Skip to main content

Posts

Showing posts from July, 2009

Padanaa Tiyyagaa from "Vaasu"

నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే నీకోసం నేనే పాటై మిగిలానే చెలియా చెలియా ఓ చెలియా పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలహలమై పడుతున్నా నా గానమాగదులే ఇక నా గానమాగదులే పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా గుండెల్లో ప్రేమకే గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతే అనురాగాల సారం జీవతమనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులొ కలిగే భావం ప్రేమేలే(2) పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా ఆకాశం అంచులో ఆకాశం అంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే అపురూపం అయ్యెనులే కలనైన నిజమైనా కనులెదుటే ఉన్నావే కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం కురిసే వెన్నెల వేసే ఆ బంధం ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే (2) పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలహలమై పడుతున్నా నా గానమాగదులే ఇక నా గానమాగదులే nI jnApakAlE nannE tarimEnE nIkOsam nEnE pATai migilAnE cheliyA cheliyA O cheliyA pADanA tiyyagA kammani oka pATa pATagA batakanA...

June Pote July Gali from "Neevalle Neevalle"

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటా రా రా ప్రేమా (2) జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా అలరించే పరిమళమా వినలేవా కలవరమా కింద భూమి ఉంది ఆటే ఆడమంది నింగే నీకు హద్దు సందేహాలు వద్దు ఇదే తరుణం తలపుకి సెలవిచ్చేయి అణునిముషం మనసుని మురిపించేయి ఏ పువ్వుల్లోను కన్నీళ్ళని చూడలేదే జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే సాగిపోమ్మా పసి మనసా తూలిపోమ్మా పూల ఒడిలో శిల్పి చీల తత్వం శిల చెక్కటమే మగువల తీరు తప్పులెంచటమే గొప్ప వాళ్ళలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం ఈ లోకం లోన ఉన్నోడెవడు రాముడు కాడో జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుంద...

Kanulu terichinaa kanulu musinaa from "Anandam"

For Kavya.... కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కాని ఆ దూరమే నిన్ను దగ్గరే చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది క...

Ni prasnalu nIve evvaro from "Kotta Bangaru Lokam"

Requested by Rajini....... నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా కడతేరిన పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత పది ...

Prema Kanna Emundi from "Astram"

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా this is my love this is my love ఇదో కథలే ఇదో జతలే ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం కలవరమొక వరమనుకో కలలను కంటు ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటు నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది అప్పుడే కదా ప్రేమా చప్పుడైనది వలపే సోకని నాడు ఎడారే గుండె చూడు ముళ్ళని చూడకు నేడు గులాబి పూలకు this is my love this is my love ఇదే కథలే ఇలా మొదలే ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం నిదురెరగని తనువులతో నిలువని పరుగు మగువుల తడి పెదవులతో పిలువని పిలుపు మడుటెండలా తాకే పండు వెన్నెల కొండ వాగులా మారే ఎండమావిలా కనులే మూయను నేను జపిస్తూ ప్రేమ రూపం కవితే రాయను నేను లిఖిస్తా నీ స్వరూపం this is my love this is my love ప్రతి యదలో ఇదో కథలే ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా అ...

Newyork Nagaram from "Nuvvu Nenu Prema"

the toughest to write, excuse for missing word! న్యూయార్క్ నగరం నిదురోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో తరిమే క్షణములో ఉరిమే వలపులో మాటలతొ జోలాలి పాడి నాకు XXXX లేవాయే దినము ఒక ముద్దు ఇచ్చే తెల్లారి కాఫి నువ్వు తేవాయే వింత వింతగ నలక తీసే నాలుకలా నువ్వు రావాయే మనసులో ఉన్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే నేనిచ్చట నీవు అచ్చట ఈ తపనలో క్షణములు యుగములైన వేళ నింగిచ్చట నీలం అచ్చట ఇరువురికిది ఒక మధుర బాధయే గా న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి తెలిసి తెలియక నూరు సార్లు ప్రతిరోజు నిను తలచు ప్రేమా తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో ఉంది తేనేనా జిల్లంటూ భూమి ఎదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా నా జంటై నీవువస్తే సంద్రాన ఉన్న అగ్గిమంట మంచు రూపమే న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద...

Nammavemogani Andaala from "Parugu"

నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది (2) అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది (2) నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగా పాదముని అడుగువేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది (2) వేకువ లోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది వేసవి తాపం చలి వేసి ఆమెను వేడింది శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైనా వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిమి నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది nammavEmO gAni andAla yuvarANi nElapai vAlindi nA mundE virisindi (2) andukE amAntam nA madi akkaDE niSabdam ayinadi endukO prapancham annadi ikkaDE ilAgE nAtO undi nijamgA kaLLatO vintagA mantr...

