ఈ పాట మాతృక రాసిన రామ జోగయ్య శాస్త్రి గారి కి వందనాలు గృహిణుల కష్టాలకి నా ఈ పాట అంకితం చంద్రుడ్ని చూసేసి తలుపుల్ని తెరిచాను నువ్వొచ్చే దారుల్లో ట్రాఫిక్కు చూసాను కమ్యూటు బండెక్కి రా రా మనసిటీ గుంతల్లో పదిలంగా రా రా కాలేటి అట్లకాడ గుర్తొచ్చి రా రా అరకోటి బూతులతో పిలిచినా రా రా పెనిమిటి ఎన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని ఎన్నెన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని చిమ్మటీ చీకటి పొద్దుటి గ్రీనుటీ ఎర్రటి కుంపటి నల్లటి బూటొకటి కర్రల్లో పొడవటి ఉందిలే ముచ్చటి గొంతు మీద కాలు వేసి ఆడతాను రా రా పెనిమిటి కొలువేమో ఐటి అన్నావని తెగ పొంగిపోయా పిచ్చిదానిని విడుదల లేని ఒక వంటదానిని చేస్తివి గదా నన్ను బలిపశువుని చూసీ చూడక చులకన చేస్తివి నా తలరాతనే నువ్వే రాస్తివి చీపురు కట్ట తలచుకొని తరలి తరలి రా రా పెనిమిటి ఆఫీస్నుంచారుకే బయటి కొస్తివే పది గంటలైనా కంటి కందవే బేవార్సు దోస్తులతో సొల్లు పెడితివో ద్రాక్షపు బుడగలలో తడిసిపోతివో ఏ చెత్త తింటివో యాడ కక్కుంటివో మందుకిక్కు తలకెక్కి యాడ పడుకుంటివో నువ్వు గన్న తాటకినైన తలచి తలచి రా రా పెనిమిటి