Skip to main content

మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా

మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
యద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే నీ గాలే నా పై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే
నా యదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు

చెంతకొచ్చి నువు నిలవటం నిన్ను కలిసి నే వెళ్ళటం
అనుదినం జరిగెడీ నాటకం
ఒక సగాన్ని చెప్పెయ్యటం మరు సగాన్ని దాపెట్టటం
తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసెలే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు

హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదె నే లేను
నా మీద నీ సువాసన ఏనాడు వీచగ కోరెను
ఎలా నిను చేరక బ్రతికేను
నా ఇరు కల్లకి ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే యదలో పూల జల్లులే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు

manasE guvvai egasEnammO cheli nee maaTE vinapaDagaa
pasipaapallE taDabaDinaanE nee choopedanE taakangaa
yada naaDE chEjaarE nee cheyyE nannu sOkagaa
manchallE karigEnE nee gaalE naa pai veechagaa
ayyayyO prEmE puTTenE adi aDagani aaSai paTTenE
naa yadalO EdO merupai merisi talupE taTTenE
kanureppala prEmala chaaTu kanneeru teepainaTTu
naa janTai eppaTikinkaa nuvvunTE antE chaalu
naa venTE nuvvE vastE minnanTE santOshaalu
naa janTai eppaTikinkaa nuvvunTE antE chaalu

chentakocchi nuvu nilavaTam ninnu kalisi nE veLLaTam
anudinam jarigeDI naaTakam
oka sagaanni cheppeyyaTam maru sagaanni daapeTTaTam
teliselE teliselE kaaraNam
kaalaalu poochelE vEgAlu vEchelE
kaluvA nI kATuka kannula choopulu gAraDi chEselE
kanureppala prEmala chaaTu kanneeru teepainaTTu
naa janTai eppaTikinkaa nuvvunTE antE chaalu
naa venTE nuvvE vastE minnanTE santOshaalu
naa janTai eppaTikinkaa nuvvunTE antE chaalu

hE naa kanTiki EmainadO rEyanta erugadu kunukunu
priyaa nuvu lEnide nE lEnu
naa meeda nee suvaasana EnaaDu veechaga kOrenu
elaa ninu chEraka bratikEnu
naa iru kallaki O harivilluvE
nee virisE navvulE yadalO poola jallulE
kanureppala prEmala chaaTu kanneeru teepainaTTu
naa janTai eppaTikinkaa nuvvunTE antE chaalu
naa venTE nuvvE vastE minnanTE santOshaalu
naa janTai eppaTikinkaa nuvvunTE antE chaalu

Comments

  1. u can also find telugu lyrics on telugulyricsonline.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...