Evvare Nuvvu Nannu Kadipavu from "Rajubhai"

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు మరి నాకు ఓ మనసుందంటు తెలిసేలా చేసావు మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదురే ఉందా మైనా మైనా ఏ మబ్బులో దూకాడినా ఏ హాయిలో తేలాడినా నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్న ఎవ్వరికైనా ఏ యదకైనా ప్రేమలో పడితే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతోందిగా ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణాం నువ్వైపోయావు దేవతా దేవత దేవత దేవత అది నా దేవత దేవతా దేవత దేవత దేవతా చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై తొలిప్రేమ గా నే మొదలవుతున్నా కలలే కన్నా నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్ని శూన్యమై ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను తియ్యని దిగులై పడిఉన్నాను చెలి లేనిదే బతికేదెలా ఏ ఊపిరైనా ఉత్తి గాలిలే ఎవ్వరె న...

Enduku Enduku Nanu Parigettistavenduku from "Nenu"

From my play list... ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు దరికి రానికా నింగి శశిరేఖా పొదువుకోనీకా ఒదులుకోనీకా ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు పాల నవ్వుల రూపమా నను తాళ నివ్వని తాపమా దారి చూపని దీపమా జత చేరనియ్యని శాపమా (2) తళ తళ తళ తళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా నువ్వు నా సొంతమనే అత్యాశ అరిసేలా నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా జంట కాని జంట లా నా వెంట నడవాలా సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా (2) సల సల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా నిలువునా నీలో కరగని కోరిక విలవిల ఆడేలా ఒక్క పుట్టుక లోనే ఇన్నిన్ని మరణాలా ఎంత దగ్గరవున్నా దక్కదే వరమాలా నన్నిలా ఉరి తాడుతో ఉయ్యాలలూపాలా సౌందర్య జ్వాల సౌందర్య జ...

Manasaa Nuvvunde Chote from "Munna"

Requested by Bobby... మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా (2) ఓ సోన వెన్నెల సోన నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోనా నేనుండి వెలుగైపోనా ఓ సోన వెన్నెల సోన నీ వాలు కన్నుల్లోనా నా చిత్రం చిత్రించేయనా కనుపాపై పోనా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరసా నువ్వు మార్చేసావే నా ఈ వరసా ఓ సోన వెన్నెల సోన రేపావే అల్లరి చాలా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసేయన ఓ సోన వెన్నెల సోన ముంగిట్లో ముగ్గై రానా ముద్దుల్తో ముంచేసేయనా కౌగిలికే రానా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా ఓ నీలో నిండి అన్ని మరిచా ఓ సోన వెన్నెల సోన నీ వ...

Cheppakane Chebutunnavi from "Allari Priyudu"

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను తమకం తో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని (2) చిలిపిగా నీ చేతులు అణువణువు తడుముతుంటె మోహపు తెరలిక తొలిగేనా చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె ఆశల అల్లరి అణిగేనా పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని (2) తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడు మలుపులు తెలిసెననీ తెల్లారనికే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని (2) kanulu vippi kaluva mogga jAbillini chUchenu tamakam tO pAla bugga toli muddunu kOrenu taDi Arani pedavulapai toNikina vennela merupulu cheppakanE cheppakanE cheppakanE chebutu...

Swasallo Swasalle from "Nee Thodu Kaavali"

My Favorite One... శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే నా గుండె జోరల్లే ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటి ని తరలించీ దప్పిక నా మనసుకు మిగిలించీ ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే (2) వాలిపోయిన పొద్దులో ఓ దీపమల్లే వెలిగి రాలిపోయిన ఆశలన్ని రేపిపోయినావే మోయలేని ఓ పూలకొమ్మకు జీవమంటు పోసి ప్రాణమిచ్చి ఆ చిట్టి రెమ్మకు ధ్యానమయ్యినావే బ్రతుకే పచ్చ తోరణంలా ప్రేమ సాగరములా మార్చివేసి నను విడిచిపోయినావే నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని (2) అనుకుంటే ఓ ప్రియా నను విడిచీ పోయావే నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే రాతికైనా నేర్పించుకుంటే మాట పలుకుతుందే కాటినైనా బ్రతిమాలుకుంటే మంటలార్పుతుందే ఏనాటికైన సరిదిద్దుకుంటే రాత మారుతుందే ప్రేమ లోన పడిపోయినాకే మనసు మారుతుందే మనసే చంపుకోని నేను మరిచిపోయి నిన్ను అడుగు తీసి అడుగేసి కదులుతుంటే దూరమని నేను వెళుతు ఉంటే దగ్గరకు మనసు లాగుతుంటే (2) ఓ ప్రియా నా ప్రియా...

