Skip to main content

Posts

Showing posts from August, 2012

ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు

ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్నా గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటి సారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి భాదలే ఆగని ప్రయాణమై యుగాలుగా సాగినా ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే ఝల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ భాదకే ప్రేమన్న మాట తక్కువైందిగా గుండెలో చేరావుగా ఉచ్చ్వాశ లాగ, మారకే నిశ్వాశలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా, నువ్వలా ఉన్నవెలా నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటు మెలకువే కలే చూపే ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చెయ్యను నువ్వే చెప్పవా ఈ భాదకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్నా గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటి సారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి భాదలే EmiTO ivvaaLa rekkalocchinaTTu v...