రావు గారి అబ్బాయి యాక్టరవ్వాలన్నాడు
కాని వాళ్ళ బాబేమో డాక్టర్నే చేసాడు
పైసలెన్నో వస్తున్నా పేషంట్లా ఉంటాడు
సూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడు
నీకు నచ్చింది చెయ్యకుంటే లైఫులో యాడుంది కిక్కు
నిన్నే నువ్వు నమ్మకుంటే నీకింక ఎవడు దిక్కు
B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say
లేదంటే లైఫంతా నరకం
లక్ష్మి గారి అమ్మాయి డాన్సరవ్వాలనుకుంది
కాని వాళ్ళ అమ్మేమో పెళ్ళి చేసి పంపేసింది
వంద కోట్ల ఆస్తున్నా వంటిట్లోనే ఉంటాది
గజ్జె కట్టాలనుకున్నాది గరిట పట్టుకున్నాది
ఎవడో చెప్పింది చేస్తుంటే లైఫులో యాడుంది కిక్కు
ఎప్పుడూ నువ్వే సర్దుకుపోతే నీకింక ఎవడు దిక్కు
B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say
లేదంటే లైఫంతా నరకం
శీను గాడి బాబాయి లీడరవ్వాలన్నాడు
కాని వీడి తాతేమో ప్లీడర్ని చేసాడు
కేసు వాడి వైపున్నా ఫేసు మాడినట్టుంటాడు
జిందాబాద్ వినాల్సినోడు జడ్జి ముందు తల వొంచాడు
నువ్వనుకున్నది చెప్పకుంటే లైఫులో యాడుంది కిక్కు
నీలో నువ్వే గింజుకుంటే నీకింక ఎవడు దిక్కు
B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say
లేదంటే లైఫంతా నరకం
రేయ్ పెద్ద వాళ్ళు చెబుతారు పక్కనోళ్ళు చెబుతారు
తప్పు లేదు బాసు వాళ్ళకు తోచిందే చెబుతారు
నువ్వు కోరుకుందేంటో నీకు ఏది సూటవుతుందో
అర్ధమయ్యేలా చెప్పకుంటే వాళ్ళు మాత్రమేం చేస్తారు
మనమే క్లియర్గ లేకపోతే అక్కడే వస్తుంది చిక్కు
లేనిపోని భయాలు పెట్టుకుంటే తర్వాత మీకు విగ్గు
B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say
లేదంటే లైఫంతా నరకం
Comments
Post a Comment