Kita Kita Talupulu from "Manasanta Nuvve"

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం నిన్నిలా చేరే దాకా ఎన్నడు నిదురే రాకా కమ్మని కలలో ఐనా నినుచూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడు ఇంకా రెప్ప పాటైనా లేకా చూడాలనుంది నా కోసమా అన్వేషణ నీడల్లే వెంట ఉండగా కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం కంట తడి నాడు నేడు చెంప తడి నిన్నే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా చేదు ఎడబాటే తేలి తీపి చిరునవ్వే చేరి అమృతం ఐపోలేదా ఆవేదనంతా ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా ఈ పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (3) kiTa kiTa talupulu terichina kanulaku sUryOdayam aTu iTu tirugutu alasina ...

Vennello Nadiche Mabbullaga from "Anthapuram"

కళ్యాణం కానుంది కన్నె జానకికీ వైభోగం రానుంది రామచంద్రుడికీ దేవతలే దిగి రావాలీ జరిగే వేడుకకీ రావమ్మా సీతమా సిగ్గు దొంతరలో రావయ్యా రామయ్యా పెళ్ళి శోభలతో వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రం లాగా ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో అంతా సౌందర్యమే అన్నీ నీ కోసమే వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రం లాగా నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవీ నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవీ కళ్ళల్లోనే వాలీ నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో ఆ గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రం లాగా ఇట్టే కరుగుతున్నదీ మహాప్రియమైన ఈ క్షణం వెనకకు తిరగనన్నదీ ఎలా కాలాన్ని ఆపడం వదిలా మంటే నేడు తీయని శృతిగా మారి ఎటో పోతుందీ కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తను వస్తుందీ ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి పాపాయి చేసి నా ప్రాణాలే పోసి నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా ఆకాశం అంతఃపురమయ్యింది నాకోసం అందిన వరమయ్యింది రావమ్మా మహరాణి ఏలాలీ కాలాన్నీ అందీ ఈ లోకమే అంతా సౌందర్యమ...

Asalem Gurtukuraadu from "Anthapuram"

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్నజాజులు హాహాకారం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ ...

Navvaali Neetho from "Neetho"

From my play list... నవ్వాలి నీతో నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో ఆడాలి నీతో అలగాలి నీతో హరివిల్లు మీద ఊగాలి నీతో తడవాలి నీతో ఆరాలి నీతో గడపాలి అనుక్షణం నేనే నీతో నవ్వాలి నీతో నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో వస్తానని మాటిచ్చాక కావాలని నే రాలేక నీలొ చాలా ఆరాటాన్నే పెంచాలి వేరే కన్యను నేనింక వంకర చూపులు చూసాకా నీలో కలిగే అక్రోశాన్నే కాచాలి నీ పైట గాలిని పీల్చాలి నీ మాట తేనెను తాగాలి నును లేత చివాట్లు తింటా నీతో నవ్వాలి నీతో నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో ఆడాలి నీతో అలగాలి నీతో హరివిల్లు మీధ ఊగాలి నీతో చీటికి మాటికి ఊరించి చిలిపితనంతో ఉడికించి ముద్దుగ మూతిని ముడుచుకునుంటే చూడాలి ఓ అంతకు అంత లాలించి ఆపై నీపై తలవాల్చి బ్రతిమాలేస్తూ జతగా నీతో బ్రతకాలి నీ వేలి కొనలను నిమరాలి నీ కాలి ధూళిని తుడవాలి అరచేతి గీతల్లే ఉంటా నీతో నవ్వాలి నీతో నడవాలి నీతో నెలవంక మీద నిలవాలి నీతో ఆడాలి నీతో అలగాలి నీతో హరివిల్లు మీధ ఊగాలి నీతో తడవాలి నీతో ఆరాలి నీతో గడపాలి అనుక్షణం నేనే నీతో

Chitapata Chinukulu from "Aite"

