నే తను చేరినా తీరిపోని ఆరాటంతో కలవరించెనా వెనకనె తిరుగుతు చెలి జత విడువదు దొరికిన వరముతొ కుదురుగా నిలువదు ఏంచేస్తే బావుంటుందో చెప్పని వింత నసే ఈ మనసే సే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే సే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే (2) వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహతహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపును తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే ఈ మనసే సే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసి వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే సే ee manasE sE sE sE sE sE sE sE naa manasE sE sE sE sE sE sE sE parugeDutOndi ne...