DISCLAIMER:
సాధారణంగా ఒకరిని ఇమిటేట్ చేసినపుడు, ఈ పాత్రలు కేవలం
కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కావు అంటారు. కానీ, ఈ పాట
మాత్రం రెండు ప్రధాన తెలుగు పత్రికలని ఉద్దేశించి రాసినదే.
ఈ పాట “ప్రేమ” సినిమాలోని “ఐయాం సారీ సో సారీ” పాట ట్యూనుకు
కుదురుతుంది. ఈ పాట అప్పట్లో రాసిన మహానుభావునికి వందనాలు,
వారిని కించ పరిచే ఉద్దేశం కించిత్ కూడా లేదు
Grow up Guys….
రాష్ట్రాన్ని మార్చాలంటే బేబీ మీడియా, నువ్వు గ్రో అప్ కావాలా
రాసేసి సంపాదించాలంటే తండ్రీ మీడియా, నీకొక బకరా కావాలా
అయ్యవారి బొమ్మ వేసిపెడితే బాబు శ్రీధరు, అది కోట్లు తెచ్చి పెట్టాలా
ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ
న్యూసు చూస్తే ఒట్టి గాసే ప్రజాలోకం ఎడ్డిదాయే
వ్యామోజి గగను బాబులు పోతేపోని మీకెంటి బాబులు
వ్యామోజి గగను బాబులు పోతేపోని మీకెంటి బాబులు
ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ
ఈగో కు అందరు దాసులురా, ఈగో కోసమేరా (2)
వ్యామోజి రాసేది గగను జాతకం
గగనుడు కోరినది ఆధిపత్యం (2)
పెన్నుకు తుప్పు పట్టున్నది
వెన్నుకు భయమే లేకున్నది
అందుకనే లేనివని ఉన్నవని అనుకోక రాసెయ్యరా
ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ
ఎన్నో పత్రికలున్నాయిరా
అన్నీ.. పదవుల కోసమే రా
వాళ్ళకు వీళ్ళకు గొడవలురా న్యూసులో తేడారా (2)
పక్కనోడు వస్తే ఏడవొద్దు.. వద్దు
ఈగోను న్యూసులో చేర్చవద్దు (2)
న్యూసుకి సాక్ష్యం లేకున్నది
పత్రికలకర్ధం ఏమున్నది
అందుకని విషయమని అర్ధమని చూసుకోని మారండిరా కమాన్
ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ
న్యూసు చూస్తే ఒట్టి గాసే ప్రజాలోకం ఎడ్డిదాయే
వ్యామోజి గగను బాబులు పోతేపోని మీకెంటి బాబులు
వ్యామోజి గగను బాబులు ఇట్టేఇట్టే ఏలండి బాబులు
ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ
Comments
Post a Comment