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలీబాబా ఉంటే అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లాఉద్దిన్ జీని ఉంటే చూపదా మరి ఆ మాయ దీపం మన ఫేటే ఫ్లై అయ్యే రన్ వే నడిరాత్రే వస్తావే స్వప్నమా పగలంతా ఏం చేస్తావ్ మిత్రామా ఆ ఊరికేనే ఊరిస్తే న్యాయమా సరదాగా నిజమైతే నష్టమా మోనాలిసా మొహం మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వేకువనే మురిపించే ఆశలు వెనువెంటనే అంతా నిట్టూర్పులు ఊ లోకంలో లేవా ఏ రంగులు నలుపొకటే చూపాల కన్నులు ఇలాగేనా ప్రతిరోజూ ఎలాగైన ఏదో రోజు మనదై రాదా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

Oura Ammaku chella from "Aapadbaandavudu"

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల ఐనవాడే అందరికి ఐనా అందడు ఎవ్వరికి (2) బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల నల్లరాతి కండలతో కరుకైనవాడే వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల జాణ జాణ పదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఆఆ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల బాపురే ...

Neelaala kannullo sandrame from "Subhasankalpam"

హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా (2) సూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనా నువ్వయినా అహ నేనయినా అహ రేవైనా ఆ నావైనా సంద్రాల వీణల సోంతమై హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో హైలెస్సా నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో హైలెస్సా నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే ఓఓ నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే (2) నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే (2) Life is a holiday jolly day hailO hailessaa Spend it away in a fabulous way hailo hailessaa You need a break boy, don't you thank me? Eat a piece of cake hailo hailessaa hailo hailessaa (2) Twinkle little star I know what you are jaane bidO yaar gOlitO maar (2) hailessa hailessa Life is a tamasha you sing idvaneesha I don't know saapaasa నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే అహ హైలెస్సో హైలెస్సా ఆకతాయి పరువాల కోంటెగోల కొటి సంబరాలా (2) ఆపకండి ఈ వేల కూనలాలా కోత్త వానలాలా (2) కొటి సంబరాల కోత్త వానలాలా (2) చెంగుమంటు గంగ పొంగులెత్తు...

Veyyinokka Jillaalaa varaku from "Surya IPS"

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపి లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదుగాని సీత ఊసునే తలచునా పొరపడి భీష్ముండున్న కాలమందు నువ్వు పుట్టలేదుగాని బ్రహ్మచారి గా ఉండునా పొరపడి ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే పాత యుద్ధ గాధలన్నీ మారియుండేవే (2) పొరపాటు బ్రహ్మది కాని సరిలేనిదీ అలివేణి వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపి లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే అల్లసాని వారిదంతా అవకతవక టేస్టు గనక వెళ్ళిపొయెనే చల్లగా ప్రవరుడు వరూధినిని కాక నిన్నే వలెసుంటె కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు కాపురాలు గంగకొదిలి వెంటపడతారే(2) ముసలాడి ముడతలకైనా కసి రేపగలద...

Teeganai Mallelu from "Aaradhana"

From my Play list... తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల మనసు తెర తీసినా మోమాటమేనా మమత కలబోసినా మాట కరువేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా కలలో మెదిలిందా ఇధి కధలో జరిగిందా మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా మారమంటే మారుతుందా మాసిపోతుందా చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల మనసు తెర తీసినా మోమాటమేనా మమత కలబోసినా మాట కరువేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల teeganai mallelu poochina vELa AganA allanaa poojakO maala manasu tera tIsinA mOmaaTamEnA mamata kalabOsinA maaTa karuvEnA teeganai mallelu poochina vELa AganA allanaa poojakO maala telisI teliyandaa idi teliyaka jarigindaa epuDO jarigindaa adi ipuDE telisind...

Snehituda Snehituda from "Sakhi"

నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో...

Enduko Picchi Picchiga Nacchave from "Chiruta"

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే నో నో అనుకుంటూనే స్లో గా చెడిపోయానే లవ్ లో పడిపొయానే మేరి ప్యారి మెహబూబా నడిచే నెలవంక చూస్తే నీ వంక నిదరే రాదింకా ఆ నో నో అనుకుంటూనే స్లో గా చెడిపోయానే లవ్ లో పడిపొయానే మేరి ప్యారి మెహబూబా లైలా జర దిల్దే లైలా లైలా మేరే దిల్మే కోయ్లా ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చంపేస్తుంటే చూస్తూ కూర్చోవాలా పులి లా ఉన్నోడ్ని పిల్లిలా ఐపోయా నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే హో కలలే కంటున్నా కలలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే లైలా జర దిల్దే లైలా లైలా మేరే దిల్మే కోయ్లా అందనంత దూరం లో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అంతా ఇప్పుడేనే ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఇంతటి తోనే చాలు బూరిబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే హో ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తూ ఉంటే రాదా చిరాకే నీకై పడిచచ్...