Skip to main content

Posts

Showing posts from September, 2009

Adugadugu Gundenadugu from "Bobby"

అడుగడుగు గుండెనడుగు తడబడినా ఈడునడుగు ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహతహలేవో తాపం పెంచాయిలే నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది కోరికేదో తొలి మొటిమై పూసే తేనెలాగ చిరుచెమటై పోసే హాయా ఇది ఎవరి మాయా సిగ్గు నూనూగు చిగురే వేసే ఉగ్గపట్టి ప్రాణాలే తీసే తంత్రం చెలి వేసే మంత్రం చూపు దిగితే చెప్పలేని వయసు కోత ఆ..ఆ.ఆ వెన్నులోన చిలుకుతున్న తీపి బాధ ఆ..ఆ.ఆ గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహతహలేవో తాపం పెంచాయిలే నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది అడుగడుగు గుండెనడుగు తడబడినా ఈడునడుగు గోరు వెచ్చని ఊపిరికే వేడి కొసల చిరు తాకిడికే మేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది చెలియ తుంటరి నవ్వులకే తలుపు తియ్యని కౌగిలికే వయసు భగ్గునా మండింది తియ్య తియ్యగా కాల్చింది చిగురాకులాగ నా ఒళ్ళే సెగ చిమ్మి వణుకుతూ ఉంది తమకాన్ని రేపే నీ పెదవి నవనాడులాపుతూ ఉంది నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది అడుగడుగు గుండెనడుగు తడబడినా ఈడునడుగు గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని ...

Manmadhuda nee kalakanna from "Manmadha"

మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరినో నే చూసాకాని ఒకడే మన్మధుడు ఇరవై ఏళ్ళుగా ఎపుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు (2) మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా మగువగా పుట్టినా జన్మఫలితమీనాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచి నా తోడు కలిసీ యదలలోన ఊయలలుగే అందగాడు ఇతడంతా యదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంటా ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై యద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో నా ప్రియ మిత్రుడు ప్రియుడే ఐతే ఇదియేం చరిత్రమో మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణము గా మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని చుక్కపొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క నీ ముందు మాత్రం సిగ్గులే మరువనా నా పడకటింటికి నీ పేరే పెట్టనా అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా (2)..... 16 manmadhuDA nee kala kannA manmadhuDA nee katha vinnA manmadhuDanTE kougil...

Mounamelanoyi e marapuraani from "Saagara Sangamam"

మౌనమేలనోయి....మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి యదలో వెన్నెల వెలిగే కన్నుల యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పలికే పెదవి వణికింది ఎందుకో వణికే పెదవి వెనకాల ఏవిటో కలిసే మనసులా విరిసే వయసులా (2) నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు ఏమేమో అడిగినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగులా వలపు మడుగులా (2) కన్నె ఈడు ఉలుకులు కంటి పాప కబురులు ఎంతెంతొ తెలిసినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి యదలో వెన్నెల వెలిగే కన్నుల యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి mounamElanOyi....mounamElanOyi ee marapuraani rEyi mounamElanOyi ee marapuraani rEyi yadalO vennela veligE kannula yadalO vennela veligE kannula taaraaDE haayilaa inta mounamElanOyi ee marapuraani rEyi palikE pedavi vaNikindi endukO vaNikE pedavi venakaala EviTO kalisE manasulaa virisE vayasulaa (2) neeli neeli Usulu lEta gaali baasalu EmEmO aDiginaa..mounamElanOyi ee marapuraa...

Jilibili palukula chilipiga from "Sitara"

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార (2) మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా (2) హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఏమైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ (2) వినువిధి వీణల్లో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా j...

