Skip to main content

Posts

Showing posts from May, 2009

Emi Cheyamanduve from Priyuraalu Pilichindi

లేదని చెప్ప నిమిషము చాలు లేదనమట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవె (2) హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపాను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ అద్దాల ఊయల బింబమూగె చెలీ... నువ్వు తేల్చి చెప్పవే పిల్లా ఎద కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషం చాలు లేదనమట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా తెల్లారి పోతున్నా విడిపొని రాత్రేది వాసనలు వీచే నీ కురులె సఖీ లొకాన చీకటైన వెలుగున్నా చోటేది సూరీడు మెచ్చే నీ కనులె చెలీ... విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా.... ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా.... ఏమి...

Jaabilli kosam from Manchi Manasulu

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4) నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనడైనా (2) ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా ఊహల్లో తేలీ ఉర్రూతలూగి మేఘాలతొటి రాఘాల లేఖ నీకంపినాను రావా దేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా (2) ఉండీ లేకా వున్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నా దన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4) నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై jAbilli kOsam AkASamallE vEchAnu nee rAkakai (4) ninu kAnalEka manasUrukOka pADAnu nEnu pATanai jAbilli kOsam AkASamallE vEchAnu nee rAkakai nuvvakkaDa nEnikkaDa pATikkaDa palukakkaDa manasokkaTi kalisunnadi EnaDainA (2) I puvvulanE nee navvulugA I chukkalanE nee kannulugA nun...

Chukkalle Tochaave from Nireekshana

Requested by Basha....... చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడపోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడపోయావే పూసిందే ఆ పూల మాను నీ దీపంలో కాగిందే నా పేద గుండె నీ తాపం లో ఊగానే నీ పాటలో ఉయ్యాలై ఉన్నానే ఈనాటికి నేస్తాన్నై ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాలకు చేరం తీరందీ నేరం చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే తానాలే చేసాను నేను నీ స్నేహం లో ప్రాణాలే దాచావు నీవు నా మోహం లో ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే ఉందా కన్నీళ్ళకు అర్దం ఇన్నేళ్ళుగ వ్యర్ధం చట్టం దే రాజ్యం చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే chukkallE tOchaavE ennellE kaachaavE EDapOyaavE inni Ela sukkallO ninnu nEnetikaanE inni Ela sukkallO ninnu nEnetikaanE chukkallE tOchaavE ennellE kaachaavE EDapOyaavE pUsindE A poola maanu nee deepamlO kaaagindE naa pEda gunDe nee taapam lO UgaanE nee paaTalO uyyaalai unnaanE I...

I am in love from Satyam

I am in love I am in love I am in love with you కనులలో దాచిన కావ్యమే నువ్వు కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే I am in love I am in love I am in love with you కనులలో దాచిన కావ్యమే నువ్వు కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి నే నీటి చుక్కై పోవాలి నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి నిను చేరి మురిసిపోవాలి చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయి నిను నేను చేరుకుంటే హాయి నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్ల నేనే తడవాలి నాలోని ప్రేమ ఏనాటికైన నీకే అంకితమవ్వని నీకే అంకితమవ్వని I am in love I am in love I am in love with you కనులలో దాచిన కావ్యమే నువ్వు కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే...

Choostu Choostune from Nenu

చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే ఏమొ ఏమైందో ఏమి అర్దం కాకుందే నిద్దర్లో నడక ఇదేమో నిన్నే నువు వెతికావేమొ తెలుసా ఓ మనసా నీకైనా మబ్బుల్లో తెగ ఎగిరావో మైకం లో మునిగున్నావో చెప్పారా నీ తోటి ఎవరైనా ఎవరైనా ప్రేమా ఒ ప్రేమా చూపావే నీ మహిమా ప్రేమా ఒ ప్రేమా నిన్నాపేదెవరమ్మా ఓ ఓ ఓ చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే ఏమొ ఏమైందో ఏమి అర్దం కాకుందే తలపుల్లో జడివానలకు తలపై ఎందుకు ఈ గొడుగు చెలియా నీ మెత్తని అడుగు నా గుండెల్లొ చలి పిడుగు ప్రతి నిజము కలలానే వుందీ అంది మెలుకొనే కలలు కనే నయనం నా చుట్టూ లోకం ఎమైందీ అందీ ప్రతి చొటా నిను చూపే హృదయం ఓ చూపుల్లో నిన్నే నిలిపి ఊహ కి నీ దారే తెలిపి పద పదమని పరిగెత్తిస్తున్నా నా పేరు ని నేనే చెరిపి నా ఆశను నేలొ కలిపి నీకొసం పడి చస్తూఉన్నా ప్రేమా ఒ ప్రేమా చూపావే నీ మహిమా ప్రేమా ఒ ప్రేమా నిన్నాపేదెవరమ్మా ఓ ఓ ఓ చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే ఏమొ ఏమైందో ఏమి అర్దం కాకుందే నువ్వొచ్చీ నేర్పే వరకు పాదాలకు తెలియదు పరుగు నువ్వించిందే ఈ వెలుగు ఇన్నాళ్ళకు నా కన్నులకు - 2 నాక్కూడా కన్నీరొస్తుందీ అంది నా చెంపను నిమిరే నీ స్నేహం బతకటమూ బాగానే వుందీ అందీ నీ జతలో నవ్వే నా ప...

