Skip to main content

Raadu kadaa aa nimisham from "Sakhiyaa"

రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం
కలలారి ఆరి జారిపొయే కంటి రెపరెపలో
శిల మీద రాలి పాలిపోయే పూల ఘుమఘుమలో
రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం

ఈ జగమే మనపై ఒదిగేలా హత్తుకున్నాములే ఒక్కరల్లే
ఈ మనసు మనసు కలిసేలా ముట్టుకున్నాములే ముద్దులల్లే
కన్నీళ్ళైనా గుండెలో గంగలూ యమునలే
నూరేళ్ళైనా సాగని తలపులూ తపనలే
నీ కొరకే నా ధ్యానం నీ వెనకే నా ప్రాణం
కనులే తడిసే వలపు చినుకులివి
రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం

జత కలిసీ కసకా తింటుంటే కాకి ఎంగిళ్ళు కవ్వింతలాయే
హే చిలిపి చీ చీ పో అంటుంటే తుమ్మెదే లోన తుళ్ళింతలాడే
కాలాలన్ని వేసవి గాలులై తాకెలే
కాటేస్తున్నా వెన్నెలే జోలలే పాడెలే
నను మరిచిపోతున్నా నా మనిషే అనుకున్నా
మనసే మురిసి మెరుపు కలలు ఇవి
రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం
కలలారి ఆరి జారిపొయే కంటి రెపరెపలో
శిల మీద రాలి పాలిపోయే పూల ఘుమఘుమలో
రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం

raadu kadaa aa nimisham ee nimisham chEdu visham
neevu anE naa praaNam neetOnE ika payanam
kalalaari aari jaaripoyE kanTi reparepalO
Sila meeda raali paalipOyE poola ghumaghumalO
raadu kadaa aa nimisham ee nimisham chEdu visham
neevu anE naa praaNam neetOnE ika payanam

ee jagamE manapai odigElaa hattukunnaamulE okkarallE
ee manasu manasu kalisElaa muTTukunnaamulE muddulallE
kanneeLLainaa gunDelO gangaluu yamunalE
noorELLainaa saagani talapuluu tapanalE
nee korakE naa dhyaanam nee venakE naa praaNam
kanulE taDisE valapu chinukulivi
raadu kadaa aa nimisham ee nimisham chEdu visham
neevu anE naa praaNam neetOnE ika payanam

jata kalisI kasakaa tinTunTE kaaki engiLLu kavvintalaayE
hE chilipi chii chii pO anTunTE tummedE lOna tuLLintalaaDE
kaalaalanni vEsavi gaalulai taakelE
kaaTEstunnaa vennelE jOlalE paaDelE
nanu marichipOtunnaa naa manishE anukunnaa
manasE murisi merupu kalalu ivi
raadu kadaa aa nimisham ee nimisham chEdu visham
neevu anE naa praaNam neetOnE ika payanam
kalalaari aari jaaripoyE kanTi reparepalO
Sila meeda raali paalipOyE poola ghumaghumalO
raadu kadaa aa nimisham ee nimisham chEdu visham
neevu anE naa praaNam neetOnE ika payanam

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...