Skip to main content

Posts

Showing posts from October, 2009

Chilakamma mukkuki dondapanduki from "Gudumba Shankar"

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి ఉందోయ్ రాసి... లెదోయ్ రాజీ చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది సన్నాయే విరిగినా ఆ డొలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే పందిల్లే కూలినా బంధువులే పొయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే చల్లే అక్షింతలు నిప్పులే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే ఉందోయ్ రాసి... వద్దోయ్ పేచీ చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే సిమ్హం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే పెళ్ళాం ఓ పక్క పల్లెమోపక్క కథ మారదు రాసే ఉంటే ఉందోయ్ రాసి... బ్రతుకే చీచీ అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసె ఉంటే అంతా సొంతం అయ్యేనండి ఆ వీరబ్రహ్మం ఆనాడి...

Uhallona odigina aase neevai from "Mantra"

ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా హృదయంలోన తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు ఇదితగునా శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావు అంతేలేని వరాలనందిస్తావు మాయో హాయో నీకిది తగునా నేనే నీవై పోతున్నా నీలో సాగే శ్వాసల సెగతో ప్రతిక్షణం అలై జ్వలించే సోయగం తపించదా ఇలా వరిస్తే సాహసం (2) పొంగే నదినై సముద్రాలే దాటుతున్నా సాగే సుధలై సరాగాలే పాడుతు వెంటాడే నీడై నను ఇలా వేధిస్తావేలా రసికరా... మదనా.... ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా ప్రియా మధూకర మదించే ఆశలా సఖి సమీరమై కురిస్తే ఏలరా (2) మూస్తే కళ్ళే మరో లోకం చేరుతున్నా వీచే గాలై అలా పైకి తేలగా నా గానం నీవై దాహమా ఏదేదొ చేస్తావేంటలా వరమా ఊహల్లోన ఒదిగిన ఆశే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా హృదయంలోన తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు ఇదితగునా శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావు అంతేలేని వరాలందిస్తావు మాయో హాయో నీకిది తగునా నేనే నీవై పోతున్నా నీలో సాగే శ్వాసల సెగతో UhallOna odigina aaSE neevai alajaDi puTTistaavu priyamadanaa hRdayamlOna taragani dhyaasE neevai tapanalu penchEstaavu iditagunaa SwaasallOnaa swaraalu mrOgistaav...

Sarasaalu chaalu sreevaaru from "Shiva"

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు (2) వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలడు చీకటే చెరిగినా కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా స్నానానికే సాయమే రావాలనే తగువా నీ చూపులే సోకుగా కావాలనే సరదా పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా తియ్యగా తిడుతూనే లాలించనా సరసాలు చాలు శ్రీవారు తాన నాన విరహాల గోల ఇంకానా ఊహు ఊహు కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా ఎందుకో తికమక తొందర బొత్తిగా కుదురుగా ఉండనే ఉండడా ఆరారగా చేరక తీరేదెలా గొడవ ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా మోహమే తీరే రాదా మోజులే చెల్లించవా జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక ఆగదే అందాక ఈడు గోల చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగా తీరు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు sarasaalu chaalu Sreevaaru vELa kaadu virahaala gOla inkaanaa veelu kaadu (2) vanTiTlO gaaraalu oLLantaa kaaraalE saaru churukaina eeDu oddannaa UrukOdu virajaa...

Erupu lolaaku kulikenu from "Prema Lekha"

ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2) అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింత (2) ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టు తిప్పెనమ్మ ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం బహుదూరం బహుదూరం మనకందని నవలోకం (2) చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటైన పాలపిట్ట అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు పగ్గాలే వేసెనులే నీలి నీలి ముంగురులు రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2) అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే రాజస్తానీ కన్నెపిల్ల వయ...

Evvare nuvvu nannu kudipaavu : "Peradi Lyrics"

As usual గా ఎవర్నీ హింసించటానికి కాదు Just for fun! ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు టైమయ్యింది షాపింగంటు షాపులన్ని తిప్పావు మరి నాకు ఓ పరుసుందంటు తెలిసేలా చేసావు అప్పులెన్నో చేసాను గిఫ్టులెన్నో ఇచ్చాను నీతోనే అన్నాను ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా వెన్నులో నొప్పే పెంచావు ఎటు చూసినా ఏం చేసినా ఏ బారులో అడుగేసినా, నలువైపులా అమ్మాయిల్ని చూసా నిన్నా మొన్నా ఏ పబ్బులో డాన్సాడినా ఏ మత్తులో తేలాడినా నాకెక్కడ అడ్డులేదులే నిన్నా మొన్నా ఎప్పటికైనా ఏ అబ్బాయికైనా గల్ ఫ్రెండ్ ఉంటే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా దూల బాగా తీరుతోందిగా ఎవ్వరె నువ్వు నన్ను కుదిపావు ఈ శోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా కొంపలు నువ్వేముంచావు నలకా నలక నలక నలక నువు నా కంట్లో నలకా నలక నలక నలకా చెలి చూపులో గుండుసూదులే ప్రతిమాటలో పదిబూతులే తొలిప్రేమ నే వద్దనుకున్నా వదలదే ఐనా నా దారిలో తను లీనమై నా నిన్నలన్ని శూన్యమై నా జీవితం విస్తరాకే అన్నా ఏమిచేస్తున్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దారుణం అయ్య...