Akaasaganga dookave from "Vaana"

ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా జల జల జడిగా తొలి అలజడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే (2) చిటపట లాడి వెలసిన వానా మెరుపుల దారి కనుమరుగైనా నా గుండె లయలో విన్నా ఈ అలికిడి ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా ఏ బాటలో నైనా నీ పైటనొదిలేనా (2) మనసుని నీతో పంపిస్తున్నా నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా ఆ జాడలన్ని వెతికి నిన్ను చేరదా ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా జల జల జడిగా తొలి అలజడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా....... 15 aakaaSaganga dookaavE penkitanamgaa... aakaaSaganga jala jala jaDigaa toli alajaDigaa taDabaDu aDugaa nilabaDu sarigaa naa talapu muDivEstunnaa ninnaapagaa aakaaSaganga dookaavE penkitanamgaa... aakaaSaganga kanubomma villetti O navvu visiraavE chilakamma gontetti tiyyanga kasiraavE (2) chiTapaTa laaDi velasina vaanaa merupula ...

Chinnamullu Javaraalu from "Premante Praanamistaa"

జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబాలే జుంబాలే జుంబాలే..జుంబాలే జుంబాలే జుంబాలే చిన్న ముల్లు జవరాలు పెద్ద ముల్లు జతకాడు రెండు ముళ్ళు జతపడితే కాలమింక నడవదులే చిన్నముల్లు అలక మానదు నిదురేపోదు పెద్దముల్లు వెంటపడతది విడిచిపోదు (2) ఊరికే చిన్నబోకు ప్రియతమా ఓ క్షణం విరహమే విలయమా జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబాలే జుంబాలే జుంబాలే..జుంబాలే జుంబాలే జుంబాలే కోపంతో కాదనరాదే ప్రేమిస్తే తప్పేంలేదే చెప్పాలంటే మొత్తం మీదా ప్రేమంటే తెలియనిదెవరే ఊరికే ఉంచునా ప్రేమ జల్లు వెల్లువ జిల్లునా గిల్లదా నేడే ఒళ్ళు మెల్లగా ఏమాయే తనువే తనుగా నిలవలేదే పెనుమాయే ప్రేమే వచ్చి కవ్విస్తాడే నా తోడు మరి కాదనమాకు అమ్మడు అలా కోపం పడకు ప్రతి హృదయంలో మొదలయ్యే కథ కాదా ప్రేమకు పెదబాలశిక్షలు ఏలా జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబలక జుంబలక జుంబల జుంబాలే జుంబాలే జుంబాలే జుంబాలే..జుంబాలే జుంబాలే జుంబాలే కైపు చూడు అర్దం ఏంటి ప్రేమింకా మొదలైనట్టే కాదని ఎట్టా అంటా బుల్లి కన్నుల్లో కొట్టొస్తుంటే చెప్ప...

Manasaaa vaachaa ninne from "Godavari"

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా చిన్న తప్పు అని చిత్తాగించమని అన్నా వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీతలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా............... 13 manasaa vaachaa ninnE valachaa ninnE prEminchaa ninnE talachaa nannE marichaa neekai jeevinchaa aa... aa maaTa daachaa kaalaalu vEchaa naDichaa nE nee neeDalaa manasaa vaachaa ninnE valachaa ninnE prEminchaa chinna tappu ani chittaaginchamani annaa vinadu appuDeppuDO ninnu choosi nee vaSamai manasu kanneerainaa goutami kannaa tellaarai...

Emaindii ee vela from "Aaduvaari Maatalaku Ardaale Verule"

can you feel her? Is your heart speaking to her? can you feel the love? yes..... ఏమైందీ ఈ వేళ యదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం కను రెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయనే తన సొగసే తీగలాగా నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ఏమైందీ ఈ వేళ యదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేలా ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే యద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటిసారి మెరుపు చూశా కడలి లాగే ఉరకలేశా can you feel her? Is your heart speaking to her? can you feel the love? yes EmaindI ee v...

Allant dooraala a taaraka from "Aaduvaari Maatalaku Ardaale Verule"

అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా నీ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమె లా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా నీ తీరుగా కన్యాదానంగా ఈ సంపంద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగా దిగి వచ్చెనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా నీ తీరుగా.............. 12 allanta dooraala aa taaraka kaLLeduTa nilichindaa nee teerugaa arudaina chinnaarigaa kOvellO dEvErigaa gunDellO koluvunDagaa bhoomi kanalEdu innaaLLugaa eeme laa unna E pOlika arudaina chinnaarigaa k...

