మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా
తేలుతున్నాను నీలి మేఘాలలో
మునుగుతున్నాను తొలిప్రేమ భావంలో
మేలుకున్నాను కలలోన ఉన్నానో
పాటలా ఉంది గాలి ఈలేసినా
ఆటలా ఉంది ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది ఎటు వైపు చూస్తున్నా
Comments
Post a Comment