Skip to main content

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది
వేడి పెంచక ఏడిపించక ఏడు పంచి ఊరడించరాదా
గోరు వెచ్చగా గోల రెచ్చెగా జోడు కట్టి జోల కొట్టరాదా
అయితే పద ఓ సంపద తీర్చేదా నీ బాధ
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది

సున్నితాల సొంపులోన కన్నె చూపు జారిపడ్డదే ఓ..
కన్ను దానినాపలేక కన్నెదాని సిగ్గు చెడ్డదే
వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది ఓ..
బెదిరితే కథ కదలదే అని తహ తహ తరుముతున్నదే
ఈడాపద తీరేదలా ఏదోటి చెయ్యందే
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది

లెక్క చెయ్యమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గ నొక్కినా ఓ..
పక్కకెళ్ళి పోకు నువ్వు చుక్కలన్ని నిగ్గి చూసినా
అడగనా ఒక బహుమతి నువ్వు చీ పాడు అనకుంటే ఓ..
అడగకే ఎవరనుమతి చెలి తడి తడి పెదవులు అందితే
కయ్యానికే తయ్యారయ్యి సయ్యాట సయ్యందే

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది
వేడి పెంచక ఏడిపించక ఏడు పంచి ఊరడించరాదా
గోరు వెచ్చగా గోల రెచ్చెగా జోడు కట్టి జోల కొట్టరాదా
అయితే పద ఓ సంపద తీర్చేదా నీ బాధ

kOyilamma paaDutunnadi kannullO kannebomma aaDutunnadi
poolakomma Ugutunnadi gunDellO kOrikamma rEgutunnadi
vEDi penchaka EDipinchaka EDu panchi UraDincharaadaa
gOru vecchagaa gOla recchegaa jODu kaTTi jOla koTTaraadaa
ayitE pada O sampada teerchEdaa nee baadha
kOyilamma paaDutunnadi kannullO kannebomma aaDutunnadi
poolakomma Ugutunnadi gunDellO kOrikamma rEgutunnadi

sunnitaala sompulOna kanne choopu jaaripaDDadE O..
kannu daaninaapalEka kannedaani siggu cheDDadE
vadilitE mari dorakadE ee chOTenta baagundi O..
bediritE katha kadaladE ani taha taha tarumutunnadE
IDaapada teerEdalaa EdOTi cheyyandE
kOyilamma paaDutunnadi kannullO kannebomma aaDutunnadi
poolakomma Ugutunnadi gunDellO kOrikamma rEgutunnadi

lekka cheyyamaaku nuvvu siggulenta bugga nokkinaa O..
pakkakeLLi pOku nuvvu chukkalanni niggi choosinaa
aDaganaa oka bahumati nuvvu chI paaDu anakunTE O..
aDagakE evaranumati cheli taDi taDi pedavulu anditE
kayyaanikE tayyaarayyi sayyaaTa sayyandE

kOyilamma paaDutunnadi kannullO kannebomma aaDutunnadi
poolakomma Ugutunnadi gunDellO kOrikamma rEgutunnadi
vEDi penchaka EDipinchaka EDu panchi UraDincharaadaa
gOru vecchagaa gOla recchegaa jODu kaTTi jOla koTTaraadaa
ayitE pada O sampada teerchEdaa nee baadha

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...