Pranati Pranati Pranati from "Swathi Kiranam"

Requested by Dinesh.... ప్రణతి ప్రణతి ప్రణతి ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి మ మ ప మ మ ప మ ప ని ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికీ ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా గ్రీం కారమా గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా శ్రీం కారమా ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి....ప్రణవనాద...

Manasuna Manasugaa nilichina from "Love Birds"

మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా (2) మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మలు నేనుంటా నీ జంట మనసున మనసుగా నిలిచినా కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం మనసున మనసుగా నిలిచినా కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా...

Manasemo cheppina maate from "Yuvaraju"

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఆ కళ్ళే ఆశలతో వయస్సులో ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు అదేమిటో ఈ కధేమిటో అధరం మధురం నయనం మధురం వచనం మధురం వదనం మధురం చరణం మధురం మధురం మధురం శ్రీ మధురాధిపతి రఖిలం మధురం నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా ఆ... సరసం విరసం విరహం సరిగమ సంగీతం ఆ... చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో.......... 10 manasEmO cheppina maaTE vinadu.. adi EmO ivaaLa pedavullO daachinadasalE anadu.. anaraani nijaalaa E maaya chEsaayO E mattu jallaayO aa kaLLE aaSalatO vayassulO O nimisham niTTUrpu O nimisham maimarapu adEmiTO ee kadhEmiTO adharam madhuram nayanam madhuram vachanam madhuram va...

Niddarlo nee venta nadipaave from "Premante Inthe"

నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా ఇకనైనా మరపు రావెలా మాయమైన క్షణమా నీడై నా వెంట రాకిలా మాయదారి నిజమా ముందేం చూడక పదమందే నిలవకా మనసేమి అలోచించక గమనించే లోగా గమ్యం దాటాకా వెనుతిరిగే వీలే లేదుగా ఏ గుండెల్లో వాలాలన్న చిరునామా లేక ఏ శూన్యంలో విహరిస్తుందో నువు పంపిన లేఖ ఎవ్వరు చెబుతారే ఆరాటమా నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా తానే నేరుగా సావాసం కోరగా దరిచేరిందే అభిసారిక చెయ్యందుకోగా సందేహించాక తెరమరుగైపోదా తారక ఏం పొందాలనుకుందో హృదయం గుర్తించే ముందే వెతికె వరమై ఎదురై వచ్చి విడిపోయిందంటే నేరం నాదేనా అదృష్టమా............... 9 niddarlO nee venTa naDipaavE rEyantaa vENuvai rammanE raagamaa reppallO puula tOTa rEpannadi chUDakunDa vEkuvai aapitE nyaayamaa ikanainaa marapu raavelaa maayamaina kshaNamaa neeDai naa venTa raakilaa maayadaari nijamaa mundEm chuuDaka padamandE nilavakaa manasEmi alOchinchaka gamaninchE lOgaa gamyam daaTaakaa venutirigE v...

Ninna ee kalvarinta ledule from "Padmavyuham"

Requested by Dinesh.... నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా హృదయం కరిగిపోయెనా ఓ మనసా (2) దైవం ఉందంటిని అమ్మనెరిగాకనే కలలు నిజమంటిని ఆశ కలిగాకనే ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం సృష్టి ఉన్నంత దాకా ప్రేమలే శాశ్వతం నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా హృదయం కరిగిపోయెనా ఓ మనసా నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే మాట లేకున్నను భాష ఉంటుందిలే ప్రేమయే లేకపోతే జీవితం లేదులే వాసనే లేకనే పూలు పూయొచ్చులే ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా హృదయం కరిగిపోయెనా ఓ మనసా (2) ninna ee kalavarinta lEdu lE nEDu chirugaali EdO andi lE idiyE prEma anduraa vayasE pulakarinchenaa hRdayam karigipOyenaa O manasaa (2) daivam undanTini ammanerigaakanE kalalu nijamanTini aaSa kaligaakanE prEmanE oppukunnaa ...

Ekkada unna pakkana nuvve from "Nuvve Kaavaali"

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్నా చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా యద మాటునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి కొండల నుంచి కింది దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వూ అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన నా...