Vellipote elaa from Okariki Okaru

వెళ్ళిపోతె ఎలా మనసా ఎటో అలా ఆయిన ఎందుకె ఇలా తడబాటు అంతలా తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఎలా ఆమె వలలో చిక్కుకున్న సమయం ప్రేమ లయలో దూకుతోందా హృదయం నేను ఇపుడెక్కడున్నానంటే నాక్కూడ అంతు చిక్కకుంటే గమ్మత్తుగానే ఉన్నదంటే నాకేదో మత్తు కమ్మినట్టే రమ్మంది కాని నన్ను చేరి మెరుపు సైగ చేసి చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతెనేసి వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా వెళ్ళనంటే ఎలా ఎలా హే హే తాను కూడ రాకపొతే నాతో నేను కూడా ఆగిపొనా తనతొ నా ప్రాణం ఉంది తన వెంటే నా ఊపిరుంది తననంటే కళ్ళార చూసానంటు వుంటే ఎల్లా నమ్మేదీ స్వప్నమంటే వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా వెళ్ళనంటే ఎలా ఎలా హే హే VeLLipOte elaa manasaa eTO alaa Ayina enduke ilaa taDabaaTu antalaa tega hushaarugaa egiripOkE tagani Uha venTa saraina daari teliyandE I urukulendukanTa VeLLipOtE elaa VeLLipOtE elaa Ame valalO chikkukunna samayam prEma layalO dookutOndaa hRdayam nEnu ipuDekkaDunnaananTE naakkooDa antu chikkakunTE...

Pedave Palikina Maatallone from Nani

పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ యెనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నా ఆలి అమ్మ గా అవుతుండగా జో లాలి పాడనా కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా పొతిల్లో ఎదిగే బాబు నా వొళ్ళో వొదిగే బాబు ఇరువురికి నేను అమ్మవనా నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించనా నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేల్లు సాకనా చల్లగ చల్లగ ఎదిగి ఎదగని ఓ పసి కూన ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో బజ్జో లాలిజో పలికే పదమే వినకా కనులారా నిదురపో కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి ఎదిగి ఎదగని ఓ పసి కూన ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో.. pedavE pali...

Lalita Priya Kamalam from Rudraveena

లలిత ప్రియ కమలం విరిసినదీ లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిది ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని ఉదయ రవికిరణం మెరిసినదీ అమృత కలశముగా ప్రతినిమిషం అమృత కలశముగా ప్రతినిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది లలిత ప్రియ కమలం విరిసినదీ రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం కలల విరుల వనం మన హృదయం వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళి తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినదీ ఉదయ రవికిరణం మెరిసినదీ కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము కాలి...

Oy Oy from Oy

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా ఎల్లో చూడిదార్ వైటు చున్ని తో దోచె నా యద ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో ఓయ్ ఓయ్ ట్వంటి సార్లు కల్లొ కలిసెరో ఓయ్ ఓయ్ ఎంప్టి గుండెనిండ నిలిచెరో ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాల్0ఎ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నను కలిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే 176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా కోపంలోన బ్యూటిఫుల్ చేతల్లోన డ్యూటిఫుల్ మాటల్లొన ఫండమెంటల్ అన్నిట్లోన కాపబుల్ అందర్లోన కేర్ఫుల్ లవ్వే లేని సెంటిమెంటల్ సినిమా లొ మెరిసెటి పాప సిటి లోన దొరకదురా నిజంగానే తగిలెను తార వైజాగు నగరపు చివరన చల్ చల్ జరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జిల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెదిగే హె హె డబ్బుంటేనే అలర్జీ భక్తంటేనే ఎనర్జి నమ్ముతుంది న్యూమరాలజి ఇంటిముందు నర్సరీ అంటనీదు అల్లరీ ఒప్పుకోదు హ్యూమరాలజి ఉండాల్సింది తన బోర్దర్లో చేరాల్సింది మిలిటరి లో ఎదో వుంది సొంపే తనలొ లాగింది మనసును చిటికెలో సం సం వరమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వా వరమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒ ఒ క్షణమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓ యుగమే 176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా ఎల్లో చూడిదార్ వైటు చు...