Andaalalo aho mahodayam from "Jagadekaveerudu Atilokasundari"

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం లతా లతా సరాగమాడి సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా తళా తళా గళాన తడి లతహారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం సరస్సులో షరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం andaalalO ahO mahOdayam bhoolOkamE navOdayam puvvu navvu pulakin...

Mounaalu yelane preyasi from "Run"

మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి కళ్ళతో కళ్ళలో జూదమాడకే వేళ్ళతో చేతిలో గీత మార్చకే మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి అల్లరి చేసే పువ్వుల మొక్కను చూసా రహస్యముగానే మదినే తొవ్వి పదిలం చేసి వేసా నిన్ను చూసి ఈడే కోరుకుంది తోడే నన్ను వీడి విడిగా విడిపోయే నీడే అరె మెరిసే మెరుపా నక్షత్రాల తలుకా ఎగిరిరావే నా చిలకా మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి ఆ.. వానకు అర్దం ఒక చినుకే నా చెలియా నువ్వు ఒంటరి చినుకా నీటి వరదా నిజమును చెప్పవే సఖియా బుగ్గసొట్టలోనా చిక్కుకొంటి మైనా కొప్పుముడి వలన తప్పుకొంటి లలనా అరె చందనాల చనుకా మల్లెపూల మొలకా సిగ్గువీడి రా వెనుకా ఆగమంటు ఖండించి లోలోపల దండించి చెప్పమంటూ అర్దించి చెప్పకుండ వంచించి మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి కళ్ళతో కళ్ళలో జూదమాడకే వేళ్ళతో చేతిలో గీత మార్చకే మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కథలోకి అరుదించి మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాల...

Yavvanaala puvvulanni navvutunna from "Detective Naarada"

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా సఖి నెరిచూపుల చల్లదనంతో జగములే ఊటీ శాయగా యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కన్నె ప్రేమ లేని లేత కన్నెగువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరణే సతి ఆదరణే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా వేడి ముద్దు అద్దుకున్న ల...

Ek do teen sakhi priyaa from "Rudra Netra"

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా అరె జానేదో యార్ ఏ దునియాకో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే నైటు తొలినైటు మనసంటూ కలిశాకే సైటే గురిచూసి విసిరాకే పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా అరె జానేదో యార్ ఏ దునియాకో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో దాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే భరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం భరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం హాపీగా హాబీగా సరాసరి పద మరి చెలి చెలి ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా అరె గోలీ మార్ దో ఏ దునియాకో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కి...

Mila Mila merisenu taara from "Nirnayam"

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా వెచ్చనైన గుండె గిన్నెలో వెన్నలింత దాచి ఉంచకు పొన్న చెట్టు లేని తోటలో కన్నె వేణువు ఆలపించకు ప్రేమ అన్నదే ఓ పల్లవైనదీ పెదవి తాకితే ఓ పాటలే అదీ ఆమని ప్రేమని పాడే కోయిలా మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా మౌనమైన మాధవీ లత మావి కొమ్మనల్లుకున్నది ఎల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది తోచదాయనే ఓ తోడు లేనిదే కౌగిలింతలే ఓ కావ్యమాయలే ఎన్నడు లేనిది ఎందుకో ఇలా మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా mila mila merisenu taara nee prEmalaa chilipiga kurisenu prEmaa nee kannulaa gaalilO laalilaa gaanamai ilaa laalinchelE nannE O paapalaa vEdhinchelE nannE nee neeDalaa mila mila merisenu taara nee prEmalaa vecchanaina gunDe ginnelO v...

Karigipoyaanu karpoora veenalaa from "Marana Mrudangam"

కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలి గా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలి గా ఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగా అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా జతలుకలిసి మనమొంటిగా ఏమైనా సరి గ రి సా ఏ కోరికో శృతే మించగా ఈ ప్రేమలో ఇలా ఉంచగా అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా karigipOyaanu karpuura veeNalaa kalisipOyaanu nee vamSadhaaralaa naa guTTu jaari...