Araatam mundu Atankam from "Ningi Nela Naade"

Requested by Vasundhara, Siri ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత ద్రుడచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకశాన్నంతా ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత ద్రుడ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత చేజారెను చేతులు చెరిగేను గీతలు (2) ఎదిరించిన బాధలే వివరించెను బోధలు పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా (2) మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత ద్రుడ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం చిరునవ్వేస్తుంటే సెలవంది శోకంసహనం తో ఉంటే దొరికింది సైన్యం చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం చిరునవ్వేస్తుంటే సెలవంది శోకంసహనం తో ఉంటే దొరికింది సైన్యం చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం aaraaTam mundu aaTankam enta sankalpam mundu vaikalyam enta druDachittam mundu duradRshTam enta edurIta mundu vidhiraata e...

Gore Gore GoGore from "Kick"

Requested by Vijay.... గోరె గోరె గోగోరె గోరె గోరె గోరె గోగోరె గోరె గోరె గోగోరె గోరె గోరె గోరె గోగోరె పో పో పొమ్మంటోందా నను రా రా రమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా (2) చూస్తూ చూస్తూ సుడి గాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా ఊపిరి ఆడక నీవల్లా ఇదరా అదరా యద ఏమన్నా తెలిసే వీలుందా గోరె గోగోరె గోరె గోరె గోగోరె గోగోరె. గోరె గోరె గోగోరె గోరె గోరె గోగోరె గోగోరె తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం మోసుకుంటు తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం (2) మెల్లగ నాటితే నీ వ్యవహారం తుల్లి పడదా నా సుకుమారం మెల్లగ మీటితే నాలో మారం పలికుండేదె మమకారం అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా గోరె గోగోరె గోరె గోరె గోగోరె గోగోరె. గోరె గోరె గోగోరె గోరె గోరె గోగోరె గోగోరె వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పదే సమయం (2) నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా గోరె గోగోరె గోరె గోరె గోగోరె గోగోరె. గోరె గోరె గోగోరె గోరె గోరె గోగోరె గోగోర...

Jagadhabi raamudu from "Lavakusa"

Requested by Satish జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం జగధబి రాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే (2) జగధబి రాముడు శ్రీరాముడే జనకుని మాటన తలపై నిలిపి తన సుఖముల విడి వనితావణి తో వనములకేగిన సర్వావతారుడు జగధబి రాముడు శ్రీరాముడే కరమున ధనువు శరములు దాలిచి కరమున ధనువు కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతుల బలమే పూనిచి సురలను గాంచిన వీరాధివీరుడు జగధబి రాముడు శ్రీరాముడే ఆలుమగల అనురాగాలకు ఆలుమగల అనురాగాలకు పోలిక సీతారాములే అనగా పొలిక సీతారాములే అనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగధబి రాముడు శ్రీరాముడే నిరతము ధర్మము నెరపీ నిలిపీ..నిరతము ధర్మము నెరపీ నిలిపీ నరులకు సురలకు తరతరాలకు ఒరవడి అయినా వర యుగపురుషుడు జగధబి రాముడు శ్రీరాముడే ఇనకులమని ధరి చూచే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని ఇనకులమని ధరి చూచే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని జనులు భజించే పురుషోత్తముడు జగధబి రాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే జగధబి రాముడు శ్రీరాముడే జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం jaya jaya raam jaya raghuraam jaya jaya raam jaya raghuraam jagadhabi raamuDu SrIraamuDE raghukula sOmuDu aa raamuDE (2) jagad...

E nimishaaniki emi jaruguno from "Lavakusa"

Requested by Satish... ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు కంచె యతితముగా చేను మేసినా కాదను వారెవరు రాజే ఇది శాసనమని పల్కినా ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు కరునామయురిది కాదనలేరా కఠిన కార్యమనబోరా సాథ్వులకెపుడు వెతలేనా తీరని ధుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఇనకులమున జనియించిన నృపధులు ఈ దారుణము సహించెదరా వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎవరూహించెదరు E nimishaaniki Emi jarugunO evarUhinchedaru E nimishaaniki Em...

