Skip to main content

Posts

తాను నేను మొయిలు మిన్ను

తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను వేరైపోనీ పుడమి మన్ను నేను తాను రెప్ప కన్ను వేరైపోనీ పుడమీ మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనసు మేను…
Recent posts

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమని అవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు నే రాని దూరాలే నువు పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ దగ్గరగా రానీను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానగా ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యునితో జతకట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వు నేనంటు పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే ఇది ఓ వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలిగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా నువు నవ్వేటి కోపానివే మనసెతికినా ఓ రాయివే నువు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు నా ప్రాణం తిర...

పెనిమిటి ‌‌‌పేరడీ

ఈ పాట మాతృక రాసిన రామ జోగయ్య శాస్త్రి గారి కి వందనాలు గృహిణుల కష్టాలకి నా ఈ పాట అంకితం చంద్రుడ్ని చూసేసి తలుపుల్ని తెరిచాను నువ్వొచ్చే దారుల్లో ట్రాఫిక్కు చూసాను కమ్యూటు బండెక్కి రా రా మనసిటీ గుంతల్లో పదిలంగా రా రా కాలేటి అట్లకాడ గుర్తొచ్చి రా రా అరకోటి బూతులతో పిలిచినా రా రా పెనిమిటి ఎన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని ఎన్నెన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని చిమ్మటీ చీకటి పొద్దుటి గ్రీనుటీ ఎర్రటి కుంపటి నల్లటి బూటొకటి కర్రల్లో పొడవటి ఉందిలే ముచ్చటి గొంతు మీద ‌కాలు వేసి ఆడతాను రా రా పెనిమిటి కొలువేమో ఐటి అన్నావని తెగ పొంగిపోయా పిచ్చిదానిని విడుదల లేని ఒక‌ వంటదానిని చేస్తివి గదా‌ నన్ను బలిపశువుని చూసీ చూడక చులకన చేస్తివి నా‌ తలరాతనే నువ్వే రాస్తివి చీపురు కట్ట తలచుకొని తరలి తరలి రా రా పెనిమిటి ఆఫీస్నుంచారుకే బయటి కొస్తివే పది గంటలైనా కంటి కందవే బేవార్సు దోస్తులతో సొల్లు పెడితివో ద్రాక్షపు బుడగలలో తడిసిపోతివో ఏ చెత్త తింటివో యాడ కక్కుంటివో మందుకిక్కు తలకెక్కి యాడ పడుకుంటివో నువ్వు గన్న తాటకినైన తలచి తలచి రా రా పెనిమిటి

ఓ నీలవేణి నీలవేణీ రావే అలకమాని

Back with a beautiful lyric ఓ నీలవేణి నీలవేణీ రావే అలకమాని నీ హంస నడకలని ఫాలో అవుతున్నానని కోపం లోనూ ఇంతందమా మనకి మనకి తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా నీడై నీడై పోనా ఇలా.. తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా నీడై నీడై పోనా ఇలా.. ఎండపడి ఎర్ర ఎర్రగా కందినదె లేత బుగ్గ గొంతు తడి ఆరి ఎంతగా వాడినదొ మల్లెమొగ్గ నీకోసం నీలి మబ్బునై ఆకాశం చేరనా నేనే ఓ వాన జల్లునై ఒళ్ళంతా తడమనా కూడా కూడా రానా నీడై నీడై పోనా తేడాలెన్నో ఉన్నా ఇలా.. ఇలా.. సోయగము విసిరి గుండెకే చేయకిక తీపి గాయం సోకులతో నన్ను చంపటం నీకు ఇది ఏమి న్యాయం నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా నువ్వేడు మల్లెలెత్తువని ఇష్టంగా మోయనా కూడా కూడా రానా నీడై నీడై పోనా తేడాలెన్నో ఉన్నా ఇలా.. ఇలా.. O neelavENi neelavENI raavE alakamaani nee hamsa naDakalani faalO avutunnaanani kOpam lOnU intandamaa manaki manaki tEDaalennO unnaa kooDaa kooDaa raanaa neeDai neeDai pOnaa ilaa.. tEDaalennO unnaa kooDaa kooDaa raanaa neeDai neeDai pOnaa ilaa.. enDapaDi erra erragaa kandinade lEta bugga gontu taDi aari entagaa vaaDinado mallemogga neekOsam neeli mabbunai aakaa...

ఆవేశమంతా ఆలాపనేలే

ఆవేశమంతా ఆలాపనేలే.. యద లయలో ఆవేశమంతా ఆలాపనేలే.. ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జలించే స్వరాలా ఆవేశమంతా ఆలాపనేలే అలపైటలేసే సెలపాట విన్న గిరివీణమీటే జలపాతమన్న నాలోన సాగే ఆలాపన రాగాలుతీసే ఆలోచన జర్ధరతల నాట్యం.. అరవిరుల మరుల కావ్యం ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగె గానం నిదురలేచె నాలో హౄదయమే.. ఆవేశమంతా ఆలాపనేలే.. యదలయలో ఆవేశమంతా ఆలాపనేలే… వలకన్యలాడే తొలి మాసమన్నా గోధూళి తెరలొ మలిసంజె కన్నా అందాలు కరిగే ఆవేదన నాదాల గుడిలో ఆరాధన చిలిపి చినుకు చందం.. పురివిడిన నెమలి పింఛం యదలు కదిపి నాలో.. విరిపొదలు వెతికె మోహం బదులు లేని ఎదో పిలుపులా ఆవేశమంతా ఆలాపనేలే.. యదలయలో నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జలించే స్వరాలా ఆవేశమంతా ఆలాపనేలే..

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే... అదేమిటే

DSP Rocks as Lyricist as well! నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏయ్.. అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే ఏయ్.. భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే ఏయ్.. అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంటపడనా నావలా నువ్వు తూగుతూ నడుస్తుంటే కాపలాకి నేను వెంటరానా కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రావే మరదలా అత్త లేని కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద మీగడేదమ్మా వేడి పాలల్లోన వెన్న ఏదమ్మా మోనలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాల సీస అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం కోహినూరు వజ్రాన్ని ...

ఓ మధురిమవే ఎందుకు వచ్చావే

Beautiful tune with superb lyrics ఓ మధురిమవే ఎందుకు వచ్చావే నా మనసునిలా ముక్కలు చేశావే నీ తలపులలో ముళ్ళే ఎన్నెన్నో… గాయం చేసే… ఇలా నీ కలవరమే వెల్లువలా తాకే ఈ కలయికలో వేదనలే చూపే నా యద లయలో అలజడులే ఎన్నో… ప్రళయం రేపే… ఇలా నీవే కోరి వెళుతున్న తీరం ఇదీ నన్నే కమ్ముకుంటున్న శూన్యం ఇదీ కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే నా ప్రాణం నిన్నే కోరిందే చెలియా చెలియా… నిజమే కదటే నీ వైపే అడుగులు వేస్తుందే చెబితే వినదే ఈ నిమిషాన నా లోకం మారిందని… నమ్మాలా నా హృదయాన నీ రూపం మరుగవదే…. ఏమైనా కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే O madhurimavE enduku vacchaavE naa manasunilaa mukkalu chESaavE nee talapulalO muLLE ennennO… gaayam chEsE… ilaa nee kalavaramE velluvalaa taakE ee kalayikalO vEdanalE choopE naa yada layalO alajaDulE ennO… praLayam rEpE… ilaa neevE kOri veLutunna teeram idI nannE kammukunTunna Soonyam idI kalalaa kalisi gatamayyaavE jatagaa...