Chinni paadaala chinukammaa from "Preminchedi Endukammaa"

చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా అదుపులేని పరుగా ఇది కదలలేని పదమా ఇది ఏమోమరి నీ సంగతి కలల లయల పిలుపా ఇది చిలిపి తలపు స్వరమా ఇది ఏమోమరి యద సవ్వడి మాటైన రానంత మౌనాలా ఏ బాషకి రాని గానాలా మన జంటె లోకంగ మారాలా మన వెంటే లోకాలు రావాలా బదులియ్యవా ప్రణయమా శ్వాస వేణువై సాగినా వేడి వేసవై రేగినా భారం నీదే ప్రియ భావమా ఆశకి ఆయువై చేరినా కలల వెనకనే దాగినా తీరం నువ్వే అనురాగమా దూరాన్ని దూరంగ తరిమేసి ఏకాంతమే ఏలుతున్నామా ఊహల్లో కాలాన్ని ఉరివేసి గాలుల్లో ఊరేగుతున్నామా తెలిసేనా ఓ ప్రియతమా చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్...

Vennelalo mallelalo chirugaali from "Samaram"

వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా నీవే సుమా కలకాదు సుమా చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా నీవే సుమా కలకాదు సుమా కురిసెను నాలో వలపుల వాన మనసున మోగే మమతల వీణ వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా నీవే సుమా కలకాదు సుమా నీలాల గగనాన వేచినదో చిరుతార నేడూ గారాల నెలవంక తోడుగనే నిలిచింది చూడూ ఏవేవో తమకాలు సుడి రేగె నాలో కమ్మంగా ఒడి చేరి కరగాలి నీలో తనువే తపించే క్షణాన చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా నీవే సుమా కలకాదు సుమా కురిసెను నాలో వలపుల వాన మనసున మోగే మమతల వీణ వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా నీవే సుమా కలకాదు సుమా కౌగిళ్ళ ద్వారాలు తియ్యమనే పిలుపందుకున్నా శృంగార తీరాలు చేరమనే నిను కోరుకున్నా ఏనాటి కలలన్ని యద చేరినాయో ఎన్నెన్ని జన్మాల తెర తీసినాయో నీకై జ్వలించే క్షణాన చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా నీవె సుమా కలకాదు సుమా కురిసెను నాలో వలపుల వాన మనసున మోగే మమతల వీణ వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా న...

Raadu kadaa aa nimisham from "Sakhiyaa"

రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం కలలారి ఆరి జారిపొయే కంటి రెపరెపలో శిల మీద రాలి పాలిపోయే పూల ఘుమఘుమలో రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం ఈ జగమే మనపై ఒదిగేలా హత్తుకున్నాములే ఒక్కరల్లే ఈ మనసు మనసు కలిసేలా ముట్టుకున్నాములే ముద్దులల్లే కన్నీళ్ళైనా గుండెలో గంగలూ యమునలే నూరేళ్ళైనా సాగని తలపులూ తపనలే నీ కొరకే నా ధ్యానం నీ వెనకే నా ప్రాణం కనులే తడిసే వలపు చినుకులివి రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం జత కలిసీ కసకా తింటుంటే కాకి ఎంగిళ్ళు కవ్వింతలాయే హే చిలిపి చీ చీ పో అంటుంటే తుమ్మెదే లోన తుళ్ళింతలాడే కాలాలన్ని వేసవి గాలులై తాకెలే కాటేస్తున్నా వెన్నెలే జోలలే పాడెలే నను మరిచిపోతున్నా నా మనిషే అనుకున్నా మనసే మురిసి మెరుపు కలలు ఇవి రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం కలలారి ఆరి జారిపొయే కంటి రెపరెపలో శిల మీద రాలి పాలిపోయే పూల ఘుమఘుమలో రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం నీవు అనే నా ప్రాణం నీతోనే ఇక పయనం raadu kadaa aa nimisham ee nimisham chEdu visham ne...

Program choosaadu Superb annadu : Peradi Lyric

As U know already not to imitate or irritate anyone but for fun!..... ప్రోగ్రాం చూసాడు సూపర్బ్ అన్నాడు ఏమయిందో ఏమో గాని మొత్తం మారాడు మాటే వినలేదు మంటే రేపాడు నన్నే తరిమి తానే రైటని పండగ చేసాడు మౌసు మీద చెయ్యేసాడు కోడు నాకు నేర్పాడు ఎంత గొప్పలే టీఎలంటే అనుకొని నే మురిసాను ఇంతలోనే ఏమయ్యిందో నన్ను తీసిదొబ్బాడు పీఎం సుబ్రమణ్యం వల్లే నా జాబు పోయింది ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం (2) కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం అందరిలో నన్నే పొగుడుతూ తను ప్రోత్సహించగా సరికొత్తని కోడ్లెన్నో నే రాసాగా ఫ్రెషరుగా తిరిగే నే కూడా ప్రోగ్రామగలనని తను చెప్పాకే గుర్తించాగా వంద లైన్ల ప్రోగ్రామ్నైనా ఒక్కనాడే రాసాను మూడు నెలలు తిరిగే లోగా కథ మొత్తం మార్చాడు ఎన్నిసార్లు పొగిడాడు నన్ను గొప్ప అన్నాడు మధ్యలో పీఎం రాగానే తను మాట మార్చాడు అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్...