Janma Neekely from Premiste

జన్మ నీకేలే మరు జన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతోనే అడుగు నీతోనే జన్మ నీకేలే మరు జన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును వలచిన హ్రుదయము తెలుపదులే గడ్డిలో పిచ్చి గా పూసిన పూవులే ఎన్నడు దేవత పూజకు నోచవు లే మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మన ప్రేమకి ఓటమి రానే రాదు ప్రతి నది కి మలుపులు తథ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం యద గాయం మాంపును కాలం సిరి వెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా మినుగురులే ఒడికిరణం తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగ నేఉన్నా గుండెపై నీవుగా వాలిన ప్రేమలో ఎదురుగ పిడుగులే పడినను బిడువను లే స్నానానికి వేనీళ్ళవుతా అది కాచే మంటనవుతా హ్రుదయం లో నిన్నే నిలిపానే నిదురించే కంట్లో నేనే పాపల్లె మేలుకుంటా కలలొ నే గస్తి కాస్తానే నేనంటే నేనే కాదు నువు లేక నేనే లేను నీ కంటి రెప్పల్లే వుంటా జన్మ నీదేలే మరు జన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతోనే (4) janma neekealea maru janma neekealea jatanu viDichaavoe chitiki poetaanea priyatamaa pr...

Ye Rojaite Choosano Ninnu from Gulabi

ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను (2) కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచె గుండెల్లో నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తా నువెటువైపున్నా నీ కష్టం లా నేను ఉన్నానూ కరిగే నీ కన్నీరవుతానూ చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ కాలం ఏదో గాయం చేసిందీ నిన్నే మాయం చేసానంటుందీ లోకం నమ్మి అయ్యో అంటుంది శొకం కమ్మి జోకడతా అంది గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్షమ్నిస్తున్నా నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోగే గుండెల సవ్వడులే అవి చెరిగాయాంటే నే నమ్మేదెట్టా నువు లేకుంటే నేనంటు ఉండను గా నీ కష్టం లా నేను ఉన్నానూ కరిగే నీ కన్నీరవుతానూ చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను Ye Rojaite Choosano Ninnu Aa roje nuvvaipoya nenu (2) Kaalam kaadanna ye dooram addunna nee voopirinai ne jeevistunnanu nee sparse ee veeche gaalullooo nee roope naa veche gundello n...

seheri seheri seheri from Oy

అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే జరగని కలలో ఎప్పుడైన ఈ పని లేని ఆలొచన దండగే కదా ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసెయ్ పయనం మరు నిమిషం లేదంటు లైఫే గడిపెయి మెరుపులా గల గల పారేటి నది ఎక్కనైనా ఆగేనా అది మనసుకు కట్టొద్దు గది ఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరి శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చెలిమై వెలిగిపోవాలంటే తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు గమ్యం ఏదో తెలిసీ సాగిపొవే రేపటికై కలలు కంటు కలలన్నీ నిజం చేస్తూ ఆశే నీ శ్వాస ఐతే రాతే మారిపోదా శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ అంతు లేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం మందీ అందుకోసమే చెపుతున్నా రాజీ పడటం మానుకో కనులకు నచ్చింది చూసెయ్ మనసుకు తోచింది చేసెయ్ అడిగితె ఈమాట చెప్పెయ్ నవ్వుతుండగానె మగ్గి పొతే స్వర్గమే అని శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ appuDeppuDoe jarigina kathaloe ippuDappuDea jaragani kalaloe eppuDaina ee pani leani aalochana danDagea k...

I am waiting for you Baby from "oy'

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నువు నేను ఏకం అయ్యే ప్రేమల్లోనా పొంగే ప్రణయం నిన్నూ నన్నూ వంచించేనా పువ్వే ముళ్ళయి కాటేస్తోందా నీరే నిప్పయి కాల్చేస్తోందా విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనె I am waiting for you Baby ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా ఆ ఊహే తన మదిలో కలతలే రేపేనా విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby chirunavve...

Povodde Povodde Prema from 'Oy'

నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నోదిలి చూపు వెల్లిపోతుందా వేకువనే సందె వాలిపొతోందే చీకటిలో ఉదయం వుండి పొయిందే నా యదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా నువ్వుంటే నేనుంటా ప్రేమా పోవొద్దే పోవొద్దే ప్రేమా నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నోదిలి చూపు వెల్లిపోతుందా ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేదంటుందే నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటె కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే నువ్వుంటే నేనుంటా ప్రేమా పోవొద్దే పోవొద్దే ప్రేమా నువ్వుంటే నేనుంటా ప్రేమా పోవొద్దే పోవొద్దే ప్రేమా nannodilii neeDa veLLipoetoendaa kannoedili choopu vellipoetundaa veakuvanea sande vaalipotoendea cheekaTiloe udayam vunDi poyindea naa yadanea tolichina gurutika ninu testundaa nee jataloe gaDipina batukika bali avutundaa nuvvunTea neanunTaa preamaa poevoddea poevoddea preamaa nannodilii neeDa veLLipoetoendaa kannoedili choopu vellipoetundaa ...

Telugu Evergreen Lyrics for You

తెలుగు సంగీతాభిమానులకి ఉత్సాహ, ఉల్లాస మరియు ఉద్వేగ భరితమైన పాటల విందు మీ ఈ TeluguGreatestLyrics . మా ఈ చిరు ప్రయత్నం తెలుగు మ్యూజిక్ లవర్స్ అందరికి అంకితం. మీకు కావల్సిన పాట మీ నోట పలకటానికి TeluguGreatestLyrics ని సంప్రదించండి.