Skip to main content

Posts

Showing posts from August, 2009

Emi sodaraaa mansuki from "Tholiprema"

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే యద వినదాయె సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే తారురోడ్డే స్టారు హొటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే కారు హెడ్ లైట్సే కన్నే కొంటె చూపులాయే పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా క్లాసు బుక్స్ ఎమ బోరాయే న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయె నిముషాలే యుగములై నిద్దర కరువాయే క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె పచ్చనోటు కూడ పేపర్ బోట్సైపోయాయే ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం చాటే కౌగిట్లో గిలిగింత డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా............. 1 Emi sOdarA manasuki EmayindirA oLLu tOmalA pouDaru puyyalA are intalOnE enta DEnjaraipOyarA Emi sOdarA manasuki EmayindirA kaLLu teruchukunTE kalalAye avi mUsukunTE yada vinadAye sarikotta Upu vacchi manasu nilavadAyE tArurODDE sTAru hoTalAye manchinILLE OlD mAnku rammAyE ...

Na gunde gudilo nuvu silavaa from "Villain"

నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా (2) నీ కనుల ఒడిలో నే కలనా కాటుకనా నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా నీ సొగసు పొగడ నే కవినా కల్పననా నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా నే బిడియ పడితే నువు గిలివా చెక్కిలివా నే విరహమైతే నువు రతివా కోరికవా నే పాపనైతే నువు ఒడివా ఊయలవా నే నిదురనైతే నువు కలవా కౌగిలివా నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా నే గగనమైతే వేసవివా వెన్నెలవా నే నదిని ఐతే నువు అలవా అలజడివా నే విందునైతే నువు రుచివా ఆకలివా నే భాషనైతే నువు స్వరమా అక్షరమా నే పాటనైతే నువు శృతివా పల్లవివా నే.. నే.. నే తోటనైతే ఆమనివా కోయిలవా నే జంటకొస్తే నువు రుషివా మదనుడివా నీ ఎదుట పడితే పిలిచేవా వలచేవా నిను నేను పిలవకుంటే నువు అలగవా అడగవా నన్ను ప్రేమించమంటే తప్పా ఒప్పా నీలోన ఉందీ నేనేకదా నేనేకదా నాలోన ఉందీ నీవే కదా నీవే కదా యదలోని వలపే ఎదురెదురు చూసి వాన లాగా ఒడిచేరెనే naa gunDe guDilO nuvu SilavA dEvatavaa naa valapu baDilO nuvu guruvA SishyuDivaa (2) nee kanula oDilO ...

Udayinchina Suryudinadiga from "Kalusukovaalani"

హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం నీ జాడ తెలిసి మరు నిమిషం అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తాళం నువ్వే యదను మీటి సుస్వరమై రావే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా ( || ) నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడ ఎండల్లె మండుతోంది కాస్త దూరమే కాద మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమి వేసే గడియ మన దరికి చేరుకోంది ఏమి మాయవో ఎమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని హోయ్ ను...

Sampangi Remma from "Sampangi"

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే ఓ... నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే పరిసరి పసనిస నినిపమరిస రిపమప మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే ఓ.... యదను తాకగనే ఏదో హాయి రగిలేనే చాటుమాటు గా నిన్నే నే చూస్తున్నానే గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే సంపంగి రెమ్మా.. పూబంతి వమ్మా...... సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే ఓ... కలలో నిన్నే చూసి మురిసిపోతానే ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే ఓ... కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా sampangi remma pUbanti vamma nacchAvE gummA andAla bomma A manchu chemma navvE chilakammA A navvullOnA unnAyennO ardAlOyammA sampangi remma pUbanti vamma nacchAvE gummA n...

Kotta bangaaru lokam maaku kaavaali from "Donga Donga"

కొత్త బంగారు లోకం..మాకు కావాలి సొంతం.. గాలి పాడాలి గీతం.. పుడమి కావాలి స్వర్గం.. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం (3) జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు వెండి వెన్నెల్లలోనే వెయ్యి కలలు పండాలి మాకు పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగిపోవాలి మనసనే ఒక సంపంద ప్రతి మనిషిలోను ఉండనీ మమతలే ప్రతి మనసులో కొలువుండనీ మనుగడే ఒక పండగై కొనసాగనీ కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం (2) ఓడిపోవాలి స్వార్ధం ఇల మరిచిపోవాలి యుద్ధం మరణమే లేని మానవులే ఈ మహిని నిలవాలి కలకాలం ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోనీ శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతి నిత్యం వేదనే ఇక తొలగనీ వేడుకే ఇక వెలగనీ ఎల్లలా పోరాటమే ఇక తీరనీ ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకనీ కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం (2) kotta bangAru lOkam..maaku kaavaali sontam.. gAli pADAli gItam.. puDami kaavaali swargam.. kotta bangAru lOkam maaku kaavaali sontam gAli pADAli gItam puDami kaavaali swargam (3) janTa nel...