Veena venuvaina sarigama from "Intinti Raamaayanam"

Requested by Ravi...... వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా తనువు తహతహ లాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేనువైన సరిగమ విన్నావా ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా ఊపిరి తగిలిన వేళ నీ ఒంపులు తిరిగిన వేళ నా వీణలో నీ వేణువే పలికే రాగమాల చూపులు తగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువునా అణువణువునా జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా యదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనితా నీ రాకతో నా తోటలో వెలసే వాన దేవతా కదిలే అందం కవితా అది కౌగిలికొస్తే యువతా నా పాటలో నీ పల్లవే నవతా నవ్య మమతా వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా తనువు తహతహ లాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేనువైన సరిగమ విన్నావా ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా veeNa vENuvaina sarigama vinnAvA O..teega rAgamaina madhurima kannAvA tanuvu tahataha lADAla chelarEgAla cheli UgAla uyyAlalIvELalO veeNa vEnuvaina sarigama vinnAvA O..teega rAgamaina madhurima kannAvA Upiri tagilina vELa nI ompulu tirigina vELa nA vINalO nI vENuvE palikE rAgamAla chUpulu tagilina vELa A chu...

Anandama araatama from "Konchem Istam Konchem Kastam"

ఇది నీకు అంకితం........ ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏమిటో పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి దాహానిదా స్నేహానిదా ఈ సూచనా ఏమిటో తేల్చుకో నయనమా ఎవరిదీ తొలితడి ఓ..పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా ఓ..కంటికే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా నమ్మవే మనసా కనపడినది కదా ప్రతి మలుపునా ఓ..యద సడిలో చిలిపి లయ తమ వలనే పెరిగెనయా కనుక నువే తెలుపవయా ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ.. య ఒక క్షణము తోచనీవుగా కాస్త మరుపైనా రావుగా ఇంత ఇదిగా వెంటపడతా అదేపనిగా ఓ..నిన్నల్లా మొన్నల్లా నేను లేను నేనులా నిజమేనా ఓ ముందుగా చెప్పక మంత్రమేసావే న్యాయమేనా ఓ..అందుకే ఇంతగా కొలువై ఉన్నా నీలోనా కొత్తగా మార్చనా నువ్వు నవ్వు అని నేను మరిపించనా ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏమిటో పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి దాహానిదా స్నేహానిదా ఈ సూచనా ఏమిటో తేల్చుకో నయనమా ఎవరిదీ తొలితడి ఓ..పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా ఓ..చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపానా ఓ..ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా కళ్ళల్లో పెట్టుకో ఎదురుగా నిలవనా ఎటు తిరిగినా ఏకాంతమే నీ సొంతమై పాలించుకో ప్రణయమా కౌగిలే కోటగా ఏలుకో బంధమా....... 7 AnandamA...

Neelo jarige tantuu from "Balu"

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా ముందు నీకే తెలిసేనా ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు ఉడికించే ఆలోచనలూ పుడుతున్నవి కాబోలు ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు ఐతేమరి నువ్వెపుడు కనలేదా ఈ కలలు నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా ఊ... అవునా ఏమో నే కాదనలేకున్నా నీలో జ...

Idi nijam nijam from "Andhrudu"

గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం (2) ఇన్నాళ్ళు ఎవరికివారే ఏమి కారే మరి ఎమైందో ఏకం అయ్యారే దూరాన్ని దూరం దూరం పో పొమ్మంటు చిత్రంగా చేతులు కలిపారే ఇది మనసు చేసిన ఓ వింత గారడి కాబట్టి బంధం కుదిరిందే ఇపుడే కథ మొదలంటా దీనికి చివరేదంటా తెలిసే వీలే లేదే గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం బంధుత్వాలన్ని దైవం ఇచ్చినవేలే స్నేహాన్ని నువ్వే వెతికావే త్యాగానికి అర్దం ఉంటే రానిస్తుందే చెలిమయ్యి నిన్నల్లేసిందే వేషంతో శ్రీకారం చుట్టింది ఈ బంధం ఇంకెన్ని మలుపులు తిరిగేనో కాలం గడిచేదాకా తీరం చేరేదాకా తెలిసే వీలే లేదే గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం........... 5 gunDellO EmundO cheppEdi kAdE ApEdE lEdE E rOjEmcheyyAlO AlOchistundE nI kanTE mundE I manasu...

