Skip to main content

Posts

Showing posts from October, 2011

ముత్యాల ధారని, మురిపించే రేయిని

ముత్యాల ధారని, మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా ముత్యాల ధారని, మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ ఓ అలలా.. ఓ సుమ ఝరిలా.. ఓ.. కదులుతున్న నీ కురులందే నే దాగనా వరించేటి వెన్నెల నీడై పులకించనా అరె వెన్నే తాకాలంటు మేఘం దాహంతోటి పుడమే చేరెనా వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటు కడలే చేరెనా హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా ఓ. ఓ. రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా కలనైనా ఓ క్షణమైనా నిన్నే చేరమంటూ యదలో పోరాటం నిన్నే కోరుకుందే నాలో ఆరాటం పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లే...

చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా

Karthik rocks again with Sirivennela's beautiful lyric! చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా... పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ నవ నిధులు వధువై వస్తుంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నేనైనట్టూ చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడై పోతాను నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను నీ సౌందర్యంతో ఇంధ్ర పదవినెదిరిస్తాను నీ సాన్నిత్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను ఏళ్ళే వచ్చీ వయసును మళ్ళిస్తుంటే నే నీ ఒళ్ళో పాపగ చిగురిస్తుంటే చూస్తున్నా... చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా... choostunnaa choostu unnaa...