కళ్యాణం కానుంది కన్నె జానకికీ
వైభోగం రానుంది రామచంద్రుడికీ
దేవతలే దిగి రావాలీ జరిగే వేడుకకీ
రావమ్మా సీతమా సిగ్గు దొంతరలో
రావయ్యా రామయ్యా పెళ్ళి శోభలతో
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రం లాగా
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో అంతా సౌందర్యమే
అన్నీ నీ కోసమే

నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవీ
నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవీ
కళ్ళల్లోనే వాలీ నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి
చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా

ఇట్టే కరుగుతున్నదీ మహాప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నదీ ఎలా కాలాన్ని ఆపడం
వదిలా మంటే నేడు తీయని శృతిగా మారి ఎటో పోతుందీ
కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తను వస్తుందీ
ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా
ఆకాశం అంతఃపురమయ్యింది నాకోసం అందిన వరమయ్యింది
రావమ్మా మహరాణి ఏలాలీ కాలాన్నీ
అందీ ఈ లోకమే అంతా సౌందర్యమే

thankyou
ReplyDeleteGreat song ...chitra garu oka adbutham...Anthe...inka cheppatanikemi ledu...

ReplyDeleteChitra voice perfectly matches to Soundarya
ReplyDelete