kanulu kanulanu dochaayante from "Donga Donga"

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్దం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్దం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్దం అర్దం (2) వాగులే ఉరికితే వయసు కులుకే అని అర్దం కడలియే పొంగితే నిండు పున్నమేనని అర్దం ఈడు పక పక నవ్విందంటే ఊహు అని దానర్దం అందగత్తెకు అమ్మై పుడితే ఊరికత్తని అర్దం అర్దం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్దం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్దం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్దం అర్దం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం పడవలే నదులకు బంధుకోటి అని అర్దం చినుకులే వానకు బోసి నవ్వులే అని అర్దం వెల్లవేస్తే చీకటికి అది వేకువవునని అర్దం ఎదిరితే నువ్వు ఎముకలిరిస్తే విజయమని దానర్దం అర్దం అర్దం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్దం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్దం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్దం అర్దం (2) kanulu kanulanu dOchAyanTE prEma ani dAnardam ningi kaDalini dOchEnanTE mEGhamani dAnardam tummeda puvvuni dOchindanTE prAyamani dAnard...

Malli Malli idi raani from "Rakshasudu"

Requested by Bhavani మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైనా ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎందల్లో వెన్నెల్లొ ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నా యదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లొ ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబిలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేది సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కొరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు maLLi maLLi idi rAni rOju malli jAji allukunna rOju j...

E jenda pasi bosi chirunavvu ra from "Bobby"

ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలతొ పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లొడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మానవలికే వైతాలిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆ రుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిదిచాలురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా మంచు మల్...

Priyatamaa na hrudayama from "Prema"

ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా ప్రేమ కే ప్రతి రూపమా నా గుండెలో నిండినా గానమా నను మనిషిగా చేసినా త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళ తోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి యదలోని సెగలు అడుగంతమాపి తులి వెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయ లాగా జత చేరినావు నువ్వు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా నీ పెదవి పైనా వెలుగారనీకు నీ కనులలోనా తడి చేరనీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లి నను ముంచనీకు ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిను మింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు పది జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా ప్రేమ కే ప్రతి రూపమా నా గుండెలో నిండినా గానమా నను మనిషిగా చేసినా త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా priyatamA nA hRdayamA priyatamA nA hRdayama prEma kE prati rUpamA prEma kE prati rUpamA nA gunDelO ninDi...

Edo priyaraagam vintunna from "Arya"

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైనా ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తియ్యని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం ఓ పాట పాడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం అడవినైన పూతోట చేయదా ప్రేమ బాటలో పయనం దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిత్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఓ ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుతున్నానా చెలియ లోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా ఆమె లోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయా...

Enaati varaku naa gunde from "Sontham"

ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనే లేదే ఏంటిలా ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా (2) అరెరె ఎన్నడూ ఈ రంగులు నేను చూడనే లేదే ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురు కాలేదే మనసా ఆ ఆ ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనే లేదే ఏంటిలా ప్రేమ అంటే ఎమిటంటే తెలిసే దాక తెలియదంతే ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే ఎంతమాత్రం నమ్మనంటూ నాలో నేను నవ్వుకుంటే నన్ను సైతం వదలనంటూ వచ్చి కమ్ముకుందే కథలు విన్నా ఎదరే ఉన్నా అసలు సంగతి తేలదుగా అనుభవంతో చెబుతూ ఉన్నా రుజువు నేనేగా ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనే లేదే ఏంటిలా ఒక్కచోటే కలిసి ఉన్నా తనతో పాటు ఇంత కాలం ఒక్క పూట కలగలేదే నాకిలాంటి భావం ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంత దూరం ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం కంట పడని ప్రాణం లాగా గుండె లోనే తానున్నా జ్ఞాపకాలే తరిమే దాకా గుర్తు రాలేదే ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా eenATi varaku nA gunDe layaku I vinta parugu inta uruku lEnE lEdE EnTilA I tIpidigulu modalaindi modalu ennenni kalal...