Ententa dooram teeram raadaa from "Sainikudu"

Requested by Aditya... ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా ఈనాడు ఏకం ఐతే వింతేగా ఏరోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీ వైపు మళ్ళిందంటే మాయేగా మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా మాయేరా మాయేరా రంగురంగులు చూపేదేరా రంగంటు లేనే లేనిదేరా ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా ఈనాడు ఏకం ఐతే వింతేగా ఏరోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీ వైపు మళ్ళిందంటే మాయేగా ఊహల్లో ఊసుల్లో ఆ మాటే ఓసోసి గొప్ప ఏముంది గనక తానంటూ నీ వెంట ఉందంటే ఆ ఎండ కూడా వెండి వెన్నెలవదా అవునా అదంతా నిజమా ఏదేది ఓ సారి కనపడదా ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా నీ చెంతే ఉండే దూరం లేరా హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వెంత చెప్పు గుండెల్లో గుబులే ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా శిలవా నా మాట వినవా ఏనాడు నువు ప్రేమలో పడవా నిజమా ఏ ప్రేమ వరమా కల్లోనైనా ఊహించని మహిమా మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఇద్దరిలోనా ఇంధ్రజాలం లేరా హాయేలే హాయేలే ఎల్...

Evade evade evade subramanyam from "Konchem Istam Konchem Kastam"

కనులే కలిపింది కలలే చూపింది ఏమయిందో ఏమో గాని అంతా మారింది మాటే వినకుంది మంటే రేపింది నన్నే మరిచి నాన్నే రైటని ఇంట్లో కూర్చుంది చేతిలోన చెయ్యేసింది చెలిమి నాకు నేర్పింది ఎంత హాయిలే ప్రేమంటే అనుకొని మది మురిసింది ఇంతలోనే ఏమయ్యిందో నన్ను గాలికొదిలింది అబ్బ సుబ్రమణ్యం వల్లే నా గీత మారింది ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం (2) కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం అందరిలో నన్నే అందంగా చెలి పలకరించగా సరికొత్తగా మళ్ళీ జన్మించాగా అల్లరిగా తిరిగే నే కూడా ప్రేమించగలనని తంతతో కలిసాకే గుర్తించాగా వంద ఏళ్ళ ఆనందాలు ఒక్కనాడే చూపింది కన్ను మూసి తెరిచే లోగా కథ మొత్తం మారింది చందమామలా నవ్వింది నన్ను వీడలేనంది మధ్యలో మబ్బు రాగానే తను మాట మార్చింది అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఓ.. అర్దం కాలేదే అన్నింటా నాకేమి తక్కువ పైగా ప్రాణంగా ప్రే...

Surya kireetame neevaa from "Preminchukundaam raa"

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి (2) పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా నీ ఒడి మన్మధ యాగ సీమ నీ సరి ఎవ్వరు లేరే భామ నీ తోనే పుట్టింది ప్రేమా కణ్వ శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా వాత్సాయన వనవాసినీ కావేరి సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా సొగసు భారమోపలేక నడుము చిక్కిందా జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా తుమ్మెద ఎరగని తేనె పువ్వా సౌందార్యానికి తావి నువ్వా ప్రియమార దరిచేరరావా సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి sUrya kireeTamE neevaa chandra sumaanivE neevaa mouna sarassuna daagina hima SanKhaanivO tolakari mEgha chaayalO merisina taaravO vaatsaayana vanavaasinI kaavEri (2) pedavi taaki swaatimutyam pagaDamayyindaa tanuvu taaki SwEtapushpam aruNamayyindaa nee oDi manmadha yaaga seema nee sari evvaru lErE b...

Pula ghumaghuma cherani from "Sri Anjaneyam"

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగరా మగరాయడా భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా మారనే మారవా మారవేం మానవా.. మౌనివా మానువా తేల్చుకో మానవా పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో నా వాలు జడ చుట్టుకొని వదిలి లేక నడుము నడిపించుకో వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా ప్రతి ముద్దుతో ఉదయించని కొత్త పున్నాగనై జతలీలలో అలసి మత్తెక్కిపోని నిద్ర గన్నేరునై నీ గుండె పై ఒదిగుండని పొగడ పూదండనై నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై మోజులే జాజులే పూయని హాయిని తాపమే తుమ్మెదై తియ్యని తేనెని పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా poola ghumaghuma chErani O moola unTE elaa tEne madhurima chEdani aa mooti muDupEnTalaa prEmanTE paamani bedaraalaa dheemaagaa tiragaraa m...