Abbo Vadento from "Okkadunnadu"

అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నీకా పొగరేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో వద్దు అంటూనే ఇస్తుంటే కంపెని ముద్దుగా మోగే సరసాల సింఫొని కొంటె చూపుల్తో ఈ ప్రేమ పంపిణి హద్దు చెరిపింది రారమ్మని నికరంగా సుతరంగా శికరాలే చేరాలిగా ఆలోచించు దూకే ముందే ఎంత లోతు ఉన్నదో యదలో అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో చంపుతున్నాది చచ్చేంత క్రేజుతో దింపుతున్నాది దీంతోటి లవ్వులో నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో అబ్బో వాడేంటో వాడి చూపేంటో అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో............. 4 abbO vADEnTO vADi goDavEnTO abbO vADEnTo vADi UpEnTO abbO vADEnTO vADi chUpEnTO abbO vADnE chUsAkA inkO magavADevaDu magavADallE lEDEnTO a...

Monaalisa Monaalisa from "Sriram"

మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస నా మనసునే చేసావులే నీ బానిస నీ ప్రేమకై ఊగిందిలే యద ఊగిస మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస అవతరించింది భూమి నీ అడుగే మోయగా వెలుగు నింపింది నింగి నీ వైపే చూడగా శిరసునూపింది పువ్వు నీ సిగలో చెరగా ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా ధన్యమయ్యానులే నీ చూపు సోకగా జంటగ చేరగా మారిందిలే నా దిశ మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస మెరిసిపోవాలనుంది పెదవింట్లో నవ్వునై మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై ఒదిగిపోవాలనుంది కౌగిట్లో కాలమై నిలిచిపోవాలనుంది పాపిట్లో తిలకమై బిగిసిపోతానులే నీ ఆత్మబంధమై కరిగిపోలేనులే నీ కంటి బిందువై నిత్యము చేయనా నీ గుండెలోనే బస మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస నా మనసునే చేసావులే నీ బానిస నీ ప్రేమకై ఊగిందిలే యద ఊగిస మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస........... 3 mOnAlisA mOnAlisa mOnAlisA mOnAlisa nA manasunE chesAvulE nI bAnisa nI prEmakai UgindilE yada Ugisa mOnAlisA mOnAlisa mOnAlisA mOnAlisa avatarinchindi bhUmi nI aDugE mOyagA velugu nimpindi ningi nI vaipE chUDagA SirasunUpindi puvvu nI sigalO cheragA urakalEsindi g...

E baabu enti sangati from "Devadas"

కోఫం దిగులు బెరుకు భయము హాయి కలవరము వేగం ఆవేశం ఉల్లాసం కల్లోలం అన్ని ఇంకొన్ని కలిసిన ఫీలింగ్ క్యా హై క్యా హై ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా (2) మనసారా సున్లోనా మనసుంటే సంజోనా అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీకోనా ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా అమ్మాయి పైనా కన్నేస్తే కన్నా చీ అన్నా పీచే జానా వాళ్ళమ్మ నాన్న ఆపేస్తూ ఉన్నా ఆగొద్దు ఆగే చల్నా ఒంటికుండదిక ఖానా పీనా కంటికుండదిక తోడా సోనా వల్లగాని నానా హైరానా వెళ్ళలేవు ఏ దావాఖానా పిచ్చోడని అంటుందిరా సారా జమానా ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా పడిపోతు ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తే కైకో డర్నా మునకేస్తు ఉన్నా తేలాలి మున్నా మనసిస్తే కుచ్ భీ కర్నా ఆమె రూపమిక దిల్ మే బర్నా ప్రేమ కోసమిక జీనా మర్నా అర్దమైతే మరి చానా చానా ఆచితూచి ఒక నిర్ణయ్ లేనా ఏం జరిగినా నన్నడగరా భగవాన్ కో స్మర్నా ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా మనసారా సున్లోనా మనసుంటే సంజోనా అటు పై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీక...