Skip to main content

సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం

సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం
తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం (2)
కోనసీమల్లో ఓ కోయిలా కొత్త పాటందుకో హాయిగా
కన్నె వలపుంది కనుపాపలో కాని పిలుపేది నా గొంతులో
నా మనవేదో వినిపించి మనసంత వివరించు
ప్రాణమే నీవని ప్రణయమే నిజమనీ
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం
తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం

చిరునవ్వుల చీరలు కడతా సిరిమువ్వల ముద్దులు పెడతా
సిగపువ్వుల వాసన జల్లి సిరివెన్నెల వంతెన కడతా

పూలబాసలే ఆలకించడు
కన్నెకౌగిట తేనెతీగలా వచ్చి వాలడమ్మా
ఇది పసి వయసుల అనురాగం
తొలి వలపుల చెలియ వియోగం
ఇది మనస్సు జపించి వయస్సు తపించి
వరాలే స్వరాలై వరించే
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం
తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం
కోనసీమల్లో ఓ కోయిలా కొత్త పాటందుకో హాయిగా
కన్నె వలపుంది కనుపాపలో కాని పిలుపేది నా గొంతులో
నా మనవేదో వినిపించి మనసంత వివరించు
ప్రాణమే నీవని ప్రణయమే నిజమనీ
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం
తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం

ఆడజన్మనే హారతివ్వనా
సమర్పించనా వసంతాలతో తపిస్తున్న పరువం
రవికిరణం మగసిరి స్నేహం శశివదనం నిగరని దాహం
యుగయుగాలు నిలేసి సగాలు కలేసి
లయల్లో ప్రియల్లో జయించే
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం
తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం
కోనసీమల్లో ఓ కోయిలా కొత్త పాటందుకో హాయిగా
కన్నె వలపుంది కనుపాపలో కొత్త పిలుపేది నా గొంతులో
నీ ఒడిలోన ప్రాణాల గుడి కట్టుకుంటాను
ప్రాణమే నీదని ప్రణయమే నిజమనీ
సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం
తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం (4)

seetaakOka chilakammaaDu SRngaaraala Subhadinam
teluginTamma guLLO nEDu paDuchandaala SObhanam (2)
kOnaseemallO O kOyilaa kotta paaTandukO haayigaa
kanne valapundi kanupaapalO kaani pilupEdi naa gontulO
naa manavEdO vinipinchi manasanta vivarinchu
praaNamE neevani praNayamE nijamanI
seetaakOka chilakammaaDu SRngaaraala Subhadinam
teluginTamma guLLO nEDu paDuchandaala SObhanam

chirunavvula cheeralu kaDataa sirimuvvala muddulu peDataa
sigapuvvula vaasana jalli sirivennela vantena kaDataa

poolabaasalE aalakinchaDu
kannekougiTa tEneteegalaa vacchi vaalaDammaa
idi pasi vayasula anuraagam
toli valapula cheliya viyOgam
idi manassu japinchi vayassu tapinchi
varaalE swaraalai varinchE
seetaakOka chilakammaaDu SRngaaraala Subhadinam
teluginTamma guLLO nEDu paDuchandaala SObhanam
kOnaseemallO O kOyilaa kotta paaTandukO haayigaa
kanne valapundi kanupaapalO kaani pilupEdi naa gontulO
naa manavEdO vinipinchi manasanta vivarinchu
praaNamE neevani praNayamE nijamanI
seetaakOka chilakammaaDu SRngaaraala Subhadinam
teluginTamma guLLO nEDu paDuchandaala SObhanam

aaDajanmanE haarativvanaa
samarpinchanaa vasantaalatO tapistunna paruvam
ravikiraNam magasiri snEham SaSivadanam nigarani daaham
yugayugaalu nilEsi sagaalu kalEsi
layallO priyallO jayinchE
seetaakOka chilakammaaDu SRngaaraala Subhadinam
teluginTamma guLLO nEDu paDuchandaala SObhanam
kOnaseemallO O kOyilaa kotta paaTandukO haayigaa
kanne valapundi kanupaapalO kotta pilupEdi naa gontulO
nee oDilOna praaNaala guDi kaTTukunTaanu
praaNamE needani praNayamE nijamanI
seetaakOka chilakammaaDu SRngaaraala Subhadinam
teluginTamma guLLO nEDu paDuchandaala SObhanam (4)

Comments

Post a Comment

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...