Skip to main content

పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా

పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ (2)

పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టు ముళ్ళంట అంటుకుంటే మండే ఒళ్ళంతా
తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపుతీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట ఈ వరదలాగా మారితే ముప్పంట
వరదైనా వరమని వరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ ఆ..

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఉపిరయ్యింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీలోని గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది పక్షపాతమెందుకు నాపైనా
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేలా
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ ఆ..

panchadaara bommaa bommaa paTTukOvaddanakammaa
manchupoola kommaa kommaa muTTukOvaddanakammaa
chEtinE taakoddanTE chentakE raavaddanTE Emavutaanammaa
ninu pondETandukE puTTaanE gummaa nuvu andakapOtE vRdhaa ee janma (2)

puvvu paina cheyyEstE kasiri nannu tiTTindE pasiDi puvvu nuvvani pampindE
nuvvu raaku naa venTa ee puvvu chuTTu muLLanTa anTukunTE manDE oLLantaa
teega paina cheyyEstE tiTTi nannu neTTindE meruputeega nuvvani pampindE
merupu venTa urumanTa urumu venTa varadanTa ee varadalaagaa maaritE muppanTa
varadainaa varamani varistaanammaa munakainaa sukhamani muDEstaanammaa
ninu pondETandukE puTTaanE gummaa nuvu andakapOtE vRdhaa ee janma aa..

gaali ninnu taakindi nEla ninnu taakindi nEnu ninnu taakitE tappaa
gaali upirayyindi nEla nannu naDipindi EmiTanTa neelOni goppa
velugu ninnu taakindi chinuku kooDa taakindi pakshapaatamenduku naapainaa
velugu daari choopindi chinuku laala pOsindi vaaTitOTi pOlika neekElaa
avi bratikunnappuDE tODunTaayammaa nee chitilO tODai nEnostaanammaa
ninu pondETandukE puTTaanE gummaa nuvu andakapOtE vRdhaa ee janma aa..

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...