Yamaho ni yama yama from "Jagadekaveerudu Atilokasundari"

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింతా దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళన్ని నువ్వు పుట్టింది నాకోసమని ఇక నీ సొగసు నా వయసు వేడుకొనే ప్రేమలలో యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ జమ జమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కా నోళ్ళు పెట్టి ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండపెట్టి చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్...

Jolaajo lamma Jola from "Sutradhaarulu"

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా (2) లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే ఆఆ రేపల్లే గోపన్నా రేపు మరిచి నిదరోయే రేపు మరిచి నిదరోయే యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా అరెరెయ్రెయ్ యాహి యాహి యాహి యాహి యాహి యాహి వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై సీత తోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూ...

Na cheli rojave from "Roja"

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే యదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంటా నీవు లేకపోతే బతుకు దండగంటా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే....... చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో మమత దూరమాయనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూల వనం వాడిపో తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా విడిపోని నీడ నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే...... nA cheli rOjAvE nAlO unnAvE ninnE talichEnE nEnE kaLLallO nIvE kannITA nIvE kanumUstE nIvE yadalO ninDEvE kanipinchavO andinchavO tODu nA cheli rOjAvE nAlO unnAvE ninnE talichEnE nEnE gAli nannu tAkinA ninnu tAku jnApakam gulAbIlu pUsinA chilipi navvu jnApakam alalu pongi pAritE cheliya paluku jnApakam mEghamAla sAgitE mOhakath...

Helo guru prema koame from "Nirnayam"

హలో గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని హలో గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని చదువు సంధ్య కలిగినోడ్ని చౌక భేరమా గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నా కన్నా నీకున్నా తాఖీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురూ ప్రేమ కోసమేరొ ఈ జీవితం (2) కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవు సాంగ్లు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కాం నహీ కియా అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రడీ హలో గు...

Hrudayam Orchukolenidi from "Parugu"

హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం పెదవులు విడిరాకా నిలువవే కడదాకా జీవంలో బతకవె ఒంటరిగా లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం ఊహల లోకంలో ఎగరకు అన్నావే తేలని మైకంలో పడకని ఆపావే ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు చల్లని చూపులతో దీవెనలిస్తాడు అంతటి దూరం ఉంటే బ్రతికించే వరంవుతాడు చెంతకి చేరాడంటే చితి మంటే అవుతాడు హలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం hRdayam OrchukOlEnidi gAyam ikapai talachukOrAnidi I nijam pedavulu viDirAkA niluvavE kaDadAkA jIvamlO batakave onTarigA lO lO mugisE mounamgA O O O hRdayam OrchukOlEnidi gAyam ikapai talachukOrAnidi I nijam Uhala lOkamlO egaraku annAvE tElani maikamlO paDakani ApAvE itarula chirunavvullO nanu veliginchAvE prE...

Ninu vetiki vetiki chusi from Anumaanaaspadam

Requested by Satish నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాల కన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మై లవ్ ఓ మై లవ్ (2) నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు మన అసలు పేరు నీడా అడుగడుగు తోడుగా కధ నడుపు తమరి జాడా కనపడదు వేడుకా కరి మబ్బు చాటు తార కనిపించెనా సితార చిరు చీకటింటి నీడ వెలిగింది కంటి నిండా విరహాల ఆలయాన విరజాజి హారతేలా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చిరు కనుల ఎరుపులే వలపు గెలుపులై తెలుపనా నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు ఉసిగొలుపు ఉడుకు తనమా చలి పొగరు చాలు లే కుదురైన కలికితనమా కసి కధలు చెప్పకే యదకెదుగు చిలిపి తనమా సొద పెట్టి చంపుతావా పొదలడుగు వలపు తనమా పెదవుల్లో దాచుతావా నిదురమ్మ పలకరింతా నివురొయె అలచినంతా హృదయాల సీమ లోనా యద గాన కోకిలేనా మన ఏడు జన్మలే ఏడు రంగులై కలిసెనా నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాల కన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మై లవ్ ఓ మై లవ్ (2) ని...

Nuvvu Chudu Chudakapo from Okato Number Kurradu

నువ్వు చూడు చూడకపో.. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా మనసు పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా పూజించటం పూజారి వంతు వరమివ్వటమన్నది దేవత ఇస్టం ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించటమన్నది ప్రేయసి ఇస్టం ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదు గా నిన్ను మరవటం జరగదు గా ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా నిను చూడలని ఉన్నా... నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా లోలోనా నాలోనా కన్నీరవుతున్నా nuvvu chUDu chUDakapO.. nu...