Skip to main content

Pranati Pranati Pranati from "Swathi Kiranam"

Requested by Dinesh....

ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
మ మ ప మ మ ప మ ప ని
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికీ
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ

పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా
సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా
పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా
సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా గ్రీం కారమా
గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా శ్రీం కారమా
ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ

పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
అది శిల్పమా అది శిల్పమా
ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి....ప్రణవనాద జగతికీ

praNati praNati praNati
pa ma pa ma ga ma sa ri saa
praNati praNati praNati praNavanaada jagatiki
ma ma pa ma ma pa ma pa ni
praNuti praNuti praNutI pradhamakaLaa sRshTikI
praNati praNati praNati praNavanaada jagatikI

poola yadalalO pulakalu poDipinchE bhramararavam Om kaaramaa
suprabhaata vEdikapai sukhapikhaati kalaravam aim kaaramaa
poola yadalalO pulakalu poDipinchE bhramararavam Om kaaramaa
suprabhaata vEdikapai sukhapikhaati kalaravam aim kaaramaa
pairu paapalaku jOlalu paaDE gaalula savvaDi grIm kaaramaa grIm kaaramaa
girula Sirassulanu jaarE Jarula naDala alajaDi SrIm kaaramaa SrIm kaaramaa
A bIjaakshara vitatiki arpinchE jyOtalivE
praNati praNati praNati praNavanaada jagatikI

panchabhootamula parishvamgamuna prakRti pongina padaspandanaa adi kavanamaa
antarangamuna alalettina sarvaanga sanchalana kELanaa adi naTanamaa adi naTanamaa
kanTi tudala harivinTi podala taLukandina rasa varNa lEkhanaa adi chitramaa adi chitramaa
mouna Silala chaitanyamUrtulugaa malachina sajeeva kalpanaa adi Silpamaa adi Silpamaa
adi Silpamaa adi Silpamaa
A lalita kaLaa sRshTiki arpinchE jyOtalivE
praNati praNati praNati praNavanaada jagatiki
praNuti praNuti praNutI pradhamakaLaa sRshTiki
praNati praNati praNati....praNavanaada jagatikI

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...